Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
షోలాపూరు నివాసియగు సఖారామ్ ఔరంగాబాద్ కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము లేని కారణంగా షిర్డీ వచ్చి బాబాను ఆశ్రయించెను. శ్యామ శ్రీమతి ఔరంగబాబు తరఫున బాబాతో ఆమెకు కొబ్బరికాయను, ఆశీర్వాదం ఇవ్వమని అందువలన ఆమెకు సంతానం కలుగునని బాబాని ప్రార్ధించేను.
అప్పుడు బాబా “కొబ్బరికాయలు పిల్లలను ఉత్పత్తి చేస్తాయా? మీరు ఎంత మూఢనమ్మకాలతో ఉంటారు?” అని షామాతో అన్నారు. అందుకు శ్యామ ‘నీ మాటల మహిమయు, ఆశీర్వాదప్రభావమును నాకు దెలియును. నీ యాశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు, ఆశీర్వాదమును ఇవ్వకున్నావు’ అని అన్నాడు.
తుదకు బాబా లొంగి ‘ఆమెకు సంతానము కలుగు’ ననెను. ఎప్పుడని శ్యామా యడిగెను. 12 మాసములలోనని బాబా జవాబిచ్చెను. ఆతరువాత ఆమెకు 12 నెలల్లో పిల్లవాడు జన్మించెను. ఆవిధంగా బాబా ఒక గోడ్రలికి సంతాన భాగ్యం ప్రసాదించెను.(సాయి సచ్చరిత్రా అధ్యాయం. 36)
అటువంటి మరొక కొబ్బరికాయ లీల ఇది.
పూణేకి చెందిన ఒక మహిళకు సంతానం లేదు. బాబా నుంచి కొబ్బరికాయని పొందితే తనకు సంతాన భాగ్యం కలుగుతుందని ఆమెకు గట్టి నమ్మకం. షిరిడీకి వెళ్లి, బాబా ఆశీర్వాదాలను పొందాలని అని అనుకుంటూ ఉండేది. అయితే ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆమె ప్రయత్నాలన్ని ఏదో ఒక కారణం చేత విఫలమయ్యేవి. అందువలన ఆమె దుఃఖంతో నిరుత్సాహంగా భవిష్యత్ గురించి ఆలోచిస్తు ఉండేది.
ఒక రాత్రి ఆమెకు బాబా కలలో దర్శనం ఇచ్చి ఆమెకు ఒక కొబ్బరికాయను ప్రసాదంగా ఇచ్చారు. ఆమె నిద్రలేచి లేచి, కల గురించి ఆలోచిస్తే అది కల కాదు నిజమే అన్నట్లు ఆమెకు అనిపించింది. ఆమె చుట్టు చూసిసరికి పక్క మీద నిజంగానే ఒక కొబ్బరికాయ ఉన్నది. కలలో బాబా కొబ్బరికాయ ఇవ్వడంతో తనకు బాబా సంతానాన్ని అనుగ్రహించారని ఆమెకు అనిపించింది.
ఈ ప్రసాదం వలన నాకు బిడ్డ జన్మనిస్తే, ఆ బిడ్డను షిర్డీకి తీసుకెళ్తానని ఆమె మ్రొక్కుకున్నది. ఒక సంవత్సరం తరువాత ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. కొన్నిరోజులకి ఆమె తన బిడ్డతో కలిసి షిర్డీ వెళ్లి కృతజ్ఞతగా బిడ్డను బాబా పాదాల వద్ద ఉంచింది.
source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- నాన్నకి ప్రాణభిక్ష పెట్టిన బాబా ……!
- కొత్త దంపతులకు షిరిడీ ద్వారకామాయి లో బాబా వారు చేసిన లీల….
- విద్యుత్ ఘాతం నుంచి తల్లీ ని,పిల్లలను ,రక్షించిన వైనం.
- బాబాకి మొక్కినంతనే పరీక్షలో విజయం
- నా భర్తను మరణం నుంచి బయటికి లాగిన బాబా ….!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments