Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మాకు అబ్బాయి పుట్టిన కొద్దిరోజులకి, మా నాన్నకి చాల జబ్బు చేసింది. తాగుడు అలవాటు ఉండటం మూలాన లివర్ పాడైంది.
చాలా సీరియస్ అయింది. డాక్టర్స్ కూడా ఆశ వదులుకోమన్నారు. ఇంటికి తీసుకు వెళ్ళిపోండి. ఇంక మందులు పనిచేయవు అని చెప్పారు, ఇంటికి తీసుకువచ్చాము.
చుట్టాలందరూ వస్తున్నారు, నాన్నని చూస్తున్నారు, అమ్మను జాలిగా చూసి,పెదవి విరుచుకుంటూ వెళ్లి పోతున్నారు. పరిస్థితి భయంకరంగా తయారైంది.
మా చుట్టలాయన ఒకాయన వచ్చి మా నాన్నని చూసి, ”ఈయన ఉండడురా అబ్బాయ్! చాలా కష్టం చని పోతాడు’‘ అన్నాడు.
నేను ఆయనతో ”ఏం కాదు మా నాన్న ఏడాది తిరిగే లోపు మామూలు మనిషి అవుతాడు, చూస్తావా! మాకున్నది ఎవరనుకున్నావు బాబా! ఆయన మాకుండగా, మాకు అలాంటి కష్టం ఎందుకు వస్తుంది” అన్నాను ఉక్రోషంగా.
అంతకు ముందంతా చుట్టాలందరూ నాన్నని చూడటం, అమ్మని అయ్యో! అని జాలిగా చూడటం, ఆ చూపులలోని భావం నాకు అర్ధం అవుతోంది. ఉక్రోషం వస్తోంది.
ఈ లోపు ఈయన వచ్చి ఇలా అనడం, నాకు బాబా సాయం చేస్తాడు, ఆదుకుంటాడు, మా అమ్మ పసుపు కుంకుమలతో పచ్చగా ఉంటుంది. వుండాలి. అందుకే సాక్షాత్తు బాబాకే ఛాలెంజ్ చేసినట్టు అయ్యింది.
నాన్నని తీసుకువచ్చి బాబా ఫోటో కింద పడుకో బెట్టి మనసారా వేడుకున్నాను. మందులు వాడాము. 5నెలల లోనే ఆరోగ్యం కుదుటపడింది
నేను మెలకువగా ఉన్నంత సేపు నా నోటి వెంట బాబా నామం పలుకుతూ ఉంటాను.
అలా మాటి మాటికి ”సాయినాథా, సాయినాథా అంటూ ఉంటావు, పోయి ఆ షిరిడీ లోనే ఉండరాదా? పోరా? అని ఒక రోజు అమ్మ తిట్టింది.
మా ఇంటి హాల్లో పెద్దదైన బాబా ఫోటో ఉంది. అందులోనుంచి తెల్ల బట్టలలతో బాబా కనబడి ”ఏమనుకుంటున్నావు, నువ్వు వాడ్ని, నన్ను కూడా తిడుతున్నావు” అన్నాడట బాబా అమ్మతో.
అప్పటినుండి నన్ను ఏమన్నా అనాలంటే ”పోరా బాబూ ! నిన్నేమన్నా అంటే, వెంటనే ఫోటోలో నుండి ఆయన వచ్చి నన్ను కోప్పడతాడు అంటుంది. అప్పటినుండి బాబా అంటే గురి కుదిరింది అమ్మకి .
ఒకసారి మేము షిరిడీ వెళ్ళాము. అలా వెళ్ళినప్పుడు అక్కడ నుండి కొబ్బరికాయ తీసుకు వచ్చి ఇంటి గుమ్మం ముందు కట్టుకుంటే మంచిదని ఎవరో చెప్పారు.
ఈ సారి వెళ్ళినప్పుడు షిరిడీ నుండి కొబ్బరికాయ తెచ్చుకోవాలను కున్నాను.
సమాధి మందిరంలో బాబా దర్శనానికి వెళ్ళేటప్పటికి అక్కడ కొబ్బరికాయ కనపడింది.
ఆ కొబ్బరికాయ చూసేసరికి నేను ఇంటికి షిరిడీ నుండి కొబ్బరికాయ తీసుకు వెళ్ళాలి అన్న విషయం గుర్తొచ్చి నాతో వచ్చిన వాళ్ళతో ”చూడండి! బాబా పక్కనే ఉన్న కొబ్బరికాయను పూజారులు నాకే ఇస్తారు. చూడండి” అన్నాను.
బాబాకి దగ్గరగా వెళ్ళాము. బాబా అంటూ చేతులు చాచేసరికి అక్కడ పూజారి నా చేతిలో కొబ్బరికాయ పెట్టాడు.
మరో సారి బాబా పాదాల ముందు నాకు పెద్ద కలకండ ముక్క కనపడింది. ”చూస్తూ ఉండండి ఆ కలకండ నాకే ఇస్తారు” అన్నాను. అది కూడా నాకు ఇచ్చారు అక్కడి పూజారులు.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబా పెట్టిన ప్రాణభిక్ష
- నిస్సహాయురాలైన తన బిడ్డకు స్థిరనివాసం ఏర్పరచి, ప్రాణభిక్ష పెట్టిన బాబా!
- నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టిన బాబా-1
- నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టిన బాబా
- దూరాన్ని పెంచిన అంగ వైకల్యం, నాన్నకి దగ్గర చేసిన సాయి కరుణ ……….!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments