ఇక్కడ నామం ఆగటానికి వీల్లేదు ఇది తాను ఇష్టపడి ఎంచుకున్న స్థలము అన్న బాబా వారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా వారు 2011 సంవత్సరంలో డిసెంబర్ 3 వ తేదీన స్వర్గస్తులైనారు. బాబా వారు మా వారికీ దర్శనం ఇచ్చి ఆరోగ్యం ప్రసాదించినప్పటి నుండి వారు మరణించు వరకు ఎలాంటి అనారోగ్యం కలుగలేదు.

చివరి రోజులలో బాబా గారు మా వారితో నీకు 20 సంవత్సరాలు ఆయువు నిచ్చాను అని చెప్పారట.

నేను ఇప్పటినుండి 20 సంవత్సరాలు అనుకుని భ్రమపడ్డాను, కానీ ఆయన మరణించారు.

నేను బాబా గారిని ఈ విషయంలో నాకు సమాధానం కావాలని మూడు నెలల పాటు ఏకధాటిగా ప్రశ్నించాను, అప్పుడు నాకు బాబా గారు సమాధానం చెప్పారు.

20 సంవత్సరాలు అంటే 1992 నుండి ఇప్పటివరకు అని అర్ధం అన్నారు. తనకి ఆనాడే మరణం ఉంది నీ కోసం ఆయనకు దాదాపు 20 సంవత్సరాలు బ్రతికించాను అని చెప్పారు.

మాకు ఎప్పుడూ ఆ తండ్రి మా ఇంట్లో తిరుగుతున్నట్లుగా కనపడతారు. మాకే కాదు మా ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎదో ఒక రూపంలో దర్శనం ఇస్తూనే ఉంటారు.

మా వారు రిటైర్ అయ్యిన తర్వాత ఒక సప్తాహం చేయించి మేము ఇంక సెలవు తీసుకుంటాం తండ్రీ! మా పరిస్థితి నీకు తెలుసు కదా! అని చెప్పుకున్నాము.

కానీ ఆ తండ్రి నిర్ణయం వేరుగా ఉంది 2010వ సంవత్సరంలో బాబాగారు మా వారిని ”నాకు సప్త సప్తాహం చేయించరా” అని అడిగారు.

”50 రోజులు నామం అంటే ఎంతో ఖర్చుతో కూడిన పని మాకు అంత శక్తి లేదు అని తెలియదా తండ్రీ” అని అడిగాము.

కాని బాబా గారు ప్రతిరోజూ మమ్మల్ని తేది నిర్ణయించమని అడిగేవారు, అంతా నేను చూసుకుంటాను అని ఆయన చెప్పినా మాకు ధైర్యం లేక ఊరుకున్నాము.

కాని బాబా గారు పదే పదే అడగడంతో చివరకు తేదీ నిర్ణయించాము. వెంటనే బాబా మా మిత్రురాలైన సుమలత గారు వారి తమ్ముడైన అనిల్ గారి ద్వారా కార్యక్రమం అంతా జరిపించారు (అనిల్ కెనడాలో ఉంటారు బాబా గారు నాకు ప్రసాదించిన తమ్ముడు).

ఆ తర్వాత బాబా గారు మరి రెండు సప్త సప్తాహాలు జరిపించుకున్నారు.

ఆనాటి నుండి ప్రతినెలా ఏకాహం ప్రతి సంవత్సరం సప్తాహం ఆ తండ్రీ అనుగ్రహం తో జరుపుతున్నాము.

ఈ విధంగా నా తండ్రీ తన బిడ్డనైన నన్ను తన నుండి దూరం కాకుండా కాపాడుతున్నారు.

ఈ మధ్యన నాకు ఒంట్లో అంత బాగుండటంలేదు. ఏకాహం చేయించాలన్నా, డబ్బు ఖర్చుతోనూ, పని చేయడానికి ఓపిక కావాల్సి ఉంటుంది.

ఈ రెండు కూడా చేయలేకపోతున్నాను. మా అల్లుడు గారు కూడా ఎందుకు అక్కా (నేను అక్క వరుస కూడా అవుతాను) అనవసరంగా, ఓపిక లేనప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు పెట్టుకుంటావు అంటారు.

ఆయనకీ అంతగా బాబా అంటే ఇష్టం కూడా లేదు. అందువలన నేను బాబాగారితో చెప్పుకున్నాను.

బాబా నేను చేయలేకపోతున్నాను ఓపిక ఉండటంలేదు. అందుకని ఏకాహలు ఆపేసి ఏడాదికి ఒకసారి సప్తాహం మాత్రం చేయిస్తాను అని బాబా ముందు అనుకుని దండం పెట్టుకున్నాను.

డిసెంబర్ 3 న మా వారు పోయిన రోజు (2015 సంవత్సరం) ఆ రోజు ఇంట్లో పూజ చేసి మా వారికి ఇష్టమైన వంటలు చేసి ఆయన ఫోటో ముందు పెడతాను. సాయంత్రం ”భాను” ని (పరమ బాబా భక్తుడు) భజనకి రమ్మన్నాను.

అతను పాటలు (బాబా) బాగా పాడతాడు. అతను వచ్చి పాడతాను అన్నాడు.

నేను బాబాకి అంతకు 4 రోజులనాడే నా వల్ల కావటం లేదని చెప్పుకున్నాను కదా సాయంత్రం అయ్యింది భాను వచ్చాడు.

భజన మొదలయ్యింది. మా అల్లుడికి అంతగా పూజలు భజనలు ఇష్టంలేదు ప్రతి నెలా ఏకాహనికి కూడా వస్తే వస్తాడు లేకపోతే లేదు.

ఒకవేళ తాను వచ్చినా దూరంగా కూర్చుంటాడు. భజనల జోలికి రాడు. బాబాకి హారతి కూడా ఇవ్వడు ఉన్నట్టుండి మా అల్లుడిలో మా వారు జొరబడ్డారు.

బయట ఎక్కడో కూర్చున్న చక్రి (మా అల్లుడు) లోపలికి, పాటలు పాడుతున్న భాను పక్కగా వచ్చి కూర్చున్నాడు.

అతను తానంతట తానుగా ఎప్పుడూ రాని వాడు అలా వచ్చి తన పక్కనే కూర్చోవటం చూసి భాను పాటలను ఆపాడు ఆశ్చర్యంగా చూస్తూ.

మా వారు కూడా భాను పక్కన అలానే కూర్చునేవారు. ”పాట పాడటం ఎందుకు ఆపేసావు భాను పాటపాడు” అని భానుని గట్టిగా అరచినట్లుగా అన్నాడు.

మా అల్లుడు తన పక్కగా ఒక స్టూలు వేసుకుని, దాని పక్కన కింద కూర్చొని, ”ఆ స్టూల్ మీద ”బాబాగారు” కూర్చున్నారు. ఆ స్టూల్ కి అందర్నీ దండం పెట్టుకోమన్నాడు ”బాబాగారు” పాటలు వింటున్నారు” అన్నాడు.

భానూ నామం చెప్పు భానూ అని అచ్ఛంగా మావారిలాగా అన్నాడు. మా వారు భానూని చుబుకం పట్టుకుని మరీ అడిగేవారు. ఇప్పుడు ఇతనూ అలాగే అడిగాడు.

భానుకి కళ్ళ నీళ్లు వచ్చేస్తున్నాయి, అక్కడున్న అందరూ ఇంచు మించు ఏడుస్తూనే ఉన్నారు. ఏదో తెలియని ఉద్వేగం కాసేపటికి (మా అల్లుడి) ఆయన్ని బయటికి తీసుకువచ్చి కూర్చోపెట్టారు.

భానుని ఇలా రమ్మనమని పిలిచారు. అతను వచ్చే లోపల నాకు ఆకలిగా ఉంది అన్నారు.

ఆ తర్వాత అన్నం తెస్తే కలిపి భానుకి ఒక ముద్దా మా అమ్మాయికి ఒక ముద్ద చేసి రెండు ముద్దలు వాళ్లకు పెట్టి 2 ముద్దలు తాను తిని నాకు ఇంక కడుపునిండిపోయింది అన్నాడు.

ఆ తర్వాత ”భాను! ఆంటి చాలా కష్టపడుతోంది, నామం చేయలేక పోతోంది, ఆమెకి అంతా కలిసి సాయం చేయండి, అందరూ కలిసి నామం చేయించండి,

భవానీ (మా అమ్మాయి)  నువ్వు అమ్మకి సాయం చెయ్యి. అమ్మ చేసుకోలేకపోతుంది” అన్నారు. అంతా మా వారి గొంతులోనే అన్నాడు.

నేను కూడా అక్కడ లేను లోపలే ఉన్నాను. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకువచ్చి పడుకోమన్నారు. తాను పడుకున్నాడు.

ఆ పక్కనే మంచం పక్కగా కుర్చీ వేసి ఒక ముస్లిం ఆయన్ని మా వారి స్నేహితుడు (మా ఇంటికి ప్రతినెలా భజనకి వస్తారు) కాస్త మా అల్లుడ్ని చూస్తుండమని నా పని నేను చూసుకుంటున్నాను.

ఆయన కుర్చీలో కూర్చోబోతుంటే వద్దు వద్దు ఆ కుర్చీలో కూర్చోవద్దు అందులో బాబాగారు కూర్చున్నారు అన్నాడట.

ఒక గంటసేపు, కాసేపు బాబాలాగా కాసేపు మా వారిలాగా మాట్లాడుతూనే ఉన్నాడు.

ఇక్కడ నామం ఆగటానికి వీల్లేదు ఇది ఇష్టపడి ఎంచుకున్న స్థలము అన్నారు. కాసేపు నవ్వుతున్నారట. కాసేపు సైగలు చేస్తున్నారట, ఏడుస్తున్నారట.

ఆ ఉ సరే సరే అంటున్నారట చాలా సేపటి తర్వాత సరే పోదామా పోదామా అంటూ కళ్ళు తుడుచుకున్నాడట. 12 నిమిషాలలో మాములుగా అయిపోయాడట మా అల్లుడు.

ఏంటి! నేను ఇక్కడ ఉన్నాను పడుకున్నానేంటి? అందరూ వీధిలో ఉంటే నేను ఇక్కడున్నానేంటి? నాకేమైంది, ఇలా పడుకున్నానేంటి నాకేమైంది, అంటూ బయటికి వెళ్ళిపోయాడు.

అలా బాబాగారు తన నామం ఆగడానికి వీలులేదని జరిపించాలనీ అందరినీ సాయం చేసి మరీ జరిపించమని చెప్పారు.

ఆ తర్వాత మా అల్లుడికి ఈ విషయం చెబితే మీ అందరికి ఇక్కడ నామం జరపటం ఇష్టం అందుకే అది సాగించుకోవడం కోసం ఏదో ఒకటి చెబుతున్నారు అన్నాడు. ఎవరికో కాదు మరీ తన ఒంటి మీదకే బాబాగారు వచ్చి మరీ ఈ విషయం చెప్పారు.

ఇలా ”బాబా” గారు మాకు ఎన్నో ఎన్నో అనుభవాలు, నిదర్శనాలు చూపుతూనే ఉన్నారు.

ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఆ తండ్రి లీలలు ఈ చివరి రోజులలో నా తండ్రి నామం, జపం, కీర్తనలు, మరువకుండా ఉండగలిగే ఆ శక్తిని, ఆ తండ్రి సేవను నిరంతరం చేసుకోగలిగే శక్తిని ఎల్లవేళలా బాబాను స్మరిస్తూ ఉండగలిగే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

”తండ్రీ ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తండ్రీ! ఇలా లీలలు వ్రాయగల శక్తి నాకు ప్రసాదించినందుకు మీ పాద పద్మములకు నా నమస్కారములు తెలుపుకుంటున్నాను.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “ఇక్కడ నామం ఆగటానికి వీల్లేదు ఇది తాను ఇష్టపడి ఎంచుకున్న స్థలము అన్న బాబా వారు

Ravi

Pl tell where is this location of namasaptah

ravi

Please tell where is this location of namasaptha.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles