Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
గోపాల కృష్ణ గారి అనుభవములు మూడవ భాగం
మా పాప సాయి లహరి జన్మించే నాటికి సువర్చల ఒక ఎయిడెడ్ స్కూల్ లో అన్-ఎయిడెడ్ టీచర్ గా Rs .1000/- PM పనిచేసేది.
అదే స్కూల్ లో ప్రసాదరావు గారు అనే టీచర్ 30 – 06 – 1994 నాడు రిటైర్ అయ్యాడు.
నా శ్రీమతి ఆ పోస్ట్ కి అర్హురాలు తనకి ఉన్న విద్యార్హతల దృష్ట్యా మరియు సీనియారిటీ దృష్ట్యా కూడా ఆ వేకెన్సీ తనకే రావాలి. కానీ ఆ స్కూల్ మేనేజ్ మెంట్ చేసిన మోసం కారణంగా తన సర్వీస్ రిజిస్టర్ కూడా అప్డేటెడ్ చేయలేదు.
అంతే కాక తనకి 4 సంవత్సరాలు జీతం కూడా సరిగా ఇచ్చేవారు కారు. మేము గట్టిగా జీతం గురించి అడిగితే నీపని నిమిత్తం Govt . ఆఫీస్ లో ఖర్చు చేసాము, నీకు ఇష్టం ఉంటే ఇక్కడ జాబ్ చెయ్ లేకుంటే వెంటనే మానెయ్ అని బెదిరించేవాళ్ళు.
నేనూ, సువర్చల ఇద్దరమూ బాబాకి దండం పెట్టుకుని “బాబా నువ్వే ఎలాగైనా ఈ బాధల నుండి మమ్మల్ని బయటకి లాగాలయ్య!” అని అనుకునే వాళ్ళం. చివరికి హైకోర్టు ని ఆశ్రయించాల్సి వచ్చింది.
కోర్ట్ నుండి ఆర్డర్స్ వచ్చాక నా భార్య పోస్ట్ పేర్మినెంట్ కి అవసరమైన డాకుమెంట్స్ పైన సంతకం చేయడానికి కూడా చాలా ఇబ్బందులకు గురి చేసారు ఆ మేనేజ్ మెంట్ వాళ్ళు.
ఆ సాయినాధుడే మా యందు ఉండి మమ్మల్ని ఎవరూ ఊహించలేని విధంగా ఆదుకున్నాడు.
ఇప్పుడు తనకి ఎయిడెడ్ పోస్ట్ 01 – 07 – 1994 నుండి కంఫర్మ్ అవడమే కాక ప్రభుత్వం నుండి ఈ డేట్ నుండి arrears రూపం లో 5 లక్షల చెక్కు కూడా వచ్చింది. ఇదంతా సాయినాధుడి కరుణా కటాక్షం కాక మరేమిటి.
ఒకసారి షిరిడి వెళ్ళినప్పుడు పారాయణ హాల్ లో అందరూ పారాయణ చేసుకుంటున్నారు. అక్కడ అందరూ బాబా ముందర అగరుబత్తీలు వెలిగించి పెట్టడం గమనించాను.
నాకు ఎందుకో బాబాకి అలా అగరబత్తి వెలిగించాలని అనిపించింది మనసులో, అప్పుడు బయటకువచ్చి అగరుబత్తి, అగ్గిపెట్టె కొనుక్కుని మళ్ళీ పారాయణ హాల్ లోకి రావటం కష్టం కనుక (రష్ ఎక్కువగా ఉంది కనుక) బయటకి వెళ్ళలేక అక్కడే పారాయణ హాల్ లో అలాగే కూర్చున్నాను.
కాసేపాగి మళ్ళీ బాబా ఫోటో ముందుకు వెళ్లి నమస్కారం చేసుకుంటే ఆశ్చర్యంగా అక్కడ నాకోసమే ఉంచినట్టు అగరబత్తిలు, అగ్గిపెట్టె ఉన్నాయి. నేను ఆశ్చర్యం గా చూసాను.
ఎవరైనా వెలిగిద్దాం అని పెట్టారేమో అని ఐదునిమిషాలు చూసాను. ఎవరూరాలేదు.
బాబా నాకోసమే అవి ఏర్పాటు చేశారు అనిపించి చాలా ఆనందం గా వెలిగించి బాబాకి చూపించి అక్కడ పెట్టి వచ్చాను.
మేము అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న బాబా గుడికి వెళుతుంటాము.
ఒక గురువారం నాడు బాబా కి దండ వేద్దాం అనుకుని, మా ఇంటి దగ్గర ఉన్న బాబా గుడిలోని పూజారికి దండ తెమ్మని ముందు రోజు డబ్బు ఇచ్చి మరునాడు గుడికి వెళ్లే సరికి అభిషేకం అయిపోయి దండ వేసి ఉంది.
ముందుగా సువర్చల గుడిలో అడుగుపెట్టింది. మేము వెనకాల వస్తున్నాం. ముందే గద్దె ఎక్కి పాదాలకి నమస్కారం చేస్తూ ఈ దండ మనం ఇచ్చిందో కాదో అని అనుకుందట.
ప్రదక్షిణలో భాగంగా అటు తిరిగి ఇటు వచ్చే లోపల తన చెవిలో “సువర్చలా! ఇది మీరు ఇచ్చిన దండే” అని విన్పించిందట. నేను దూరంగా ఉన్నాను.
పూజారి గారు నా భార్యని పేరు పెట్టి పిలవరు. నన్ను అడిగింది. మీరేమైనా నన్ను పిలిచారా అని, లేదు నేను ఇప్పుడేగా వస్తున్నాను అని, ఏం ఏమయింది అన్నాను.
దానికి సువర్చల మనం వెళ్ళేసరికి బాబాకి దండ వేసేసారుగా, ఈ దండ నిజంగా మనం ఇచ్చిన డబ్బులతోనే వేసారా, లేక వేరెవరో డబ్బులిస్తే దండ వేసేసి మన పేరు చెపుతున్నారా? అని అనుమానం వచ్చి పూజారినే అడగాలనుకున్నాను.
నేను ప్రదక్షిణం చేస్తూ అటు తిరిగి వచ్చేటప్పటికి “సువర్చలా ఇది నీ దండే” అని వినపడింది.
ఈ మాట ఎవరన్నారు అని అనుమానం వచ్చి మిమ్మల్ని అడిగాను అంది. ఆ టైం లో అలా చెపింది సాయినాధుడే అని నా భార్య చాలా ఆనందించింది.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru,
గోపాల కృష్ణ గారి అనుభవములు నాల్గవ భాగం తరువాయి….
Latest Miracles:
- ప్రసవ సమయంలో బాబా వారు చేసిన ఊదీ లీల
- తన భక్తురాలి తోబుట్టువును ప్రాణాపాయం నుండి తప్పించిన బాబా వారు
- సంకటాలను దూరం చేసిన సాయి నామం.
- శ్రీమతి ఔరంగాబాద్ కర్ కు చేసిన లీల మరల ఇప్పుడు చేసి, ఎప్పుడు తనను నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయనని నిరూపించుకున్న బాబా వారు.
- జీవితంలో నా భర్త నడవటం కష్టం అని చెప్పిన డాక్టర్ మాటలను, అసత్యం చేసి, త్వరలోనే మామూలు మనిషిని చేసిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments