Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నామం కనీసం మూడు గంటలయినా చెబుతాము. మే 1 వ తారీఖున మాత్రం తప్పనిసరిగా నామం మా ఇంట ప్రతి సంవత్సరం జరుగుతుంది.
ఎప్పుడూ మా ఇంట్లో అక్కాచెల్లెళ్ళమే అందరం కలిసి వంట పనులు చేసుకుంటాము.
ఆ సారి ఎందుకో ఎవరూ రాలేదు. అందరూ నా మీద అలిగారు. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి.
అందువల్ల గబగబా తిరిగి నేను పనిచేసుకోలేకపోయాను. మా ఇంటికి నామం జరుగుతున్న సమయంలో భోజనాలకి చాలా మంది వస్తారు.
అందరికీ నేను ఒక్కదాన్ని చేయాలంటే నా వల్ల కాదు అనిపించింది. నేను చేసుకోలేననిపించింది. వచ్చే సంవత్సరం కూడా పరిస్థితి ఇలాగే ఉంటే నేను నామం చేయించలేను, నా వల్ల కాదు బాబా అనుకున్నాను. ఇంతపని నేను ఒక్కత్తిని చేయలేను బాబా అని అనుకున్నాను.
ఎప్పుడు నామం జరిగినా కొంచెంసేపయినా అందరమూ డాన్స్ చేస్తాము.
అలాగే ఆ రోజు కూడా మా పాప డాన్స్ చేస్తోంది. బాగా ఎగిరింది, ఆడి ఆడి ఒక్కసారిగా పడిపోయింది.
ఆ పడిపోవటం కుప్పలాగా పడి బాబా ఫోజ్ లాగా మారిపోయింది. దాని ఒంటిమీదకి బాబా వచ్చేసాడు.
దీపాలు, ధూపాలు, హారతులు, నైవేద్యాలు అవుతున్నాయి. ఏమైనా కూడా బాబా దాని ఒంటి మీద నుండి పోవడం లేదు.
నాకేం చేయాలో అర్ధం కావడం లేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు నేను వచ్చే ఏడాది నుండి నీ నామం చేయను అనుకున్నాను కదా!
అది బాబా కి ఇష్టం లేనట్లుంది అందుకని బాబా అలాగే వున్నాడనిపించి నేను చెంపలు వేసుకుని ”క్షమించు బాబా! ఏది ఏమైనా కానీ నీ నామం వదలను, చేయిస్తాను బాబా!” అని దండం పెట్టుకున్నాక అప్పుడు మా అమ్మాయి ఒంటి మీద నుండి బాబా వెళ్ళిపోయాడు.
నేను బ్రతికి ఉన్నంత కాలం కూడా నీ నామం నేను ఆపను బాబా అనుకున్నాను, అలాగే చేస్తూనే ఉన్నాను.
పఠాన్ చెరువు లోని BPL దగ్గరలో బానూరు అనే ఊర్లో బాబా విగ్రహ ప్రతిష్ట జరుగుతోంది. నేను మా వారు ఆ విగ్రహ ప్రతిష్ట చూడాలని బయలుదేరాము.
అప్పటికే చాలా పెద్ద వాన పడుతోంది. కానీ అక్కడ జరిగేది బాబా విగ్రహ ప్రతిష్ట మరి, రోడ్డు ఎక్కితే ఎదురుగా వచ్చే వాహనం కనపడే పరిస్థితి లేదు.
దారి పొడవునా నీరు బ్రహ్మాండంగా నదిలాగా ప్రవహిస్తోంది. బళ్లల్లోకి నీళ్ళు చేరిపోతున్నాయి. ఆ ప్రవాహానికి నిలబడలేక కార్లు కొన్ని కొట్టుకుపోతున్నాయి. గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది.
అసలు అటువంటి సమయంలో ఎవరూ ప్రయాణం చేయలేరు. తుఫానుగా మారిపోయింది.
అలాగే బాబాను తలుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మా వారే డ్రైవింగ్ చేస్తున్నారు. నేను ఈయనే ఉన్నాము కార్లో.
ఇంకొంచెం దూరం వెడితే ప్రతిష్ట జరిగే బాబా గుడి వచ్చేస్తుంది.
అప్పుడు అక్కడ పడిపోతూ ఉన్న వంతెన ఉంది. అది దాటి అవతలకి వెళ్ళాలి. ఇంతదూరం వచ్చాక వెనక్కి పోలేము వంతెన మీద ప్రయాణం చేసేటట్టుగా లేదు.
కానీ బాబా విగ్రహ ప్రతిష్ట కోసం బయలు దేరాము మరి, వెనక్కి పోలేము, వాన ఆగాలి, ఇంక ఆలోచిస్తే లాభం లేదని మా వారు బాబాని గట్టిగా తలచుకుని కళ్ళు మూసుకుని ఒక్కసారిగా కారు స్పీడ్ పెంచారు.
అంతే కారు వంతెన దాటేసింది. మా వాళ్ళు ఎవరో అంతదాకా వచ్చి వంతెన పడిపోయేట్టుగా ఉంది అంటే వెనక్కి వెళ్ళిపోయారుట.
T . V ల లో చూసి మా వాళ్ళు వెనక్కి వచ్చేయమని అసలు ఎందుకు వెళ్ళారని ఫోన్లు చేస్తున్నారు.
నీ విగ్రహ ప్రతిష్ట కోసం వాన, తుఫానుల లెక్కచేయక వస్తే ఈ వంతెన అడ్డం అవుతుందా అని మా వారు అనుకున్నారట. తర్వాత చెప్పారు.
తర్వాత మమ్మల్ని అందరూ సాహసం చేసారు అంటూ తిట్టారు. ఆ బాబాయే మమ్మల్ని కాపాడాడు. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ వేరే దారిలో వచ్చేసాము.
మా అత్తగారు మాత్రం బాబాను అసలు నమ్మేది కాదు. నేను దేవుడి గూటిలో బాబా ఫోటో పెడితే తాను పూజ చేసేటప్పుడు బాబా ఫోటోని తీసి బయట పెట్టేది.
నాకూ నా దేవుడికి వేరే వంట చెయ్యి, నీ ఫకీరుకు వేరే పెట్టుకో, నీ ఫకీరుకి ఆ పదార్ధాలు మా దేవుడికి నైవేద్యం పెట్టకు అని అనేది.
బాబా గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా రుసరుసలాడేది. మొహం ఎలాగో పెట్టేది.
ప్రతి దానికి నా దేవుడు, నీ దేవుడు అంటూ ఉండేది. ఇంట్లో భజన జరిగితే తలుపులు వేసుకుని లోపల కూర్చునేది, అస్సలు బయటికి వచ్చేది కాదు.
అటువంటిది ఒక రోజు నేను బాబాకి పూజ చేసి అంతకు ముందు రోజునే నేను షిరిడీ నుండి తీసుకు వచ్చిన అగరుబత్తీలు వెలిగించాను.
నైవైద్యం పెట్టి నేను బయటికి వెళ్ళేపని ఉంది, అమ్మమ్మా వంటచేసి నేను బయటికి వెళతాను అన్నాను.
మేనమామని పెళ్లి చేసుకున్నాను (అందుకని అమ్మమ్మ అత్తగారయ్యింది). నువ్వు పని ఉంటే వెళ్ళు నేను వండుకుంటానులే అంది. సరే నని నేను బయటిక వెళ్ళిపోయాను.
ఇంట్లో ఇంకెవ్వరూ లేరు. ఎప్పటిలాగే రుసరుసలాడుతూ బాబాను తిడుతూ ”ఏం ఫకీరో? ఈ ఫకీరు ఎక్కడ దొరికాడో వీడికి పూజలు చేసి నైవేద్యాలు పెట్టేసుకోకపోతే,
మంచిగా దేవుడికి వండవచ్చుగా! నేను అదే తివేస్తానుగా! అని ఆవిడకి నోటికి ఏది వస్తే, అది ఇంట్లో ఎవరూ లేరుగా ఇంకా పెద్దగా అరుస్తూ పని చేసుకుంటుందట.
ఉన్నట్లుండి హఠాత్తుగా హల్లో ఉన్న కేన్ ఉయ్యాలలో ఎవరో కూర్చున్నట్లుగా కిర్రున శబ్దం వచ్చిందట. ఆవిడ చేస్తున్న పని ఆపేసి భయంగానూ, అనుమానంగానూ, వెనక్కి తిరిగి చూసింది.
ఆ ఉయ్యాల బలంగా ఊగుతోంది. అందులో ఎవరూ ఆవిడకి కనిపించలేదు. గాలి కూడా ఎక్కడి నుండీ, లోపలికి వచ్చే అవకాశం లేదు, అయినా ఉయ్యాల ఊగుతోంది. ఆవిడకి భయం వేసింది,
చేస్తున్న పని వదిలేసి వెనక డోర్ గుండా బయటికి వెళ్లి పక్కనే మా చెల్లెలు వాళ్ళ ఇల్లు ఉంది వాళ్ళింటికి పరుగెత్తి
”అమ్మాయ్! ఉయ్యాల ఎవరూ లేకుండానే ఇంట్లో ఊగుతోంది రా రమ్మని” చెప్పి మా ఇంటికి తీసుకువచ్చింది వాళ్ళూ చూసారు.
ఉయ్యాల ఊగుతూనే ఉంది. అమ్మమ్మా ఈ ఉయ్యాలలో బాబా వచ్చి కూర్చున్నాడే అంది మా చెల్లెలు అంతే ఒక్కసారిగా మా అమ్మమ్మ ఆ ఉయ్యాల ముందు కూలబడి నమస్కారాల మీద నమస్కారాలు చేసేస్తోంది.
గబగబా పూలు తెచ్చి ఉయ్యాలకి పూజ చేసింది, నైవేద్యం పెట్టింది, హారతి ఇచ్చింది, ఆ ఉయ్యాల ముందే కదలకుండా కూర్చుంది.
ఆ ఉయ్యాల ఇంకా ఊగుతూనే ఉంది. ఈ లోపు బయటికి వెళ్లిన నేను కూడా ఇంటికి వచ్చాను. ఇంకా ఉయ్యాల ఊగుతూనే ఉంది.
నేను “అమ్మమ్మా ! రోజు బాబా ను తిడుతున్నావు కదా! అందుకే తానున్నాడని చెప్పటానికి నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు బాబా వచ్చాడు” అన్నాను,
అంతే! మరునాటి నుండి బాబా ఫోటోలు ఆమె దేవుడి గూట్లో నుండి తీయటం లేదు, బాబా అంతే విసుగ్గా మొహం పెట్టడం లేదు,
బాబా నామం ఆంటే అపహాస్యం చేయటం లేదు, తానూ వచ్చి నామంలో కూర్చొని నామం చెప్తుంది , ఏదైనా వస్తే బాబా ఉన్నాడంటూ అంటోంది.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబా నామస్మరణ ఎన్నో ఆపదల నుండి కాపాడే రక్షక కవచం …!
- పిలిచి అవకాశం ఇవ్వటం బాబా కృప కాకా మరేమిటి–Audio
- బాబా వారు మాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు …..!
- సంకటాలను దూరం చేసిన సాయి నామం.
- మాధవరావు దేశ్పాండే ఉరప్ శ్యామా ఎనిమదవ భాగం ….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments