Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి రాం..
ఇప్పుడు నేను చెప్పబోయే లీల..బాబా కలిగించే అనుభూతిలో ఒక మైలురాయి అనే చెప్పవచ్చు.
అంత అద్భుతంగా ఉంటుంది.నేను షిర్డీ నుంచి శంబల్పూర్ చేరుకున్నాను.
నా జాబ్ ఉన్న ప్లేస్ కు, ఆఫీస్ లో జాయిన్ అయ్యాను.
తరువాత రోజే మా ఆఫీసర్ నన్ను భువనేశ్వర్ కు ఒక ట్రైనింగ్ కు వెళ్ళమని పంపినారు.
నేను శనివారం పొద్దున భువనేశ్వర్ చేరుకున్నాను.
సోమవారం నుంచి ట్రైనింగ్.శనివారం,ఆదివారం ఖాళీగానే వున్నాను.
నాకు మనసులో ఒక వేదనగా ఉండేది.
రెండు రోజులు weast అవుతాయి,సాయి గాయత్రీ జపం ఆగిపోతుందేమో, ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఒక పిన్నిగారు (ముసలావిడ) గుర్తువచ్చారు.
పోయిన సంవత్సరం వాళ్ళ ఇంట్లో సాయిగాయత్రీ చేసాను.ఆవిడ ఫోన్ నెంబర్ వెతికి ఆవిడకు కాల్ చేసాను.
ఒకవేళ ఆవిడ ఒప్పుకుంటే సాయంత్రం వాళ్ళ ఇంట్లో చేస్తాము..అనుకున్నాను.
ఫోన్ లో ఆవిడ మాటలు విని నేను ఆశ్చర్యపోయినాను.
ఆవిడ అన్నారు
“మాధవి,ఎక్కడికి వెల్లవు,ఇన్నిరోజులు, గత పది రోజులుగా నాకు నువ్వే గుర్తువస్తున్నావు,మా ఇంట్లో సాయి గాయత్రి చేసుకుందా ము,సాయంత్రం..వస్తావా.. అని.ఆవిడకు నేను శంబల్పూర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్లానని తేలేదు పాపం.నేను ఫోన్ లో”
పిన్నిగారు, బాగున్నారా! అన్నాను,అంతే..ఆవిడే అన్ని చెప్పేసారు.నేను,సరే వస్తాను,మరి మీరు అన్ని తయారు చేయగలరా? అని అడిగాను.
ఆవిడ చేస్తాను..అన్నారు..నేను సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళ ఇల్లు చేరుకున్నాను.చాలా బాగా అన్ని రెడీ చేశారు.
15 మంది బాబా వారి భక్తులు వచ్చారు.
మేము సాయి గాయత్రి మహా మంత్రం జపం మొదలు పెట్టాము.
మూడు మాలలు చేసాము..వాళ్ళు అందరూ నాతో నాలుగో మాల చేస్తున్నారు.
మధ్యలో అందరూ ఆగిపోయినారు.నేను అంత చూసుకోలేదు.
అలాగే కొనసాగుతూవుంది జపం.మళ్ళీ అందరూ ఆగినారు.అప్పుడు నేను గమనించాను” అడిగాను.
ఎందుకు ఆగిపోయారు,అని..వాళ్ళు చెప్పారు” నీ గొంతు తో పాటు ఎవరో మొగవాళ్ళ గొంతు వినపడుతావుంది” అన్నారు.
వాళ్ళు అందరూ స్పష్టంగా విన్నారంట.. అలాగే రెండు సార్లు నా గొంతుతో పాటు ఒక మొగవాళ్ళ గొంతు విన్నారంట.
ఇంక వాళ్ళ ఆనందానికి హద్దులేదు.అందరూ భావోద్వేగానికి లోను అయినారు.అందరి కళ్ళలో నీళ్ళు.
“మాధవి, నీతో పాటు బాబాను కూడా తెచ్చావు” అన్నారు.ఆ పిన్నిగారు అయితే ఎంత ఆనందపడ్డారో.ఆవిడ నిజానికి పోయిన సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు.
మళ్ళీ ఇంట్లో సాయి గాయత్రి చెయ్యాలని.వాళ్ళు ఇంట్లో మొదటిసారి చేసినప్పటి నుంచి,ఇంట్లో బాబా తిరుగాడుతున్నట్లు ఉందని నాకు చెప్పారు.
ఆవిడ ఒక్కతే వుంటారు ఇంట్లో.ఆవిడకు ఎవ్వరు లేరు.ఒక్క కొడుకు దూరం ఎక్కడో ఉంటాడు.
నేను ఎక్కడ గాయత్రి చేసిన,ముందు మిమ్మల్ని గుర్తుచేసుకుంటాను.”మీరే నడిపించాలి గురువుగారు” అనుకుంటాను మనసులో.మరి ఇప్పుడు నా గొంతుతో పాటు బాబా గొంత కాదు మీ గొంతే అని నాకు వేరే ఇంట్లో చేసేటప్పుడు తెలిసింది.
ఆ పిన్నిగారు నాకు ఒక షాల్ కూడా ఇచ్చారు.సన్మానం చేశారు.”
వద్దు, అన్నా వినలేదు.ఇంక ఆమె సంతోషం కోసం ఒప్పుకున్నాను.ఇది నాకు భువనేశ్వర్ లో సాయి గాయత్రి మహా మంత్రం జపం చేసేటప్పుడు కలిగిన ఒక గొప్ప అనుభూతి.
ట్రైనింగ్ పేరుతో బాబా నన్ను భువనేశ్వర్ పంపినారు పిన్నిగారిని అనుగ్రహించాలని.బాబా లీలలు బాబా కె తెలుసు.నేను నిమిత్తమాత్రురాలినే.
సర్వం సాయి నాతర్పణమస్థు..🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Latest Miracles:
- మనసులో బాబాను చూడాలన్న కోరిక దృఢంగా ఉంటే కూలిపోయే వంతెనను కూడా దాటగలం!
- నేను ఎల్లప్పుడు నీతో లేనా? ఇంట్లో ఉండు, నా నామం స్మరించు
- అయ్యప్ప స్వాములతో పాటు వచ్చి భిక్ష స్వీకరించిన బాబా వారు!
- నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.
- సుధా మాధవి గారి తండ్రి కి సాయి చేసిన ఆపరేషన్–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments