కఫ్నీ తొడుక్కున్న హస్తం నన్ను పైకి లాగింది–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-170-1212-కఫ్నీ తొడుక్కున్న 2:36

ఢీల్లీ నివాసి రజనీ శర్మకి 20.6.1978 వ తేదీ చాలా దుర్దినము. ఆరోజు ఆమె తండ్రి స్వర్గస్తులయ్యారు.

తన తల్లి అనారోగ్యవంతురాలూ, బలహీనురాలు అవడం వలన, తన తమ్ముని వయసు ఏడాదికి మించకపోవడము వలన విషాదంతో ఆమె ఖిన్నురాలైంది.

తండ్రి అంత్యక్రియలు జరిగిన మూడవరోజు ఏదైనా దేవాలయానికి వెళ్ళాలన్నది ఆచారం.

కన్నాట్ ప్లేస్ లో వున్న ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళిన ఆమెకి ఒక ఉబ్బెత్తుగా వున్న లోహం మీద బాబా చిత్రం వున్న ఫోటో కనిపించింది.

ఆమె ఆ ఫొటోకి ఆకర్షితురాలవడానికి కారణం ఆ ఫోటోలో బాబా అభయ హస్తం తో వున్నారు.

ఆ సమయంలో ఆమెకి బాబా ఆమె జీవితంలో ఒక ప్రముఖ పాత్ర పోషించబోనున్నారని తెలియదు.

ఏమైనాఆ ఫొటోని ఆమె ఇంటికి తెచ్చి ఆమె పూజ గదిలో పెట్టుకుంది. “నాకు ఇటీవలనే పితృవియోగం కలిగింది, ఈ క్షణం నుండీ నువ్వే నా తండ్రివి’ అని బాబాకు చెప్పుకుంది. అప్పటికి ఆమెకి బాబా గురించి ఏమీ తెలియదు.

ఓరోజు ఆమె సహాద్యాయిని తనతో పాటు గా లోధీ రోడ్డులోని మందిరానికి తోడురమ్మని అడిగింది.

లోపలికి అడుగుపెడుతూనే అక్కడి బాబా విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయింది.తాను తన ఇంటికి తెచ్చుకున్న ఫోటో లోని రూఫమే ఇది.

ఒకరోజు రాత్రి ఆమెకు ఒక స్వప్నం కలిగింది. అందులో ఆమె లోఢీరోడ్డు లోని సాయి మందిరానికి వెళ్ళి బయటకు వస్తూండగా అక్కడ వున్న తన చెప్పులు తీసికోవాలంటే ఒక నల్లని గ్రానైట్ అడ్డుగా నిలిచింది.

ఆమె మెల్లిగా ఆ గోడ ఎక్కసాగింది. బల్లిలా మెల్లమెల్లగా పాకసాగింది. చివరికి చేరెంతలో ఆమె జారి పోవడం పారంభమైంది. ఆశ్చర్యం! కఫ్నీ తొడుక్కొన్న చేయి ఆమెని పడిపోకుండా, జారిపోకుండా పైకి లాగింది.

అంతటితో కలా ముగిసింది.
ఆమె సాయికి అనుంగు భక్తురాలవడానికి ఆ స్వప్నం కారణమైంది, ఆ తర్వాత ఆమె ని బాబా చేయి పట్ఠుకుని నడిపించారు. ఆమె సోదరుడు ఎగుమతి వ్యాపారం ప్రారంభించాడు.

షిరిడీలో ఒక అపార్ట్మెంటు కొనుక్కుంది, తరచుగా షిరిడీకి పోయి చాలా సమయాన్ని గడుపుతూ వుంటుంది.
రజని ద్వారా వ్యక్తీకరణ:
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com
whatsapp 7033779935
Voice call: 9437366096

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles