Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయిబాబానే ఆ పార్శీ అబ్బాయి ఆపరేషన్ తన శరీరంలోకి తీసుకున్న విధానం.
యూనియన్ bank ఇండస్ట్రియల్ relation cell,దీనిలో లింబూవాల అనే పేరుగల పార్శీ వ్యక్తి ముఖ్య అధికారిగా వుండినారు.
అతను పార్శీ అతను అయినా మన హిందూ తత్వజ్ఞానం గురించి చాలా బాగా తెలుసు అతనికి.మన భగవద్గీత,శంకరభాష్యం కూడా చదివేవాడు.
సాయిబాబా మీద చాలా భక్తి,శ్రద్ధలు వుండేవి.
నా ప్రాణస్నేహితుడు పద్మాకర్ మహల్ కు,లింబూవాల అనే పార్శీ అతనికి మంచి స్నేహం వుండేది.
ఒకసారి లింబూవాల చాలా దుఃఖంగా,చింతగా ఎదో చాలా కష్టాన్ని మోస్తున్నవానిగా కనపడ్డాడు.
పద్మాకర్ ఏమి అలా వున్నావు,ఏమైంది కారణం ఏమి,అని అడిగాడు.
దానికి లింబూవాల సమాధానం ఇలా చెప్పాడు. “నాకు ఒక్కడే కొడుకు.వాడికి ఈరోజు appendix ఆపరేషన్ జరిగేటప్పుడు అది పగిలిపోయింది.
డాక్టర్స్ అంటున్నారు 99% బతకడు ఆశ పెట్టుకోకండి. 1% బ్రతకచ్చు,ఆ భగవంతుని ఆశీర్వాదం వుంటే అన్నారు.అది చెప్తూ లింబూవాల సాహెబ్ భయకరంగా ఏడుస్తున్నాడు.
పద్మాకర్ అతనికి స్వాంతన చెప్తూ ఇలా అన్నాడు:మన చేతిలో ఏమీలేదు,మనం బాబానే నమ్ముకొని వున్నాం కాబట్టి ఆయనే మనకు రక్షగా వుంటాడు.నువ్వు సాయిబాబానే వేడుకో బాగు చేస్తాడు,ఆయన శరణాగతవత్సలుడు, దీనజనబాంధవుడు అని ఏవో చెప్తూ వున్నాడు.
ఇద్దరూ అక్కడే ఉన్న బాబా ఫోటో దగ్గర కూర్చున్నారు చింతాక్రాంతులై.
బాబా తన భక్తుల కష్టాలను చూస్తూ వూరుకుంటాడా! “నా సమాధి సమాధానపరుస్తుంది” అని అన్నదానికి అనుగుణంగా వచ్చేశారు.
ఎలా అంటే ఆపరేషన్ theatre నుండి డాక్టర్ పరుగులు పెట్టుకుంటూ సంతోషంగా ఆపరేషన్ సక్సస్ అయింది.ఈరోజు ఆశ్చర్యం లోకెల్ల ఆశ్చర్యం నాచేతికి చాలా కీర్తిప్రతిష్టలు వచ్చాయి.నిజానికి ఒక పెద్ద చమత్కారం జరిగింది అనుకుంటు లింబూవాలతో అన్నాడు మీ అబ్బాయి బ్రతికాడు అని.
ఈ విషయాలన్ని పద్మాకర్ కూడా విన్నాడు.డాక్టర్ వెళ్ళిపొయినాడు.
పద్మాకర్ ఒక బాబాలీల చెప్పాడు లింబూవాలకు.అది ఏమిటంటే,నాకు రాత్రి ఒక కల వచ్చింది,కలలో “బాబా అన్నారు,అతని చేతికి కీర్తి,ప్రతిష్టలు వచ్చాయి” అని తన కఫ్నీని పైకి ఎత్తాడు.బాబా కడుపు మీద ఆపరేషన్ అయిన గుర్తులు స్పష్టంగా కనపడ్డాయి.బాబా ఆపరేషన్ తన మీద వేసుకొని,తన భక్తుడిని రక్షించారు.కాని ఆసమయంలో నాకు అర్థంకాలేదు(అని పద్మాకర్ లింబూవాలకి చెప్పాడు).
ఇంక లింబూవాల కళ్ళలో సంతోషంతో కూడిన నీళ్ళు కారుతూనే వున్నాయి.
దీనజనవత్సల సాయిరాం పాహి పాహి ప్రభో అని మాత్రం అనగలిగాడు.
సూర్యకాంత యాదవ్.
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- పద్మాకర్,నిజంగానే నీబాబా చమత్కారం చేసి నాలాంటి నమ్మని వాళ్ళని కూడా తన దగ్గరికి లాగేస్తారు అన్నారు సోదీ సాహెబ్.
- బాబా వారు చేసిన లీలల ద్వారా బాబా మీద నమ్మకం లేని భక్తుని కుటుంబ సభ్యులందరినీ తన భక్తులుగా మార్చుకున్న సాయి మహారాజ్….
- సచ్చరిత్ర పారాయణ ఫలితం – కలలో వచ్చి వైద్యం చేసి ఆపరేషన్ అవసరం లేకుండా చేసిన బాబా గారు.
- తలచిన వెంటనే స్వయం గా వచ్చి తన భక్తురాలి జ్వరాన్ని తొలగించిన బాబా గారు.
- తన భక్తుడిని రక్షించడానికి బాబా లాయరుగా ప్రవేశం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
4 comments on “బాబా ఆపరేషన్ తన మీద వేసుకొని,తన భక్తుడిని రక్షించారు.”
kishore Babu
December 3, 2017 at 11:44 amBaba leelalu varnana theethamu…Chaduvuthuntene kallampata neellu vacchestunnayi….Thanks Baba
Srinivasa Murhy
December 3, 2017 at 1:08 pmSai Baba…Sai Baba…Sai Baba
Maruthi Sainathuni
December 3, 2017 at 11:49 pmSai Baba…Sai Baba…Sai Baba
Mrekha
December 7, 2017 at 9:47 amSai baba sai baba sai baba