నేనున్నానా? …. మహనీయులు – 2020… సెప్టెంబరు 6



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


పూంజాను పాపాజీ అంటారు. పంజాబు నుండి తిరువణ్ణామలై వెళ్లి రమణులను దర్శించాడు.

మొదట రమణులపై లేని నమ్మకం పూంజాలో క్రమేపి పెరిగి పతాక స్థాయికి చేరుకుంటోంది.

అప్పుడే భారతదేశం ముక్కలైంది. పూంజా కుటుంబం పాకిస్తాన్ లో ఉంది. అక్కడ హిందువులకు రక్షణ లేదు.

పూంజా కుటుంబం పాకిస్తాన్ భూభాగంలో ఉందని, ఆ కుటుంబాన్ని భారత భూభాగానికి తెచ్చుకొమ్మని పూంజాకు చెప్పమని, అక్కడే ఉన్న పూంజా స్నేహితుడు రమణులకు విన్నవించాడు.

పూంజా తన కుటుంబాన్ని తెచ్చుకోవడానికి అంగీకరించలేదు. “మీ (రమణుల) భౌతిక కాయానికి నేను బద్ధుడనైపోయాను. నేను మిమ్మల్ని విడిచి వెళ్లలేను. నాకు మీరంటే అంత ప్రేమ” అన్నాడు పూంజా.

“నీ వెక్కడున్నా నేను నీతోనే ఉంటాను” అని బదులు చెప్పారు రమణులు. రమణుల పాదధూళిని తీసుకొని పంజాబు బయలుదేరాడు పూంజా.

పూంజా లాహోరు నుండి స్వగ్రామమైన ల్యాల్ పుర్ కు టికెట్టు కొన్నాడు.

ఆ రోజులలో హిందువులు, మహమ్మదీయులు వేర్వేరు పెట్టెలలో, భద్రత కోసం, ప్రయాణం చేసేవారు.

పాపాజీ హిందువుల పెట్టెలో ఎక్కబోయాడు. కానీ అంతర్వాణి “ముస్లింల పెట్టెలో ప్రయాణం చేయి. ఏమీ అపకారం కలుగదు” అని పలికింది. ఆ అంతర్వాణి ఎవరో కాదు, తన రమణులే అని గ్రహించి ముస్లింల పెట్టెలో ఎక్కాడు.

ముస్లింలు పూంజాను అతి సులభంగా గుర్తించగలరు – అతని చేతిపై ఉన్న ‘ఓం’ ను చూచి. గమ్యస్థానం చేరేలోపున ఆ రైలులో హిందువుల పెట్టెలో ఉన్న హిందువులందరినీ చంపివేశారు.

ముస్లింల పెట్టెలో సురక్షితంగా ఉన్న తన కుటుంబంలోని 34 గురును సురక్షితంగా లక్నోకు చేర్చాడు పూంజా – రమణుల రక్షణతో.

మరల తిరువణ్ణామలై చేరి రమణులను దర్శించలేకపోయాడు. రమణులు మహాసమాధి చెందిన దినం పూంజాకు ఛాతిలో తీవ్రమైన పోటు వచ్చింది.

ఆ నాటి రాత్రి ఆకాశంలో ఉల్కను చూశాడు. రమణుల మహాసమాధి వార్త విన్నాడు కూడా.

లక్నోలో అందరూ పూంజా చక్కని ఉపన్యాసాలిస్తున్నాడు అనేవారు. ఆయనకు ఆ మాటలు నచ్చేవి కావు.

“నేను అంటూ పూంజాను మాట్లాడుతున్నానని నేనెప్పుడూ భావించను. నేనే పూంజాను అనుకుని మాట్లాడే హక్కే నాకు లేదు. మాట్లాడేది నా సద్గురువే.

నా గురువుని, వారి బోధనలను మీకు పరిచయం చేస్తూ ఇక్కడ కూర్చున్నాను. వాడే నా గురువు. పూంజా ఎప్పుడో పోయాడు. ఉండేదెప్పుడూ మా సద్గురువులే.

వారు నా హృదయంలో అవ్యయులైన ఆత్మగా అసీసులై ఉన్నారు” అనేవాడు పూంజా నమ్రతతో. సరిగ్గా ఇలాంటి భావాన్నే హేమాడ్ పంత్ సాయి సచ్చరిత్రలో వెలిబుచ్చాడు.

పూంజా సెప్టెంబర్ 6 1997న మహాసమాధి చెందాడు.

నేడు సెప్టెంబర్ 6. పూంజా వర్థంతి. ఆయనకు, రమణులను స్మరిద్దాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles