Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఆ తర్వాత మా పనిమనిషి కొడుకు ఒక రోజు రాత్రి తొమ్మిది గంటలకి హడావిడిగా మా ఇంటికి పరిగెత్తుకొచ్చి ”అమ్మా మా అమ్మకి ఏమీ బాగాలేదు, తొందరగా మిమ్మల్ని పిలుచుకు రమ్మంది” అన్నాడు.
భోజనం చేస్తున్నాను, ఏమైందో ఏమో అని కంగారుగా చెయ్యి కడుక్కొని వెళ్ళాను.
వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరే, ఒక పెకుంటింట్లో ఉంటోంది, ”ఏమిటి సలీమా! ఏమైంది, ఎందుకు కబురు చేసావు” అనుకుంటూ లోపలికి వెళితే, మంచంలో మనిషి కనపడటమే లేదు, మంచానికి అతుక్కుపోయి ఒక గీత లాగా కనపడుతోంది.
“ఎం చెప్పనమ్మా నాకు మధ్యాహ్నం మూడు గంటలనుండి విరేచనాలు, వాంతులు అవుతున్నాయి” అని చెప్పింది.
ఎక్కడో నూతిలోంచి వినపడుతుంది గొంతు, సరేనని నేనేమి ఖంగారు పడలేదు, ఉండు ఇప్పుడే వస్తానని ఇంటికి వచ్చి మా వారికీ విషయం చెప్పాను.
వారు వెంటనే బాబా ఊదీ, ఒక బాబా ఫోటో ఇచ్చి పంపించారు. నేను సలీమా ఇంటికొచ్చి ”ఖంగారు పడొద్దు సలీమా, మనకి బాబా ఉన్నాడుగా తగ్గిపోతుంది చూడు, ఇది బాబా ఊదీ ఇది కొంచెం గ్లాస్ లో వేసుకుని తాగు, ఈ బాబా ఫోటో దిండు కింద పెట్టుకో,”
అని పిల్లాడి చేత నీళ్లు తెప్పించి గ్లాస్లో ఊదీ వేసి దాని చేత నెమ్మదిగా తాగించాను, దిండు కింద బాబా ఫోటో పెట్టేసి దాన్ని విశ్రాంతి తీసుకోమని చెప్పి వచ్చేసాను అంతే.
వచ్చేసరికి రాత్రి పదిగంటలు అయ్యింది. అప్పుడు నాకు మొదలయ్యాయి విరేచనాలు, వాంతులు, ఆగవు, వెడుతున్నాను వస్తున్నాను, తెల్లవారుఝామున మూడు గంటలవరకూ అలా అవుతూనే ఉన్నాయి.
తెల్లవారాక మేము డాక్టర్ని కలిసాము, ఆయన మాత్రలేవో రాసి ఇచ్చాడు, తొమ్మిది గంటలకి పూర్తిగా తగ్గిపోయాయి.
సలీమాకి నేను ”ఊదీ” వేసాక విరేచనం అవ్వలేదట. ఉదయాన్నే మళ్ళీ మాములుగా పనికి వచ్చేసింది. దానికి నీరసం కూడా లేదు, మాములుగా ఉంది.
నాకు రాత్రి విరేచనాలు, వాంతులు అవుతున్నాయంటే అది విని ఆశ్చర్యపోయింది.
మరొకసారి ఒక ఉదయాన్నే సలీమా పరిగెత్తుకొచ్చి, ”అక్కా నాకు రాత్రి బాబా గారు కలలో కనపడ్డారు, కనపడి మా పిల్లలు ముగ్గురికి తలా ఐదు రూపాయలిచ్చి, ”నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అని విసుకుంటూ వెళ్లిపోయారు” అదీ కల.
అది నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ కూర్చుంది. ”బాబా నా దగ్గర ఉండనని వెళ్ళిపోయాడు, ఇంక నేనెట్టా ఉండేదక్కా” అంటూ శోకాలు పెట్టడం మొదలుపెట్టింది.
ఇదేం కల, ఇలా ఎందుకొచ్చిందా అనుకుంటూ,” వుండవే ఇది కలే కదా. గాబరా పడకు” అంటున్నానే కానీ మనసుకేదో కీడు శంకిస్తోంది,” బాబా మనల్ని వొదిలి వెళ్లిపోవడం అనేది ఉండదు” అన్నాక సరే అంది, అది ఇంటికి వెళ్ళిపోయింది.
వాళ్ళ ఇంటి ఓనర్ వచ్చి సాయంత్రానికల్లా ఇల్లు ఖాళీ చేస్తావా లేదా అని కుర్చున్నాడట.
మళ్ళీ పరిగెత్తుకువచ్చింది, ”అక్కా మా ఇంటి ఓనర్ సాయంత్రము లోపల ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు”, ” నీకు ఇప్పటికిప్పుడు ఇల్లు ఎలా దొరుకుతుంది, ఆయన్నే కాస్త సమయం ఇమ్మని అడగకపోయావా” అన్నాను.
”ఎంత చెప్పినా వినట్లేదక్కా, సాయంత్రానికి అంటే పిల్లలతో ఎక్కడికి పోను, ఎలా వెతుక్కొంటూ నాలుగు రోజులైనా సమయం ఇవ్వకపోతే ఎలాగా అని ఎంత చెప్పినా ఆయన వినటం లేదు, పైగా అదంతా నాకు తెలియదు నువ్వు సాయంత్రనికల్లా ఇల్లు ఖాళీ చెయ్యాల్సిందే” అంటున్నాడు, అంది.
”సరే ఈ రోజు పనులు నేనే చేసుకుంటాను, నువ్వు ఇల్లు వెతుక్కో” అని అన్నాను.
అది వెళ్ళింది, దానికి రెండు వీధుల అవతల ఇల్లు దొరికింది, సాయంత్రానికల్లా ఇల్లు మారిపోయింది.
అంతే! ఆ రాత్రి అది ఇంతక ముందు ఉంటున్న ఇల్లు నిలువునా కూలిపోయింది. అందరం హతాశులయ్యాము.
బాబా తాను వెళ్లిపోతానని ఇచ్చిన సంకేతం ఇదేనన్నమాట. ఇల్లు కూలిపోతుంది కాబట్టే తాను వెళుతూ వాళ్ళను ఖాళీ చేయించాడు.
ఆ ఇంట్లోనే, అక్కడే ఉంటే అదీ పిల్లలూ ఉండేవారు కారు. ”ఆయన వదిలి వెళ్ళినట్లా, ఉండి కాపాడినట్లా ?”.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- మా కొత్త ఇల్లు అంత బాబా నామమయం
- బాబా వారి దయతో వారం లోగ మా ఇల్లు అమ్ముడయిపోయి, మా పెద్ద పాప పెళ్లి చేయగలిగాము.
- ఒక నాస్తికుని చేత శివదీక్ష చేయించి మోక్షాన్ని ప్రసాదించిన బాబా వారు!
- ఆటోవాని రూపంలో వచ్చి భక్తున్ని భోపాల్ గ్యాస్ దుర్ఘటన నుండి కాపాడిన బాబా వారు
- కలలో కనిపించి పసుపు కుంకుమ ఇచ్చి, భక్తురాలి ఐదవ తనాన్ని కాపాడిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments