భక్తి శ్రద్దలతో చేసిన పూజని స్వీకరించిన బాబా …!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా అమ్మాయి తో పాటు ‘ఆనంద్’ అనే అతను పని చేస్తుంటాడు. అతను నన్ను అమ్మా! అని పిలుస్తాడు.

వాళ్ళ అమ్మకి పోలియో ఉంది, ఇతను డిగ్రీతో ఆపేసాడు. ఆ తరువాత ఇంకా చదవలేదు అది కూడా ఆరు సంవత్సరాలు క్రితం పాస్ అయ్యాడు.

వాళ్ళమ్మ ఎప్పుడూ మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని “వాళ్ళ పిల్లలు చూడు అడ పిల్లలు అయినా ఎంత బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారో అని అనేదట.

వాడు మా ఇంటికి వచ్చి నాతొ ఈ మాట చెప్పి ‘మా అమ్మ తిడుతోంది ఆంటీ’ అనేవాడు. మరి ‘నువ్వు చదువుకోవచ్చు కదరా!’ అన్నాను.

‘మీరు ఉరుడొంది, ఆంటీ మీరుకూడా అలా అంటారు. ” ఇప్పుడు నేను ఎలా చదువుతాను’ అన్నాడు.

“నువ్వు నమ్మకం ఉంచుతాను అంటే నేనో పుస్తకం ఇస్తా అది చదువు తప్పకుండా నువ్వు పాస్ అవుతావు” అంటూ ‘సాయి లీలామృతం’ పుస్తకం తీసుకొచ్చి వాడికి ఇచ్చాను.

“ఆంటీ! ఇంత లావు పుస్తకం నేనెలా చదవను? ఆదివారం పేపర్లో వస్తుందే అంత సన్న పుస్తకం ఏమైనా ఉంటే ఇవ్వండి చదువుతాను” అన్నాడు.

“లేదు లేదు బాబా మీద నమ్మకం ఉంచి నువ్వే దిక్కు అంటూ ఈ పుస్తకం చదువు” అన్నాను.’సరే అంటి నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి చదువుతాను’ అన్నాడు. ‘ఎలా చదవాలి’ అన్నాడు.

“గురువారం నాడు బాబా గుడికి వెళ్లి లక్షణంగా బాబాకి ప్రదక్షణాలు 108 చేసి ఇంటికి వచ్చి చదవటం మొదలుపెట్టు” అన్నాను.

‘వాడు నువ్వూ గుడికి రా’ అన్నాడు. నేను, మా వారు కూడా వాడితో పాటు గుడికి వెళ్లి 108 ప్రదక్షణాలు చేసాము.

వాడు ఇంటికి వచ్చి ‘బాబా’ ది పాత ఫోటో ఉందంట వాడి దగ్గర, అది ఒక దగ్గర పెట్టి, పూజ చేసి ‘సచ్చరిత్ర’ చదవటం మొదలుపెట్టి వారంలో పూర్తి చేసాడు.

బుధవారం గుడికి వెళ్లి “బాబా నీ పాత ఫొటోతోనే నేను పూజ చేస్తున్నాను పాలరాయి విగ్రహం ఉంటే బాగుండును” అని అనుకున్నాడట బాబాతో.

అంతే ఇంటికి వచ్చాక ఎవరో తలుపు కొట్టి చిన్న పాలరాయి విగ్రహం దానితో పాటు ‘శిరిడి’ నుండి తెచ్చిన ‘ఊది’ వాడికిచ్చారట.

మేము శిరిడి వెళ్లి వచ్చి వారం రోజులయింది కాని ఇప్పటి దాకా మీకీ విగ్రహం ఇవ్వటానికి సమయం దొరకలేదు అన్నారట.

I-CET రాసాడు మా అమ్మాయి కూడా రాసింది. వాడిని ఉద్యోగం మానేసి చదువుకోమంటే మానకుండానే పరీక్షకు ప్రిపేర్ అయ్యి రాసాడు.

మా అమ్మాయికి 11000 ర్యాంక్ వచ్చింది. వాడు నా దగ్గరికి వచ్చి ‘నాకెంత రాంక్ వచ్చింది అంటావు?’ అన్నాడు. నేను వాడు ఉద్యోగం చేస్తూ చాల గ్యాప్ తరువాత చదివాడు కాబట్టి 15000 వచ్చి ఉంటుందిరా అన్నాను,

“కాదు ఆంటీ బాబా గారు నాకు 6000 ర్యాంక్ ఇప్పించారు” అన్నాడు.

ఆ తరువాత వాడు చదువుకొని పాసయ్యి తిరుపతి దేవస్థానం లో మంచి ఉద్యోగం సంపాదించి నెలకి 70,000 ఉపాయాలు జీతం సంపాదించుకుంటున్నాడు. అంతా బాబా దయ.

ఒక సారి పేపర్లో ఎక్కడో మూలకి ఒక చిన్న ప్రకటన మరియు ఒక బాబా విగ్రహం బొమ్మ.

బాబా భంగిమ చెయ్యి (అభయ హస్తం కాకుండా) క్రిందకి వేంకేటేశ్వర స్వామి చెయ్యి లాగా ఉంది

అటువంటి విగ్రహం ఎక్కడో కాళహస్తిలో శివపూజకు ఉపయోగించిన పూలమాలిన్యం అంతా ఒక చోట కుప్పగా పోస్తారట ఆ కుప్పను వేరే దగ్గర డంప్ చెయ్యడానికి తవ్వుతుంటే ఈ విగ్రహం కనపడిందట.

అది తీసుకువెళ్లి ఒక చోట ప్రతిష్ట చేశారట. ఆ ప్రకటన మా కళ్ళ పడింది. నేను మా వారు కాళహస్తి వెళ్ళాము, మా అమ్మాయిలు కూడా వచ్చారు,

అక్కడ ఒక పూజారి ఉన్నాడు, ఆయన ”మీకు ఎవరు చెప్పారు ఇక్కడ బాబా ఇలా ఉన్నాడని, ఎలా వచ్చారు” అని అడిగాడు.

మేము పేపర్లో ఒక ప్రకటన చూసామని, వెంటనే మాకు చూడాలనిపించి వచ్చాము అని చెప్పాము.

దానికాయన మీరు ఒకరోజు ఉదయాన్నే వస్తే అభిషేకం మీరే మీ చేతులతో స్వయంగా చేసుకోవచ్చు అన్నాడు. ఎన్ని గంటలకి రావాలి అంటే ఉదయం 6 గంటలకి ఇక్కడ ఉండాలి అన్నాడు.

”అంత ఉదయాన్నే రావడం అంటే కష్టం ఎందుకంటే మేము తిరుపతి వచ్చి అక్కడి నుండి రావాలి సమయం పడుతుంది. 10 గంటలకి అంటే రాగలము” అన్నాను,

”ఇప్పుడెలా వచ్చారు, ఎక్కడో పేపర్లో ఒక మూలనెక్కడో వేసిన మేటర్ ను పట్టుకుని ఎలా వెతుక్కుంటూ వచ్చారో అలాగే రండి” అన్నాడు.

సరేలే అని మేము వచ్చేసాము. అప్పటికి ఒకటి రెండు సార్లు కాళహస్తి వెళ్ళడానికి ప్రయత్నించాము కానీ వెళ్లలేక పోయాము.

ఈ లోపల ఆనంద్ మా ఇంటికి వచ్చాడు అభిషేకం మన చేతులతో మనమే చేసుకోవచ్చు అని పూజారి అన్నాడు కాబట్టి మీరు నేను వెళ్లిపోదాము ఆంటీ అని నైవేద్యాలు, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార అన్ని పట్టుకుని కారులో బయలుదేరాము.

అక్కడ అంతకు ముందున్న పూజారి లేరు ఆయన గురించి అడిగితే వెళ్లి పోయారు అని అన్నారు.

మా వాడన్నాడు ”ఆంటీ మీకు మంత్రాలు వచ్చు కదా మీరు చదవండి మనమే పూజ చేసి అభిషేకం చేద్దాం” అన్నాడు.

సరే అని మొదలు పెట్టాము అభిషేకం కూడా అయ్యాక చూస్తే ఎక్కడినుండి వచ్చాయో రెండు కుక్కలు, మేము అభిషేకించిన పంచామృతాన్ని నాకుతున్నాయి.

ఆంటీ అటు చూడండి ఆ కుక్కలు ఎలా నాకుతున్నాయో ఇంతకంటే వేరే నిదర్శనం ఏం కావాలంటీ, ”బాబా” మన పూజను స్వీకరించాడు అన్నాడు.

ఇంతలో ఎక్కడనుండి వచ్చాడో ఒక ముసలాయన వచ్చి ప్రసాదం పెట్టమన్నాడు, మేము డబ్బాలు తీసి ప్రసాదం పెట్టే లోపల, ”ప్రసాదం పెడతారా, పెట్టకుండానే వెళ్ళిపోతారా” అన్నాడు,

మా వాడు వెంటనే డబ్బా మూత తీసి ఇంత ప్రసాదం ఆ ముసలాయన చేతిలో పెట్టాడు. అతను అది తీసుకుని ”పూజ బాగా చేసారు” అంటూ వెళ్ళిపోయాడు.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles