బాబాను నమ్మిన తర్వాత చింతలకిక తావెక్కడ !



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా ఇంటికి సాయంత్రం పూట ఆయన కాలేజీ వాళ్ళు , కొంచెం దూరంగా ఉన్న కుటుంబాల వాళ్ళు (ఆడవాళ్ళూ , మగవాళ్ళు) మా వారితోనూ, నా తోనూ కబుర్లు చెప్పుకోవడానికి సరదాగా గడపడానికి వస్తుండేవారు.

సాధ్యమైనంత వరకూ ఒక గంట, గంటన్నర కంటే ఎవరు ఎక్కువ సేపు ఉండేవారు కాదు, ఒక్కళ్ళు ఇద్దరు మాత్రం చాలా ఆలస్యం అవుతున్నా దాదాపు రాత్రి 7 .30 అవుతున్నా కూడా వెళ్లే వాళ్ళు కారు.

ఒకసారి ఒకావిడ మాట్లాడుతూ అలాగే ఉండిపోయింది, మా వారికి కోపం వచ్చేసింది, అది చూసి నేను ఆవిడతో ”మీకు పని లేదా ఇంకా వెళ్ళ రేంటి?” అని అడిగేసాను,

ఆవిడ ”వెళ్ళిపోతాలెండి” అంటూ, ”ఏం మీ వారు సీరియల్స్ వినాలా” అంటూ వెళ్ళిపోయింది. నేను ఆవిడతో పాటు గేటు దాకా వెళ్ళాను,

ఈ లోపల మా వారికీ ఫోన్ వస్తే అటు వంటిల్లు దాటి అవతల వరండాలో నిలబడి మాట్లాడుతున్నారు. ఈవిడ ఇటు నుండి ఆయనతో వెళ్లి వస్తాను అని చెప్పబోతోంది,

ఆయన ఫోన్ మాట్లాడుతున్నారుగా! మీరు వెళ్లి రండి నేను చెబుతాను అంటూ ఆవిడని గేటు దాటించి గేటుకి తాళం వేసి రెండు నిమిషాల్లో లోపలి వచ్చాను,

ఈ లోపలే మా వారు ఫోన్ మాట్లాడేసి లోపల హాల్లోకి వచ్చి కూర్చున్నారు. నేను లోపలకి రావటం గమనించి, T . V పెట్టు అన్నారు,

నేను ఉండండి వంటింట్లో లైట్ వేసి వస్తాను అంటూ లోపలికి వెళుతుండగా వంటింటి గుమ్మంలో నల్లగా ఇంత పొడుగ్గా ఏదో కనపడింది.

మా పెద్ద అమ్మాయి పెళ్లి అయినా కూడా అది రెండు జడలు వేసుకుని నల్ల రిబ్బన్లు కట్టుకుంటుంది, అది కూడా లేదు కదా మరి నల్ల రిబ్బన్లు ఎక్కడ నుండి వచ్చాయి అనుకుంటూ దగ్గరికి వెళ్ళాను

అది కూడా కదులుతోంది వెంటనే అక్కడ లైట్ వేసాను నా గుండె ఝాల్లుమనేట్లుగా మూడు అడుగుల ”నల్ల త్రాచు” పాము పొడుగ్గా ఉంది.

మా వారు అది దాటుకుని హాలు లోకి రావాలి ఆయనను నేను ”ఎలా వచ్చారు” అంటూ ఆత్రంగా అన్నాను.  ”ఎలా ఏముంది అలానే వచ్చేసాను, ఏం ఏమైంది?” అన్నారు.

మీరు ఇటు పక్కకి రాకండి ఇక్కడ పాముంది, కాళ్లు పైకి పెట్టుకుని కుర్చీలోనే కూర్చోండి అన్నాను.

ఎవరికైనా ఫోన్ చేయాలంటే అవతల రూమ్ లోకి వెళ్ళాలి, ఫోన్ అక్కడ ఉంది. నేను అటు వెళ్ళాలంటే పాము అడ్డంగా ఉంది.

నేను ఎలాగైనా అటు వెళ్ళినా ఆ ఫోన్ తెచ్చే లోపున ఈ పాము కాస్త ఎక్కడైనా దూరిపోతుందేమో అని అనుకున్నాను,

నా కేమి చేయాలో తోచట్లేదు ఈ లోపు కొంచెం కదిలింది ఆ పక్కనే మోరీ ఉంది అందులోంచి బయటకు వెళ్ళిపోతుందేమో అనుకున్నాను.

అది అటు వెళ్ళకుండా పక్కనే ఉన్న తలుపు సందులోకి దూరింది. ఆ తలుపు కింద నుండి ఆ పాము అడుగు భాగం తెల్లగా కనిపిస్తోంది.

గబుక్కున ఫోన్ తెచ్చి ఒకాయనకి ఫోన్ చేశాను, ఆయన యక్ష ప్రశ్నలు వేసాక వచ్చి ఆ పాముని కొట్టేసారు.

నాకింకా ఇప్పటికీ మా వారు పామును దాటుకుని దాన్ని తొక్కకుండా ఎలా ఇవతలికి రాగలిగారన్నదే ప్రశ్న,

ఎందుకంటే మాములుగా కళ్ళు కనిపిస్తున్నవాళ్ళే పాముని దాటి రావటానికి కష్టం, అలాంటిది ఆయనకి కళ్ళు కనపడవు కాబట్టి అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తారు.

ఆ తరువాత మాస్టర్ గారి శిష్యుడుని నేను అడిగాను, జరిగినదంతా చెప్పి స్వామి ఇలా ఎలా జరిగింది, అది ఎలా సాధ్యపడింది అని,

దానికి ఆయన ఇచ్చిన సమాధానం ”అమ్మా మీరు నమ్ముకున్నది ఎవరిని? ఆయన మాములు చిన్నతను కాదు అంత పెద్దాయన్ని పట్టుకున్నారు మరి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది, కష్టం పెడతారు” అన్నారు.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles