Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మావారు తిరుపతి దేవస్థానంలో కాలేజీలో పని చేసేవారు ఆయనకి క్వార్టర్స్ ఇచ్చారు,
కానీ మేము మాకు ఎదో విధంగా సొంత ఇల్లు అంటూ ఉండాలని అనుకుని కొనుక్కోవడానికి ఇల్లు చూసేవాళ్ళము. కానీ ఏ ఇల్లు కూడా మాకు అనుకూలంగా కుదరలేదు.
”ఇల్లు చూస్తారే గాని వీళ్ళు కొనరు” అంటూ పేరు కూడా పడిపోయింది కానీ, మాకు మాత్రం ఇల్లు కుదరలేదు.
తిరుపతికి 7 కి . మీ దూరంలో మంగళం అన్న ఊరు ఉంది అక్కడ మేము స్థలం మాత్రం కొనుక్కున్నాం.
ఆ స్థలం చుట్టు పక్కల ఇళ్ళు ఏమీ లేవు, అంతా ముళ్ల కంపలు, పాములు బాగా తిరుగుతుండేవి.
ఈ లోపు నాకో కల వచ్చింది ఆ కలలో నాకు వేంకేటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు కనపడ్డారు, ”ఏమిటి ఇలా వచ్చారు” అని నేను అన్నాను,
”నువ్వేదో ఇల్లు అంటున్నావుగా చూద్దామని అన్నారు”, ”ఏమి ఇల్లు మేము కొనకుండా కేవలం చూస్తున్నామన్న పేరు పడిపోతుంది అన్నాను,
”అలా కాదు మీరు మళ్ళీ సంవత్సరం కల్లా సొంత ఇంట్లో ఉంటారు” అని అన్నారు.
”ఇప్పటి దాకా ఏమీ లేదు, సంవత్సరం కల్లా మేము సొంత ఇంట్లో ఎలా ఉంటాము?” అని అడిగాను, ”ఏం మా మీద నమ్మకం లేదా” అన్నారు.
”మిమ్మల్ని నేను వదలను, కానీ ఇల్లు సంగతి తేలకపోతే మిమ్మల్ని నేను కన్నెత్తి కూడా చూడను” అన్నాను, ”సరే” అన్నారు.
”మా ఆయన తోటి చెప్తాను” అని అంటుంటే, ”సరే చెప్పు” అన్నారు. నాకు మెలకువ వచ్చాక మా వారికి కల గురించి చెప్పాను.
అప్పుడాయన అన్నారు, నాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు మనకి ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇవ్వరు. అయినా ఆ అడవిలో ఇల్లు ఎలా కడతాం? చాలా కష్టం అన్నారు మా వారు.
”నాకు అదంతా తెలియదు మనం ఇల్లు కడతాము అని వేంకేటేశ్వర స్వామి చెప్పారు” అని అన్నాను.
వెంటనే మా వారు ”నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు, నేను మాత్రం నీతో పాటు అన్ని ఆఫీసులకి తిరగను” అన్నారు.
అక్కర్లేదు ”మీరు ఒక సంతకం పెట్టండి చాలు” అన్నాను, ”దానికైతే సరే” అన్నారు.
కాలేజీకి వెళ్ళి నేనే లోన్ కాగితాలు అడిగి ఇప్పించుకుని మా వారి చేత సంతకం పెట్టించుకుని, అక్కడ ఆ కాగితాలు ఏ డిపార్టుమెంట్ కి ఎప్పుడు తీసుకెళ్లమంటే అక్కడికి నేనే తీసుకెళతాను అన్నాను.
”అబ్బే మీరు ఎందుకమ్మా! అంత రిస్క్ తీసుకోవడం మీరు ఇంటికి వెళ్ళిపోండి పోస్ట్ లో మీకు అందుతాయి” అని అన్నారు.
”అలా కాదు మా వారికి కళ్ళు కనపడవు, ఆడదాన్ని నేను ఒక్కదాన్నే తిరగాలి మాకంత వ్యవధి లేదు, అందుచేత మీరు కాగితాలు ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలో చెపితే నేను వచ్చి ఇవి తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చేస్తాను” అన్నాను.
ఏమనుకున్నారో ఏమో 2 రోజుల తర్వాత రామ్మా! అన్నారు, నేను అలాగే 2 రోజుల తర్వాత వెళ్ళాను, కాలేజీలో కాగితాలు నా చేతికి ఇచ్చి ఫలానా డిపార్టమెంట్ లో ఆ కాగితాలు ఇచ్చేయమన్నారు.
నేను తీసుకువెళ్ళి వారు చెప్పిన చోట కాగితాలు ఇచ్చాను. వారు అవి పరిశీలించి ”మీరు ఎందుకమ్మా వచ్చారు అవి పోస్ట్ లో కూడా వచ్చేవి కదా అని మీరు వెళ్ళిపోండి పోస్ట్ లో పంపుతాము” అని అన్నారు.
”లేదండి మాకు లోన్ చాలా అర్జెంటు నేను ఒక్కదాన్నే తిరగాలి ఎక్కడికి వచ్చి కాగితాలు తీసుకువెళ్ళమంటారో చెపితే అక్కడికి వచ్చి తీసుకువెళతాను” అని అన్నాను.
వెంటనే వారు మరో రోజు ఎప్పుడో రామ్మా! అని చెప్పారు, నేను ఆ రోజు వెళ్ళి వారు ఇచ్చిన కాగితాలు తీసుకువెళ్ళి బ్యాంకు లో ఇచ్చాను.
బ్యాంకు వాళ్ళు 50, 000 రూపాయలు లోన్ ఇచ్చారు. పని మొదలు పెట్టారు బేస్మెంట్ అయిపోయింది.
మరో లోన్ కోసం అప్లికేషన్ పెట్టాము అప్పుడు ఆఫీసర్ చూడడానికి వచ్చాడు బేస్మెంట్ వేసాక రెండో లోన్ రాదు అట, అదే మాట ఆయన చెప్పాడు,
బేస్మెంట్ ఏమి లేదు ముగ్గు మాత్రం వేశారని రాసేయమన్నాము, అలా రాస్తే తనకి చాలా ప్రమాదమన్నాడు.
మీ మనసు మంచిదైతే మీకు భగవంతుడు తోడుగా ఉంటాడు అని అన్నాను. మరి ఆయన ఏమనుకున్నాడో ఏమో గాని నేను చెప్పినట్లుగానే రాసాడు.
మరల కొద్దీ రోజులలో 1, 50, 000 లోన్ వచ్చింది. చాలా తక్కువ వ్యవధిలోనే ఇల్లు పూర్తి అయింది. మేము ఏడాదికి ఇంకా మూడు మాసాల ముందే గృహప్రవేశం కూడా అయ్యాము.
బాబా మరియు వెంకన్న దయతో మేము ఏదైతే స్థలం కొనుక్కున్నామో అందులోనే ఇల్లు కట్టుకున్నాము.
కానీ ఇంటి చుట్టూ ఎప్పుడు పాములు తిరుగుతూ ఉండేవి. పిల్లలు నేను అయితే పర్వాలేదు కనిపిస్తాయి కాబట్టి తప్పించుకుంటాం, కాని మా వారికి కనపడదు కాబట్టి ప్రమాదం.
అవి ఇంట్లో కి కూడా వస్తూ ఉండేవి, అయినా మేము ధైర్యంగా ఉండేవాళ్ళం.
ఆ పక్కనే ఎవరికో నాగ దేవత వంటి పైకి వస్తుంది అంటే ఆవిడ దగ్గరికి అప్పటికే పెళ్ళిడు వచ్చిన మా పెద్ద పాప పెళ్ళి ఎప్పడు అవుతుంది ? అని,
మా చిన్న పాపకి సరిగ్గా చదువు రావడం లేదు దాని గురించి ప్రశ్న అడగాలి అనుకుని వెళ్ళాను,
తీర ఆవిడ ముందుకు వెళ్ళాక మా ఇంటి దగ్గర చుట్టు పక్కల పాములు అందులోను నాగు పాములు కూడా ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయి.
మా వారికి కళ్ళు కూడా కనిపించవు ఆ పాముల వల్ల మా వారికి ఏదైనా అపాయం ఏర్పడితే ఏమి చేయాలి అని అడిగాను.
ఆవిడ వెంటనే ఇంట్లో లోపల ఒకటి అనుకోని ఇక్కడికి వచ్చి మరొకటి అడుగుతావేంటి?” అని అడిగింది.
”అవుననుకో అమ్మా! పెద్ద పాప పెళ్ళి, చిన్న పాప చదువు గురించే అడుగుదామనే వచ్చాను, కానీ ఇది కూడా నా మనసులో ఉంది నన్నేం చేయమంటావు ” అన్నాను.
అప్పుడామె ”ఏమీ అవ్వదు మేము ఉన్నది దేనికి? మేము చూసుకుంటాం కదా దీని గురించి నువ్వేం చింతపడకు” అంది.
ఆ తరువాత మా పెద్ద అమ్మాయికి ఒక సంబంధం కుదిరింది, ఆ సంబంధం విషయం మా ఆడపడుచుకి చెప్పి ఆవిడని పెళ్ళి మాటలకు చెన్నై నుండి రమ్మని అన్నాము, ఆవిడ వచ్చింది,
మాటలు అయిపోయాయి. తిరుపతి వచ్చాక ఆమెకు ఒంట్లో బావుండక పోవడం మేము ఆవిడని కార్ లో తీసుకువెళ్ళి చెన్నైలో దింపాము. అప్పటికి మా పెద్ద అమ్మాయి చెన్నైలో జాబు చేస్తోంది.
ఆవిడను దింపేసి మరునాడు బయలుదేరి వచ్చే ముందు మా అమ్మాయి పెళ్ళి కాబట్టి అక్కడ ఉద్యోగం మానేయాల్సివచ్చింది, మేము వస్తున్న కార్ లోనే తన సామానంతా వేసేసింది.
ఇంకా చెన్నై దాటను కూడా లేదు కార్ ను ఎదురుగ ఒక లారీ వచ్చి గుద్దేసింది మా వారు ముందు సీట్ లో కూర్చున్నారు కారు కి ముందు అద్దం పగిలిపోయి మా వారి మొహం మీద పడ్డాయి.
ముక్కు లోకి గాజు ముక్కలు బాగా జొరబడిపోయాయి, రక్తం బాగా కారిపోతుంది. పోలీస్ వాళ్ళు వచ్చారు కంప్లైంట్ రాసిమ్మన్నారు,
అప్పుడు నేను అన్నాను మాది ఈ ఊరు కాదు మళ్ళీ మళ్ళీ అక్కడ నుండి పిలిస్తే మేము రాలేము కేసు కూడా ఏమీ వద్దు అంటూ హాస్పిటల్ కి వెళ్ళాము మా వారికి ముక్కు అంతా క్లీన్ చేసారు.
హాస్పిటల్ నుండి తిరిగి మా ఆడపడుచు గారి ఇంటికి చేరుకున్నాము రాత్రి అక్కడ ఉండి మరుసటి రోజు తిరుపతి చేరుకున్నాము.
అప్పుడు మా వారు ”ఎప్పుడు బాబా అంటావు, ఏం బాబా నో ఏమిటో ఎంత ఆపద వచ్చి పడిందో చూడు” అన్నారు.
దానికి ”నేను ఆయన మనలని రక్షించాడు కాబట్టే ఈ మాత్రం దెబ్బలతో బయట పడ్డాము లేకుంటే ఆ కార్ చూస్తే తెలుస్తుంది ఆ కార్ లో ప్రయాణం చేసిన వారు పోయారా ! అని అడుగుతున్నారు, బ్రతికి ఉన్నామంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు” అన్నాను.
”అవునులే అంతా బాబా దయేలే లేకుంటే ఏమై పోయేవాళ్ళమో” అన్నారు మా వారు.
The above message has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- సొంత ఇంటి కలను, కోరిన వంద రోజులలో సాకారం చేసిన బాబా వారు….
- బాబా వారి దయతో వారం లోగ మా ఇల్లు అమ్ముడయిపోయి, మా పెద్ద పాప పెళ్లి చేయగలిగాము.
- మా కొత్త ఇల్లు అంత బాబా నామమయం
- ఓ తల్లి, తన బిడ్డకు తినిపించినంత ప్రేమగా భాగోజీకి అందించి బాబా తినిపించారు.
- నాన్నకి ప్రాణభిక్ష పెట్టిన బాబా ……!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments