కృష్ణబాయి ప్రభాకర్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

కృష్ణబాయి ప్రభాకర్ బాబా యొక్క దర్శనం కొరకు వచ్చినప్పుడు, ఆమెకు నాలుగు అణాలు బాబా ఇచ్చారు. ఆమె బాబా చేతితో పవిత్రమైన ఆ నాణేలు పూజలో పెట్టి రోజు వాటికి పూజ చేస్తూ ఉండేది.

ఒక రోజు కొబ్బరికాయలను విక్రయించడానికి ఒక మహిళ వచ్చింది. కృష్ణబాయి తెలియకుండానే కొన్ని ఇతర నాణేలతో పాటు ఆ నాలుగు అణాలు కలిపి ఆమెకు ఇచ్చేసింది. ఆమె ఇంటి పనులను పూర్తి చేసిన తర్వాత  ఆమెకు ఆ నాణేలు ఎచ్చేసినట్లు గ్రహించి తన మూర్ఖత్వానికి తీవ్రంగా ఏడ్చింది.

సాయంత్రం వేల ఎవరు తలుపు కొట్టినట్లు చప్పుడు ఐయ్యింది. కృష్ణబాయి విచారకరమైన హృదయంతో తలుపు తెరిచింది. చుస్తే ఉదయం కొబ్బరి కాయలు అమ్మిన ఆమె వాకిట్లో నిలిచి ఉంది. ఆ కొబ్బరికాయలు అమ్మే ఆమె ఆ నాలుగు నాణెములను తిరిగి ఇచ్చి వాటికీ బదులుగా వేరే నాణేలు తీసుకోని వెళ్ళిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో కృష్ణబాయి ఆశర్యపోయింది. ఆమె కళ్ళ నుండి ఆనందబాష్పాలు జాలువరాయి. బాబా చూపిన ఈ లీలకు ఆమె మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles