బాబా అదృశ్య హస్తం నన్ను అనుక్షణం కాపాడుతూనే ఉంది–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-71-1104-బాబా అదృశ్య హస్తం నన్ను అనుక్షణం కాపాడుతూనే ఉంది 5:30

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

సరే నేను కంపెనీ పెట్టడానికి నా భార్య అనుమతి లేకుండానే నాకు వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా మరియు నా విదేశీ ఉద్యోగం ద్వారా మిగిలిన డబ్బు అంతా మదుపు పెట్టాను.

దానికి తగ్గట్లు గానే ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా వచ్చింది.  ఇంక అప్పట్నుంచి మొదలయ్యాయి నా పాట్లు.

నా ఇన్వెస్ట్మెంట్ ఆ ప్రాజెక్ట్ ఖర్చు లో 5 శాతం కన్నా తక్కువే.

మిగిలిన ఫండ్స్ తీసుకురావడానికి నేను పడిన పాట్లు బహుశా ఎవరూ పడరేమో.

సాంకేతికంగా నాకు సహాయం చేయడానికి అందరూ ఉన్నా ఆర్ధిక పరిస్థితిని చక్క దిద్దడానికి మాత్రం ఎవరూ లేరు.

నేనొక్కడినే ఆ ఫండ్స్ అన్నీ సాధించి పెట్టాలి.  అందుకు నాకు తగిన వనరులు లేవు.

బాబా సహాయం లేదు. [నాకు డైరెక్ట్ గా ఎటువంటి సహాయం చెయ్యకపోయినా సమస్యలు వచ్చినప్పుడు గట్టేక్కిస్తూ నాకు వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నాడు.] 

కష్టపడి 2 ½  సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ తో కుస్తీ పట్టి పట్టి ఎన్నో లక్షల అప్పులతో (నేను జీవితాంతం పని చేసినా తీర్చలేనంత అప్పులు) ఆ కంపెనీని నడపలేక మూసేయాల్సి వచ్చింది.

ఆ విధంగా నా బిజినెస్ ప్రయత్నం నన్ను తీవ్రమైన అప్పుల ఊబిలో ముంచింది.

వాటిని తీర్చే తాహతులేక ఆ అప్పులు తీరే మార్గం కనపడక తీవ్ర మనోవ్యధకు లోనయ్యాను.

నా ఆరోగ్యం బాగా దెబ్బ తింది.  అప్పులిచ్చిన వాళ్ళు ఊరుకోరుగా. ఒకొక్కరు పీడించడం మొదలెట్టారు.

నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, జైల్లో పెట్టించడం, కిడ్నాప్ చెయ్యడం, నా (భార్య) ఆస్థిని మా విలువైన వస్తువులను దోచుకోవడం మొదలైన అన్ని దారులను ఉపయోగించారు.

ఈ పరిస్థితులన్నిటిలొ కూడా బాబా అదృశ్య హస్తం నన్ను అనుక్షణం కాపాడుతూనే ఉంది. 

నా ఆస్థిని నా భార్య పేరుమీద పెట్టించారు. నా పేరు మీద ఉంటే అవి అన్నీ కూడా ఎప్పుడో అమ్మివేసి ఉండేవాడిని.

బాబా అలా చేయకుండా నన్ను, నా వాళ్ళను రోడ్డు మీద పడకుండా కాపాడారు. 

నా పేరు మీద ఒక్కటీ లేక పోవడం నాకొక వరంగా చేసారు. 

ఈ పరిస్థితులను ఈవిధంగా కల్పించి నాకు బుద్ధి వచ్చేటట్లు చేసారు.

నా తప్పేంటో నాకు తెలిసి వచ్చేటట్టు చేసారు. సాయి తను చెప్పినమాట వినకపోవడం ఎంత అనర్ధానికి దారి తీసిందో స్పష్టంగా అనుభవింపచేసారు.

ఆ కంపెనీ మూసివేసిన దగ్గర నుంచి (2003 చివరలో) నన్ను తన దాసుడుగా చేసుకున్నారు.  బాబాని ప్రేమిస్తూ వస్తున్నాను,  ఆరాధిస్తున్నాను.

అప్పట్నుంచి నేను బాబా మీదే ఆధారపడుతూ వస్తున్నాను.  బాబాను వదిలే ప్రసక్తే లేదు. 

అను నిత్యం బాబా నామ జపం చేస్తూ, పూజలు – అభిషేకాలు చేసుకుంటూ రోజులు గడుపుకుంటూ వస్తున్నాను. 

బాబాకి నేను, నాకు బాబా అత్యంత ప్రియమైన వారం అయిపోయాము. 

ఇంక అప్పట్నుంచీ నాతో ఇంచుమించు ప్రతిరోజూ (ధ్యానంలో) మాట్లాడుతూ నాకు తగిన సలహాల నిస్తున్నాడు. 

అప్పుడప్పుడు (ధ్యానంలోనే) నాకు దివ్య దర్శనాలు ఇస్తూ నన్ను ఆనంద దోలికలలో ముంచుతూ నా కష్టాల ప్రభావం ఎక్కువగా తెలియనీయకుండా చేస్తున్నారు.

అప్పులవాళ్ళు 2004 నుంచి 2006 వరకు మా వెంట పడుతూనే ఉన్నారు, మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు.

వారి బారి నుంచి తప్పించడానికి, మాకు మనశ్శాంతి కలిగించడానికి మమ్మల్ని వేరే చోటుకి  (ఎక్కడైతే వాళ్ళు మమ్మల్నికనుక్కోలేరో) అక్కడికి ఇల్లు (తనే సెలెక్ట్ చేసి మరీ) మారేటట్టు చేసారు.

ఆవిధంగా మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు.  అప్పులవాళ్ళు కూడా అలిసిపోయి అడగటం మానేసేటట్టు చేసారు.

(ఈ పరిణామానికి కారణం ఏంటో బాబా చెప్పాడు – క్రితం జన్మలలో వాళ్ళు నాకు రుణపడి ఉండటమే కారణం. 

వాళ్ళు నాకు బాకీ పడిన రుణాన్ని ఈ జన్మలో వాళ్ళు నాకు రుణాలనిచ్చి ఈవిధంగా తీర్చుకున్నారు.  కాకపోతే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదుకదా.  అందుకే నన్ను బాధిస్తున్నారు). 

ఎంత విచిత్రమో చూసారా!  ఈ కాలంలో ఎవరైనా పదివేలు అప్పైనా సరే విడిచిపెట్టరే, అటువంటిది ఎన్నో లక్షల అప్పులను వాళ్ళు వదిలేసుకునేటట్టు చేయడం అంటే బాబా చేసిన లీల/ మహిమ కాకపోతే మరేంటి? 

అందుకే నేను ఆ మహా దైవానికి ఆ మహా సిద్ధ గురువుకు ఏమిచ్చి ఆ ఋణం తీర్చుకోగలను? అనుక్షణం ఆయనను ప్రేమిస్తూ ఉండడం తప్ప. 

ఆయనను ప్రేమిస్తూ ఆయన సేవలే చేసుకుంటూ ఉంటాను.  ఇంతకన్నా ఏం చేయగలను నేను?

రేపు తరువాయి భాగం …..

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles