Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ద్వారకామాయికి చేరుకున్నారంతా.‘‘రా’’ అన్నారు బాబా.
ద్వారకామాయిలో అడుగు పెట్టేందుకు భయపడ్డాడు భాగోజీ. రానన్నట్టుగా ముడుచుకున్నాడు.‘‘అన్ని జబ్బులూ పోతాయి. రా’’ అన్నారు బాబా. భాగోజీని తోడుకుని లోనికి అడుగుపెట్టారు.
తలకొట్టుకున్నాడు శ్యామా. ‘ద్వారకామాయి భ్రష్టుపట్టిపోయింది.’ అనుకున్నాడు.
‘‘ఆకలిగా ఉంది కదూ?’’ అడిగారు బాబా. అవును అన్నట్టుగా తలూపాడు భాగోజీ. సన్నగా నవ్వి, ముందుకు కదిలారు బాబా.
మట్టి మూకుడిని అందుకుని చూశారు. అందులో చీమలు పట్టి రెండు రొట్టెలు ఉన్నాయి.‘‘మీరు తిన్నది చాలు, వెళ్ళిరండి! మీలాగే ఆకలితో అలమటిస్తున్నాడు. అతనికి ఇవి పెడదాం.’’ అన్నారు బాబా.
‘సరే’నన్నట్టుగా చీమలు గబగబా భిక్షాపాత్రను వదిలి వెళ్ళిపోయాయి. రొట్టెల మీద ఇప్పుడు ఒక్క చీమ కూడా లేదు.
‘‘తిను’’ భాగోజీకి రొట్టెల్ని అందించారు బాబా. మొండి చేతుల్తో రొట్టెల్ని పట్టుకోలేకపోయాడు భాగోజీ. ఆత్రపడడంతో వాటిని కింద జార విడుచుకున్నాడు.
‘‘నేను తినిపిస్తాను ఉండు.’’ అని కింద పడ్డ రొట్టెల్ని తీసుకుని, వాటిని ఓ తల్లి, తన బిడ్డకు తినిపించినంత ప్రేమగా భాగోజీకి అందించి బాబా తినిపించారు.
‘అయ్యయ్యో’ అంటూ అసహ్యించుకున్నాడు శ్యామా.‘‘నీరు తాగు’’ అన్నారు బాబా. నీరు తాగించారు భాగోజీకి.
‘‘ఇప్పుడు చెప్పు, ఎందుకు చనిపోవాలనుకున్నావు?’’ అడిగారు బాబా. భాగోజీ చెంప మీద కారుతున్న రసిని చేత్తో తుడిచారు.‘‘బాబా’’ అంటూ భయపడుతూ వెనక్కి జరిగాడు భాగోజీ.
‘‘ఇల్లాలూ, పిల్లలూ, ఊరు ఊరంతా నన్ను అసహ్యించుకుంటుంటే భరించగలిగాను. నీ ప్రేమని మాత్రం భరించలేకపోతున్నాను. వద్దు బాబా, వద్దు. పదే పదే నన్ను నువ్వు ముట్టుకోవద్దు.’’ అన్నాడు భాగోజీ.
నవ్వుతూ చూశారు బాబా.‘‘నాకు తెలిసి, నేనీ జన్మలో ఏ తప్పూ చెయ్యలేదు బాబా! గత జన్మలో ఏ పాపం చేశానో ఏమో, ఈ జన్మలో ఇలా కుష్ఠువాణ్ణయి, అందరికీ కష్టాన్ని కలిగిస్తున్నాను. అందుకే కడతేరిపోవాలనుకున్నాను. అమ్మలా ఆకలి తీర్చావు, దాహం తీర్చావు, చాలు. వెళ్ళొస్తాను బాబా, శలవు.’’ అన్నాడు భాగోజీ.
వెళ్ళేందుకు లేచి నిల్చున్నాడు.‘హమ్మయ్య! వెళ్ళిపోతున్నాడు. శని విరగడయింది’ అనుకున్నాడు శ్యామా.‘‘వెళ్ళు వెళ్ళు’’ అన్నాడు భాగోజీతో.
‘‘ఎక్కడికి వెళ్ళేది, భాగోజీ ఇక్కడే ఉంటాడు. నాతోనే ఉంటాడు. ఇల్లాలూ, పిల్లలూ, ఊరు ఊరంతా భాగోజీని అభిమానించే వరకు ఇక్కడే ఉంటాడు.’’ అన్నారు బాబా. భాగోజీని ధుని దగ్గరగా నడిపించుకుని వెళ్ళారు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఊది మహత్మ్యం(భాగోజీకి బాబావారి రక్షణ)
- అనుక్షణం నన్ను అనుమానించే నిన్ను ప్రతి క్షణం ప్రేమించాలనిపిస్తుంది. ఏం చెయ్యను
- నిస్సహాయురాలైన తన బిడ్డకు స్థిరనివాసం ఏర్పరచి, ప్రాణభిక్ష పెట్టిన బాబా!
- ఓం శేష సాయినే నమః …..సాయి@366 సెప్టెంబర్ 24…Audio
- బాధే సౌఖ్యం…..సాయి@366 అక్టోబర్ 31….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ఓ తల్లి, తన బిడ్డకు తినిపించినంత ప్రేమగా భాగోజీకి అందించి బాబా తినిపించారు.”
సాయినాథుని ప్రణతి
January 9, 2017 at 1:02 amచాలా బాగుంది .తల్లి లంటి బాబా ప్రేమకు ఎవరు సాఠి లేరు .ఈ లీల చదివి చాలా ఆనందం కలిగింది మనస్సు ఎ బాదవున తల్లి లాంటి ఆయన ఓదర్పుకు నేను ,నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఈ లీలలు మాకు ఆందించి నందుకు సాయిలీలాస్ బ్రుందానికి హృదయ పుర్వక కృతజ్ఞతలు.
kishore Babu
January 9, 2017 at 7:18 pmThank you Sainathuni Pranathi…if you are ready to work with our team..you are always welcome. your comments are very nice. We are expecting more comments from you…Sai Baba…Sai Baba.