యిస్తానన్నది మరి అడిగి తీసుకుంటారు బాబా–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-168-1112-తీసుకుంటారు బాబా 1:38

ఒక సారి షిరిడీలో బి.వి.నరసింహస్వామి వారు, కేశవయ్యగారు సకోరి వెళ్ళుచుండగా రహతా దగ్గరలో రోడ్డు ప్రక్కన ఒక కుష్ఠు వానిని కేశవయ్యగారు చూశారు.

అతను కేశవయ్య గారిని ధర్మమడుగగా తిరిగి వచ్చేటప్పుడు యిస్తానన్నాడు కేశవయ్యజీ. వచ్చేటప్పుడు ఈ విషయం మరిచిపోయి షిరిడి వచ్చి ద్వారాకామాయికి వెళ్ళాడు. అక్కడ ధ్యానములో కూర్చుంటే బాబాకు బదులు ఆ కుష్ఠువాడే కనిపిస్తున్నాడు.

ఈ విషయం శ్రీ నరసింహస్వామి వారికి చెప్పితే హుండీలో నాలుగు అణాలు వేయమని చెప్పారు. కేశవయ్యగారు అలానే నాలుగు అణాలు హుండీలో వేశాడు.

ఆరతి సమయమునకు మందిరమునకు వెళితే కుష్ఠు వాడు మరలా కనిపించాడు. కుష్ఠువానిని నిర్లక్ష్యం చేసినందుకు క్షమించమని బాబాని ప్రార్ధించాడు కేశవయ్యగారు.

కేశవయ్యగారు బస్సు ఎక్కి వెళుతుండగా ఆ కుష్టువాడు కూర్చున్న చోట బస్సు ఆగింది.

అతను బస్సు ఎక్కి కేశవయ్యగారి వద్దకు వచ్చి బిక్ష అడిగాడు. అప్పుడు కేశవయ్యగారు నాలుగు అణాలు అతనకిచ్చాడు . ఆ బిచ్చగాడు మరెవరిని అడగకుండా బస్సు దిగివెళ్ళాడు.

అలా బాబా మానమసుకున్నది వాసులు చేస్తారు. ఇప్పుడు కేశవయ్యగారు ప్రశాంతబడ్డారు.

సంపాదకీయం: సద్గురులీల ( ఏప్రిల్ – 2014)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles