Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
A. త్యాగరాజు గారి అనుభవాలు రెండవ భాగం
నేను ఒకసారి పాలసీలు చేయించడానికి నరసాపురం నుండి మొగల్తూరు వెడుతున్నాను.
నా మనసులో “సాయి నామం” జరుగుతూ ఉంటుంది. నేను వెళ్ళే దారిలో ఒక వైపు పంటపొలాలు, మరో వైపు కాలువ ఉంటాయి.
లెఫ్ట్ సైడ్ వెళ్లకుండా నేను రైట్ సైడ్ మెల్లగా మోటార్ సైకిల్ మీద వెడుతున్నాను, ఇంతలో పైన ఆకాశం నుండి ఒక ‘పక్షి’ వెడుతున్నట్టు కనపడింది, మరో నిమిషంలో రోడ్ పైన ఏదో పడ్డట్టుగా కనిపించింది,
నేను గబుక్కున పక్కకి చూసే సరికి ‘పాము’ పడగ విప్పి కనపడింది. ఒళ్ళు జలదరించింది, కుడివైపు నుండి తప్పించుకొని బండి స్పీడ్ పెట్టి వెళ్ళిపోయాను.
నేను నామస్మరణం లో ఉండటం మూలాన నేను ఆ పాము నుండి తపించుకున్నాను.
నేను ‘శ్రీ సాయి సచ్చరిత్ర’ పుస్తకం లో కళ్ళు మూసుకొని ఒక చోట వేలు పెట్టి ఈ రోజు బాబా మీ ఆదేశం ఏమిటి అని ప్రశ్న వేసుకోవటం నా అలవాటు.
పాము పడిన ముందు రోజు కూడా అలాగే తీసాను. అందులో “ఈ రోజు గడ్డు రోజు అని బూటీతో జ్యోతిషులు చెప్పిన వాక్యం” నాకు కనపడింది. అలాగే రెండు సార్లు తీసాను అయినా కూడా అలాగే వచ్చింది.
ఆ మరునాడే నా ముందు పాము పడటం ‘బాబా’ దయ వలన నేను తప్పించుకోవటం జరిగింది.
అమెరికాలో మా అమ్మాయికి 2010 సంవత్సరంలో అమ్మాయి పుట్టింది.
నొప్పులు వస్తూంటే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాము. నార్మల్ డెలివరీ అవుతుందని డాక్టర్ చెపింది. కానీ అవటం లేదు.
కాసేపయ్యాక ఆపరేషన్ చేయాలంటున్నారు, కానీ అదీ చేయటం లేదు.
ఈ లోపు నార్మల్ డెలివరీ అవుతూ బిడ్డ మధ్యలో ఆగిపోయి ప్రాణసంకటమేర్పడింది.
మా అమ్మాయి ‘సాయి నామం’ చేస్తూనే ఉంది. ఇంతలో “రెండు చేతులు పైనుండి”, (అవి నర్స్ చేతులు కావు, డాక్టర్ చేతులు కావు), పొట్ట దగ్గర నొక్కినట్టుగా మా అమ్మాయికి తెలిసింది, వెంటనే డెలివరీ అయ్యింది.
ఆ తరువాత మా అల్లుడిని మా అమ్మాయి మీరేమైనా నా పొట్ట నొక్కారా అంటూ అడిగిందిట.
అప్పుడు అతను నేనేం నొక్కలేదు అన్నాడుట. అప్పుడు మా అమ్మాయికి అర్ధం అయింది. ఆ వచ్చింది వేరెవరో కాదు, ‘సాక్షాతూ శ్రీ సాయినాథుడే’ అని, తన సంకట ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాడని.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru
…A. త్యాగరాజు గారి అనుభవాలు రెండవ భాగం తరువాయి…..
Latest Miracles:
- చేస్తూన్న ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసి, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసిన బాబా వారు.
- ఏ దేవుడు ఉన్నాడో కానీ అతను ఇంత దూరం వచ్చి మేము ఇంజక్షన్ ఇచ్చేదాకా ఎలా బ్రతికాడో మాకు అర్ధం కావడం లేదు.
- గురు చరిత్ర మహిమ
- సాయి ఆయుధం …..సాయి@366 డిసెంబర్ 26….Audio
- మాతాజీ జీవితం లో మరో ఆణి ముత్యం.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments