సుధా మాధవి గారి తండ్రి కి సాయి చేసిన ఆపరేషన్–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

హైదరాబాదు నివాసి సుధా మాధవి గారు వారి తండ్రి కి సాయి చేసిన ఆపరేషన్ గురించిన సాయి లీలను సాయి బంధువులతో పంచుకోవటానికి saileelas.com కి ఇచ్చారు. వారికీ ధన్యవాదాలు. వారి కుటుంబానికి సాయి ఆశీస్సులు సదా ఉండు గాక.

ఓం  సాయి  రామ్

సాయి  యొక్క  మహిమలు  లెక్కలేనన్ని

నా  లైఫ్  లో  ఎప్పటికి  మరిచిపోలేని  సంఘటన .బాబా  వారి  అద్భుతం  మా  ఫామిలీ  లో  జరగింది.   2008 మే నెల లో  ఒక  చేదు అనుభవం  ఎదుర్కొనపుడు  బాబా వారు  మాకు అండగా ఉండటం మాకు అనుభావమైంది.  

ఆ నెల లో  మా  డాడ్  కి  హార్ట్   ప్రాబ్లెమ్  రావడం తో ఇక  నా లైఫ్  క్లోజ్  అయిపోయింది  అనుకున్నాను. బాబా  కి  మొరపెట్టుకున్నాను. నేనింక MBA మొదటి సెమిస్టరు చదువుతున్నాను.

మా బ్రదర్ అప్పుడే జాబు లో ఇంక జాయిన్ ఐయ్యాడు మా జీవితాలు ఇంక స్తిరపడలేదు బాబా ఎలాగైనా డాడ్ ను కాపాడు అని బాబా ను వేడుకున్నాను.

మా డాడ్ మరియు మామ్ బాగా కృంగిపోయారు. నేను వారికీ బాబా వున్నారు దిగులు పడనవసరం లేదు అని చెప్పను. దైర్యం  చెప్పేవాళ్ళు ఎవరో లేరు.

బాబా తప్ప వేరే దిక్కు లేదు ఆ సమయంలో. ఆపద లో ఉన్నవారికి ఆ సాయినాధుడు అండ. ఆ మరుసటి రోజు డాడ్  ఆపరేషన్  చేయాలనీ  డాక్టర్స్  చెప్పారు.

డాడ్  కి  మొదటిసారి  ఆపరేషన్  ధియేటర్ లోనికి  వెళ్లడానికి  టెన్షన్ పడ్డారు. ఆ రోజు ఉదయానే  సరూర్ నగర్ సాయి మందిరం పూజారి విభూది ని  ఫ్రెండ్ కిచ్చి  పంపారు  ఇక  ఆపరేషన్  ధియేటర్ లోనికి వెళ్ళే  ముందు  మామ్  డాడ్  కి  బాబా  విభూతి  నుదుటన  పెట్టారు. 

డాడ్ సాయి ని ప్రార్ధన చేసి లోపటికి వెళ్లారు.  ఇక అక్కడ జరిగింది ఆశ్చర్యం. డాడ్  కి  డాక్టర్స్  వాయిస్  వినిపిస్తుంది  కానీ  కనిపిస్తుంది  బాబా.  పొడవాటి ఆకుపచ్చని గౌన్  వేసికొని బాబా ఆపరేషన్ చేస్తున్నారు. 

డాడ్  కి అర్థం కాలేదు.  కానీ  బాబా  మాత్రం  స్పష్టంగా కనపడడం  డాడ్  కి  అద్భుతం. బయటికి  రావడం  డాడ్  నాతో ఆ విషయం  చెప్పటం ఇప్పటికి  మర్చిపోలేను.

ఇక  ఆ  క్షణం నుండి  డాడ్ నిత్యా  పారాయణం  చేయడం  మొదలు పెట్టారు. ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నారు. ఇదంతా రాస్తున్నంత సేపు ఒళ్ళు అంత  గగురపుడుతుంది  అందుకే అంత స్పష్టంగా వ్రాయలేక  పోతున్నాను .

ఒక్క  విషయం చెప్పాలంటే   పిలుస్తే  పలుకుతా  అన్న  మాటా  నిలబెట్టుకున్నారు  బాబా. నా లైఫ్ లో ఎలా ఎన్నో సాయి లీలలు జరుగుతూనే  వున్నాయి. బాబా అనుగ్రహం ఉంటె తర్వాత తెలియజేస్తాను.

 

 సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles