ఎవరి త్రోవ వారిదే! …. మహనీయులు – 2020… మే 11



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


గురువుగల శిష్యుడు సాయి. శిష్యుడు లేని గురువు సాయి. గురువులేని  శిష్యుడు జిడ్డు కృష్ణమూర్తి (J.K.);

శిష్యుడు లేని గురువు  J. K. కొందరి జీవితాలు వడ్డించిన విస్తరిలాగా ఉంటాయి; కానీ ఆ విస్తరిని కాదనటం నీతి, నిజాయితీలకు, నిర్వ్యామోహత్వానికి గురుతు.

దివ్యజ్ఞాన సమాజానికి చెందిన లెడ్ బీటర్, జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక కొలనులో ఈతకొడుతుంటే, తన యోగదృష్టితో J.K. చుట్టూ కాంతివలయాన్ని చూచాడు లెడ్ బీటర్.

ఆయనకు (J. K.) ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాలలో వివిధ శాఖలలో, సమస్త కళల్లో శిక్షణ ఇప్పించారు.

J. K. బుద్ధుని వేషం ధరిస్తే, సినిమా పరిశ్రమవారు 2,000 పౌండ్లు ఇస్తామన్నారు. కాడిలాక్ కార్ల కంపెనీవారు తమ కారు ప్రక్కన నిలబడి ఫోటో తీయించుకుంటే ఒక కాడిలాక్ కారు ఇస్తామన్నారు.

J.K. ఏమి వ్రాసినా, ఏమి మాట్లాడినా ఒక దివ్య శక్తి ఆయనచేత అట్లా పలికిస్తుందనే వారు.

ఆయనను శ్రీకృష్ణుడని కొందరంటే, జేరుసెలం వీధుల్లో తిరుగాడిన జీసస్ అని మరి కొందరున్నారు.

బౌద్దులు మైత్రేయావతారము అన్నారు. జార్జి బెర్నాడ్ షా the most beautiful person I have met అన్నారు.

ప్రపంచ ప్రముఖ సాముద్రిక శాస్త్రవేత్త అయన (J. K.) హస్తముద్రలు పరిశీలించి ఆయనది అసాధారణము, ఆశ్చర్యకరమైన వ్యక్తిత్వమని, గొప్ప సరళ స్వభావమనీ పేర్కొన్నారు.

J. K. ది అసాధారణ మానసిక స్థితి. ఆయనకు దివంగతురాలైన అక్క, వివిధ దేవతామూర్తులు కనిపించేవారు. మనుజులకు సహాయపడే అదృశ్య శక్తులు ఆయనకు కనిపించేవి. ఆయనకు యోగశక్తులున్నాయి.

కృష్ణమూర్తి గారికి నిత్యానందుడు అనే తమ్ముడుండే వారు. ఆ ఇద్దరు విదేశాలలో ఉండగా వారికీ అనారోగ్యం సోకింది.

చికిత్స కోసం నిత్యనందుడు భారతదేశం వెళ్ళిరావచ్చునని, ఏ ప్రమాదము లేదని సుప్రసిద్ధ దివ్యజ్ఞానులు చెప్పారు.

తనకు (J. K.) ఇష్టం లేకున్నా, వారి మాటలమీద తమ్ముడిని పంపాడు. సముద్ర ప్రయాణం చేస్తుండగా నిత్యనందుడు మరణించారు.

J. K. ఎప్పుడూ అంత దుఃఖం అనుభవించలేదు. నమ్మకం చెదిరింది. చింతన మొదలైంది. విశ్వ విఖ్యాత పురుషునిగా తనను భావించే సంస్థను రద్దు చేశాడు.

దానితో కోట్లాది రూపాయల ఆస్తిని, లక్షలాది అనుచరులను త్యజించాడు. నూతన మార్గాన్వేషి అయ్యాడు.

సత్యం ఒకరు బోధించేది కాదు, ఎవరికీ వారుగా తెలుసుకోవాలి. ఎవరికి వారుగా ఆలోచించటం నేర్చుకోవాలి. ప్రేమించటం నేర్చుకోవాలి, అనుమానాలు, భయాలు ఎంచుకున్న వారెవ్వరూ ఎదగలేరు, వెలుగును చూడలేరు.

భయంవల్లనే మానవులు మతం అనే నీడలో తలదాచుకుంటారు. మనస్సు ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి అని అంగలార్చుతుంది.

జాగ్రత్తగా మనసును గమనిస్తుండాలి. ‘గమనిక’ ఎక్కువైతే ‘ఆరాటం’ తగ్గుతుంది.

J. K. జన్మదినం నేడే మే 11 (1895) ఆయనను స్మరిస్తూ, ఆయన ఒక బోధను పాటిద్దాం –

“మన పనుల్ని మనం సరిగ్గా చేసుకోగలిగితే, భగవంతుడు ఎక్కువ సంతోషిస్తాడు. తృప్తి పడతాడు”.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles