బాబాని నమ్మిన చోట, భయానికి తావెక్కడ!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


4 సంవత్సరాల క్రితం మేము కొంతమందిమి కలిసి శిరిడీ వెళ్ళాము. దర్శనం చేసుకున్నాము.

బాబాని ఎన్ని సార్లు చూసినా తృప్తి ఉండదు కదా! మళ్ళీ చూడాలనిపించి సెక్యూరిటీని బ్రతిమలాడాను, వాడే లోకంలో ఉన్నడో వప్పుకున్నాడు,

గురుస్థానం దగ్గర కిటికీలో నుంచి చూడాలని నా కోరిక, అలా వచ్చి నిలబడ్డాను, కాసేపాగి చూస్తే నా చేతిలో ఉండాల్సిన పర్సు లేదు,

నాతో పాటు వచ్చిన వాళ్ళు మా వారితో సైతం అందరూ రూమ్ కి వెళ్లిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను కంగారుగా అంతా చూసుకుంటూ వస్తున్నాను.

నేను తెలుగులో పర్సు అని అంటాను, అర్ధం అయిన వాళ్ళకి అర్ధం అయింది, అర్ధం కాని వారికి కాలేదు.

అడుగుతూ వస్తున్నాను, గేటు దగ్గర సెక్యూరిటీకి చెబుతున్నాను, వాడు క్యా క్యా అంటున్నాడు, ఈ లోగా మా వారు వచ్చారు.

వస్తూనే నా కంగారు అంతదూరం నుండే చూసి ఏదో జరిగిందని పసిగట్టేసారు. ఏమిటని అడిగారు, నేను విషయం చెప్పాను, అంతే తిట్లు మొదలుపెట్టారు,

ఒకసారి అందరం దర్శనం చేసుకున్నాక మళ్ళీ నువ్వు ఒక్కదానివే ఎందుకు ఆగిపోయావు, అందులో ఏమున్నాయి? ఎంత డబ్బుంది? అన్నారు,

”నాలుగు 500  నోట్లు కొన్ని వంద నోట్లు, కొంత చిల్లరగా పది రూపాయల నోట్లు అంతా కలిపి 2000 వరకు ఉన్నాయి” అన్నాను, ఆయన తిడుతున్నాడు, నేను ఏడుస్తున్నాను.

ఒక పక్క డబ్బు పోయిందని మరో పక్క బాబాని మరో సారి చూడడానికి వస్తే ఇలా జరిగిందని కోపం, ఉక్రోషం, ఏడుపు అన్ని ఒకేసారి వస్తున్నాయి,

ఇద్దరం రూమ్ కి వెళ్ళాం, తాళం తీశారు, ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమే, మంచం పైన నాలుగు 500 రూపాయల నోట్లు, ఇంకా వంద నోట్లు, చిల్లర నోట్లు ఏవైతే నేను పోయానని అన్నానో ఆ నోట్లన్నీ మంచం పైన చెల్లా చెదురుగా పడేసి ఉన్నాయి.

మా వారు అంతకు ముందే రూమ్ దాకా వచ్చి తాళం తీసి లోపల బాత్రూమ్ కి వెళ్లి , నేనేమైపోయానో అని అనుకుంటూ మళ్ళీ వచ్చారు,

అంటే ఆయన వచ్చినప్పుడు అక్కడ డబ్బులు లేవు, ఉంటే నేను కంగారు పడుతుంటే ఆయన నన్ను ఎందుకు తిడతారు, ఇంట్లో ఉన్నాయని చెప్పేవారుగా! డబ్బులు పోయాయని బాధ పడుతున్నానుగా,

అందుకని ”బాబా” ఇలా చుపించాడన్నమాట, ”నువ్వు ఉన్నావు బాబా” అని ఆనందంతో ఏడ్చాను .

నాకు 1993 లో ఒంట్లో బాగుండలేదు. నెలల తరబడి అలా బ్లీడింగ్ అవుతూండేది.

చాలా ఇబ్బందిగా ఉండేది, చాలా రక్తం పోతుండేది, చాలా బాధ పడేదాన్ని, ఏ డాక్టర్ కి చూపించినా, ఎవరో ఏది అంటే అదీ వాడాను, ఏం లాభం లేకపోయింది.

ఆయుర్వేదంలో మంచి మందులున్నాయి, ఇలా వేయగానే అలా తగ్గిపోతుంది ట్రై చేయమని ఎవరో చెప్పారు, అదీ అయింది, ఏ మాత్రం గుణం కనపడలేదు సరికదా సమస్య ఇంకా ఎక్కువగా ఉండేది.

మా పక్కింట్లో జాతకాలు చూసే ఒకావిడ నన్ను చూసి నీకేం కాదు, ఆపరేషన్ లాంటివి ఏం కాదు నీకు, అంతా బాగానే ఉంటుందని చెప్పింది.

రోజులు గడుస్తున్నాయి, ఎలమంచిలి నుండి గాజువాక వెళ్ళాను, అక్కడ ఒక డాక్టర్ కి చూపించుకుంటే ఇప్పటికే చాలా ఆలస్యం చేసారు వెంటనే ఆపరేషన్ చేసేయాలి అని చెప్పింది.

నాకేమో భయం వేసింది, నాకేమో ఇంజక్షన్ అంటేనే భయం, మందులేమో ఇచ్చారు, నేను వాడుతూనే ఉన్నాను కాని ఏ మాత్రం గుణం కనపడలేదు,

నా బాధల్లా నాకు ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ లో ఉంటే, మాకు సాయం చేసే వాళ్ళెవరూ లేరు.

కనీసం 5 , లేదా 6 నెలలు విశ్రాంతి లో ఉండాలి. ఇంట్లో పిల్లల్ని ఆయన్ని ఎవరు చూసుకుంటారు. అసలు బాధ కంటే ఈ బాధ ఎక్కువగా ఉంది నాకు.

నన్ను చూసిన డాక్టర్ గారి మేనకోడలు కూడా డాక్టరే. ఆవిడ దగ్గరున్న ఒక ఆయాని నా పనులన్నిటి కోసం పెడతానన్నారు.

రాత్రికి కావాలంటే మా వారిని వచ్చి ఉండమన్నారు. ఒక రోజు ఇంక బాధ తట్టుకోలేక మా వారు ఆఫీసుకి, పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయాక పక్కింటి వారికి మా వారు వస్తే హాస్పిటల్ కి పంపమని చెప్పి నేను హాస్పిటల్లో చేరిపోయాను.

అన్ని పరీక్షలు చేసి రేపు ఉదయం ఆపరేషన్ చేస్తామన్నారు. బ్లడ్ గ్రూప్ అడిగారు, ఎందుకంటే ఆపరేషన్ అప్పుడు రక్తం ఎక్కించవలసి వస్తుంది అని, మరియు నా రక్త పరీక్ష చేసి నా హీమోగ్లోబిన్ లెవెల్ చూసి ఆశ్చర్యపోయారు.

11 . 5 ఉంది, అంత బ్లీడింగ్ అవుతూ నేను నిరసించిపోతున్నా అంత రక్తం ఉందంటే పరీక్ష చేసినతను సరిగ్గా చూసాడా, లేదా అని అడిగారు.

ఖచ్చితంగా రక్తం మోతాదు తక్కువగా ఉంటుందని ఆవిడ అభిప్రాయం.

మర్నాడు ఉదయం 7 గంటలకి వాళ్ళ ఫార్మాలిటీస్ పూర్తి చేసి నాకు ఒక సెలైన్ బాటిల్ పెట్టి పడుకోబెట్టారు.

నాకు భయంతో ఒళ్ళు చల్ల పడిపోతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకి ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు.

ఇద్దరు ముగ్గురు డాక్టర్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆపరేషన్ ముందు ఏమీ తినొద్దు, తాగొద్దు, వాంతులు అవుతాయి అని చెప్పాక కూడా ఎందుకు తిన్నారు అని నన్ను అడుగుతున్నారు.

నేనేమీ తినలేదని చెప్పాను. ఒక డాక్టర్ నా చెయ్యి పట్టుకొని ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇలా మాటల్లో కొంత సమయం గడిచింది.

నాకు విసుగొచ్చి తొందరగా ఆపరేషన్ చెయ్యండి, ఆలస్యం చేస్తున్నారెందుకు అన్నాను.

నా చెయ్యి పట్టుకున్న డాక్టర్ పగలబడి నవ్వాడు. ”అమ్మా! నీ ఆపరేషన్ అయిపోయింది” అన్నాడు.

”అదేంటి? నా కింత నొప్పి కూడా లేదు, అదెలా సాధ్యం?” అని నేనంటే, ఆయన ”అమ్మా! నేనుండగా నీకు నొప్పి ఎలా ఉంటుంది, నేనున్నదే అందుకు” అన్నారు.

ఎవరీయన అని అనుకుంటుంటే, నన్ను గుర్తుపట్టలేదా అన్నట్లుగా నవ్వి ఆయన వెళ్లిపోయారు.

రాత్రి ఏమైనా నొప్పి వచ్చి నిద్రపట్టకపోతే వేసుకోవడానికి మాత్రలు ఇచ్చి వెళ్ళిపోయింది  డాక్టర్.

కానీ నాకు ఏ నొప్పి రాలేదు. మర్నాడు బ్రెడ్, పాలు పెడితే వద్దని చెప్పి నర్సుల సాయంతో బాత్రూమ్ కి వెళ్లి వచ్చాను.

డాక్టర్ వచ్చి ఎందుకు లేచారు. ఎవరు లేవమన్నారని కేకలేసింది. నొప్పి లేదా అని ఆవిడ అడిగితే, నాకసలు ఆపరేషన్ అయినట్టే లేదని చెప్పాను.

ఆపరేషన్ కి ముందు నా పరిస్థితి చూసి ఆవిడ అసలు నేను ఆపరేషన్ తట్టుకోగలనా లేదా అనుకున్నారట.

మాములుగా ఆపరేషన్ అయిన వాళ్ళు మూడు రోజులు లేవలేరు ఎందుకంటే ఈ ఆపరేషన్ పది సిజేరియన్లతో సమానం.

ఒంట్లో ఒక అవయవం తీసేసారు కాబట్టి నేను లేవకూడదని మరీ మరీ చెప్పి వెళ్ళింది డాక్టర్.

ఒక నెల దాటిన దగ్గర నుండి విపరీతమైన జ్వరం పట్టుకుంది. దాని మూలాన కొన్నాళ్ళు పడుకుండి పోయాను.

లేకపోతే హాస్పిటల్ నుంచి రాగానే నేను నా పనులు చేసుకునేదాన్నేమో!

అలా ఆ ఆపరేషన్ సమయానికి శ్రీ సాయే ఏ నా వెంట ఉన్నాడు కాబట్టి ఏ బాధ లేకుండా అంతా బాగా అయ్యింది. సర్వం శ్రీ సాయి మయం.

సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణ మస్తు

శుభం భవతు

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles