భిక్షుని రూపంలో అన్న ప్రసాదం స్వీకరించిన బాబా!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నేను బి. హెచ్. ఇ. ఎల్ డిపోలో పనిచేసేటప్పుడు, అప్పట్లో ఎల్. టి. సి మీద బస్సులు మాట్లాడి షిరిడి మంగళవారం మాత్రమే వెళ్ళాము.

అది 1982 వ సంవత్సరం నేను మొదటి సారిగా బాబా ను దర్శించాను.

మూడు రోజుల ప్యాకేజీ షిరిడీ దర్శనం తర్వాత శనిసింగణాపూర్, ఘృనేశ్వరు అన్నీ చూసాము.

ఆ తర్వాత L. T. C other స్టేట్స్ కూడా ఇచ్చారు. 1984వ సంవత్సరంలో మా ఆవిడతో కూడా మరల షిరిడీ బాబాని దర్శనం చేసుకున్నాము.

ఆ తర్వాత రెండు సంవత్సరాలకి ఒకసారి ఆర్. టి. సి లో ఎల్. టి. సి ఇస్తున్నా, మేము ప్రతిసారి షిరిడీ కి వెళ్ళటం మాత్రమే అలవాటు అయ్యింది.

ఎల్. బి నగర్ లో ఒక సాయిబాబా గుడి ఉంది. అక్కడికి మేము అప్పుడప్పుడు వేడుతూండేవారం.

రిటైర్ అయ్యిన తర్వాత ఇంక రోజు వెళ్ళేవారం. మాకు మొదట్లో బాబా హారతులు మరాఠీ భాషలో ఉండటాన అసలు నోటికి వచ్చేవి కావు.

మేము క్యాసెట్ ఒకటి కొనుక్కుని, ఇంట్లో పెట్టుకుని నేర్చుకున్నాము. ప్రతి గురువారం నేను, నా శ్రీమతి బాబా గుడిలో భజన పాటలు పాడేవాళ్ళము.

మా ఆవిడ ఆడవాళ్ళతో మంచిగా మాట్లాడి భజన పాడే వాళ్ళని ఇరవై మందిని తయారు చేసింది. నేను రిటైర్ అయ్యిన తర్వాత ఎక్కువ సమయం గుడిలోనే గడపటం చేస్తుండేవారము.

ఆ గుడిలో చైర్మన్ ఒకతను ఉన్నాడు. గురువారాలు మధ్యాహ్నం అందరికీ భోజనాలు పెట్టేవారం. భిక్షగాళ్ళందరిని ఒక పెద్ద మనిషి బాగా తిట్టేవాడు ఒక్కోసారి చెయ్యి కూడా చేసుకునేవాడు.

ఒకరోజు మధ్యాహ్న హారతి అయ్యాక ఒక ముస్లిం వేషంలో ఒకాయన వచ్చి ఆకలి వేస్తోంది. అన్నం పెట్టమన్నాడు.

ఆ పెద్ద మనిషి చూసి మమ్మల్ని పిలిచి, ఈయన్ని లోపలి తీసుకువెళ్ళి, అన్నం పెట్టమన్నాడు,

అతను భిక్షగాడిలా ఉన్నాడు, బట్టలు మాసి చిరిగి ఉన్నాయి, నేను మా ఆవిడ అతన్ని చెరోవైపు పట్టుకున్నాం. అతను నా భుజంపైన ఒక చేయి, మా ఆవిడ భుజంపైన ఒక చెయ్యి వేసి లోపలి నడిచాడు.

సరిగ్గా నడవలేక ఉన్నాడు. మేనేజర్ సురేష్ ”ఏమిటి? ఏం జరిగింది? ఎవరితను?” అని అడిగాడు.

నేను విషయం ఇది అని చెప్పాను, అతను వెళ్ళి ఒక పళ్లెంలో అన్నం వడ్డించుకుని తీసుకువచ్చి ఒక బల్ల మీద పెట్టి, ముందు కుర్చీ వేసాడు.

ఆ ముష్టి అతను కంచం మీద ఆబగా పడిపోకుండా తిన్నగా బాబా ముందుకు పోయి ”అల్లాహో అక్బర్” ”అల్లాహో అక్బర్” అంటూ బాబాకి మొక్కాడు, తర్వాత నెమ్మదిగా వచ్చి అన్నం తిన్నాడు.

అన్నం తింటున్నంతసేపూ, ఆయన అక్కడున్నంతసేపూ, కూడా నేను ఆ వచ్చినతను మామూలు మనిషి కాదు సాక్షాత్తు బాబాయే కాళ్ళు మొక్కుదాము అంటే, ఆ మేనేజర్ సురేష్ ”ఉండు ఇప్పుడే ఏంతొందర, ఆయన ఎక్కడికిపోడు ఉంటాడు, భోజనం చేస్తున్నాడుగా కానీ, ఎందుకు అనవసరంగా తొందర పడతావు” అన్నాడు.

అతను భోజనం చేసాడు, చెయ్యి కడుక్కువస్తానని మామూలుగానే నడిచి వెళ్ళిపోయాడు. మరింక మాకు కనపడలేదు.

సాక్షాత్తు బాబా మాకు కనపడితే దండం కూడా పెట్టుకోలేకపోయాం. ఆ తర్వాత మేమంతా వెతుకుతుంటే ఆ  పెద్ద మనిషి అడిగాడు.

ఆయన అప్పుడే స్పృహలోకి వస్తున్నట్టుగా ”అవును ఇందాక నేను అతన్ని ఏమీ అనకుండా మిమ్మల్ని పిలిచి లోపలికి తీసుకువెళ్ళి భోజనం పెట్టమన్నాను కదా? అలా అన్నానేంటి  నేనెప్పుడూ అలా ఎవ్వరిని మర్యాద చేయను కదా!

ఈయనని మాత్రమే అలా అన్నానంటే, “ఈయన సాక్షాత్తు బాబానే. నేను భిక్షగాళ్ళందర్నీ కొడుతూ, తిడుతుంటాను కదా, అందుకని అందర్నీ ఇలా ఆదరించాలి అని నాకు తెలియజెప్పాడు బాబా” అన్నాడా పెద్దమనిషి.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles