సాయి ఆయుధం …..సాయి@366 డిసెంబర్ 26….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


“సాయిబాబా అసాధారణ స్థితిలో ఉన్నారు. సటకా  తీసుకుని నేలమీద గుండ్రంగా కొడుతున్నారు. చావడి మెట్లు దిగేలోపలే రెండుసార్లు వెనక్కి, ముందుకి నడచి తీవ్రమైన పదజాలం ఉపయోగించారు” అంటారు డిసెంబరు 26 న, కపర్దే.

సటకా అంటే చేతిలో ఉండే హస్త భూషణం కాదు. రామునకు విల్లు. హనుమంతునకు గద ఆయుధాలుగా ఉన్నట్లు సాయికి సటకా ఆయుధమైంది. చిలుము, సటకాలు అన్నదమ్ముల వలె సాయితో ఉండేవి.

చావడిలో పరున్న సాయి ఒక రోజు తన సటకాను నేలపై కొడుతూ, కేకలు పెడుతూ, అబ్దుల్ ను నిద్రలేపి “నా పక్కలోకి దయ్యం వచ్చింది, చూడరా!” అని చెప్పారు.

ఆ గొడవకు నిద్రపోతున్న అమీర్ షక్కరు నిద్ర లేచాడు. సాయి మాటలతో ఎదో అర్ధం ఉందని గ్రహించి దీపం తెప్పించి చూడగా తన దిండు సమీపంలో పాము కనబడ్డది. వెంటనే దానిని చంపి వేశారు.

సాయి భాషలో దయ్యం అంటే పాము అన్ని వేళలా అరటి పండు వలచి చేతిలో పెట్టినట్లు ఉండవు సాయి మాటలు, చేష్టలు.

డిసెంబరు 26 న సాయి అలా ఎందుకు చేసినది కపర్దేకు తెలియదు. కపర్దేకే కాదు, ఇతరులకెవ్వరకూ కూడా తెలియదు.

ఇచ్చట సాయిబాబా ఎవరిని ఉద్దేశించి అటుల ప్రవర్తించెనో ఎవరికెరుక? అయినను సాయి, కపర్దే విషయంలో అలా ప్రవర్తించాడు అని సమాచారాన్ని బట్టి గ్రహించవచ్చును.

కపర్దేపై ఆంగ్ల ప్రభుత్వం నిఘా వేసింది. ఒక గూఢచారిని కూడా షిరిడీకి పంపింది.

7 , 8  రోజుల క్రితం అంటే 18  డిసెంబరున సాయి కపర్దేతో “నేను నిద్త్రైనా లేకుండా అన్ని రకాల బాధలను ఓర్చుకుంటుంటే, నీవు  (కపర్దే) నా బక్కెట్ నింపుకుని వేప చెట్టు చల్లని గాలులను ఆనందంగా  అనుభవిస్తున్నావు” అన్నారు. సూచనను గ్రహించలేదు కపర్దే.

గూఢచారి నటేకర్ అందరిని అలరించాడు తన చతుర సంభాషణలో చివరకు కపర్దేతో సహా.

సాయిబాబా “గవర్నరు ఒక ఈటెతో వచ్చాడని, ఐతే నేను (సాయి) వాక్చాతుర్యముతో ఆ గవర్నరుని శాంతపరచి బయటకు తరిమివేశాను” అన్నారు కపర్దేతో.

సాయి భాష అలంకారికంగా ఉండటం వల్ల వివరించటం చాలా కష్టం అన్నారు కపర్దే.  అదంతా తన విషయమేనని కపర్దేకు తెలియదు పాపం.

సాయి సటకాతో మనను  రక్షించు గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles