Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఆ స్వరం బాబా దేనా?
నా పేరు సురేందర్. నేను దుబాయిలో ఉద్యోగం చేస్తున్నాను. నేను సాయిబాబాకు సామాన్య భక్తుడిని. బాబా దయ వల్ల నాకు దుబాయిలో ఏవిధంగా ఉద్యోగం వచ్చిందో వివరిస్తాను. భారత దేశం లోని ఒక ఏజెంటు ద్వారా నేను దుబాయిలో జనవరి 2013 వ. సంవత్సరంలో ఎలెక్ట్రికల్ ఇంజనీరుగా చేరాను. ఏజెంటుకు వీసా, ఫ్లైట్ టిక్కెట్ల కోసం లక్ష రూపాయలిచ్చాను. మేము స్థితిమంతులం కాదు. మధ్య తరగతి కన్నా తక్కువ. ఏజెంటుకు డబ్బివ్వడం కోసం మా నాన్నగారు అప్పు చేసి తెచ్చారు. నేను చేరిన కంపెనీలో ఉద్యోగులకి జీతాలు సరిగా ఇవ్వరని ఉద్యోగంలో చేరిన తరువాత తెలిసింది. జీతాలు 45 రోజులకొకసారి, ఒక్కొక్కసారి రెండు నెలలకి ఇచ్చేవారు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులంతా వేరు వేరు దేశాల నుంచి వచ్చినవారు. వారెవరూ నాతో స్నేహంగా ఉండేవారు కాదు. నాతో మాట్లాడేవారు కూడా కాదు. దాంతో నేను నిస్సహాయునిగా ఆ కంపెనీలో వంటరివాడినయిపోయాను. నాకు మరొక ఉద్యోగం ఇప్పించమని ప్రతి రోజు సాయిని ప్రార్ధిస్తూ ఉండేవాడిని. ఈ బాధలు పడలేక ఆఖరికి 2014 సం. జనవరిలో ఉద్యోగం వదిలేసి భారత దేశానికి తిరిగి వచ్చేశాను. చెన్నైలోనే ఉద్యోగం వెతుక్కోసాగాను. ప్రతి రెండు రోజులకి మైలాపూర్ లో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళి నాకు ఉద్యోగం ఇప్పించమని బాబాని ప్రార్ధిస్తూ ఉండేవాడిని.
ప్రతిరోజు శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణ చేయడం మొదలు పెట్టాను. కుటుంబానికి నా జీతమే ఆధారం. నాకు ఆదాయం లేకపోతే నా కుటుంబమంతా ఆర్ధిక సమస్యలతో బాధ పడాల్సిందే. నేను ఎడ్యుకేషన్ లోను తీసుకున్న బ్యాంకు నుంచి వడ్డీ కట్టమని హెచ్చరిక నోటీసు వచ్చింది. 2014 వ.సం.మార్చిలో చెన్నైలోనే సేల్స్ ఇంజనీరుగా ఉద్యోగ అవకాశం వచ్చింది. జీతం నెలకి రూ.8,000/-. కాని ఒక ఇంజనీరుగా సేల్స్ పెర్సన్ గా ఉద్యోగం చేయడం నాకు సంతోషమనిపించలేదు. అందు చేత నిర్ణయం సాయిబాబాకే వదిలేయదల్చుకున్నాను. ఒక చీటీ మీద ‘చేరడానికి ఒప్పుకో’ అని రెండవ దాని మీద ‘చేరవద్దు’ అని రాసి సాయిబాబా ఫొటో దగ్గర ఉంచి ఒక చీటీ తీశాను. దానిలో ‘చేరవద్దు’ అని వచ్చింది. అందువల్ల వచ్చిన ఉద్యోగావకాశాన్నితిరస్కరించాను. ఒక వైపు కుటుంబంలో ఆర్ధిక సమస్యలు. నా తల్లిదండ్రులు హాస్పిటల్ ఖర్చులకు మా బంధువుల దగ్గర అప్పులు చేయసాగారు.
2014 సం.ఏప్రిల్ నెలలో ఒక రోజు బస్సులో వెడుతున్నాను. బస్సులో సాయిబాబా ఫొటో ఉంది. అప్పుడాయనని “దేవా, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది. నా కుటుంబం మీద దయ చూపు” అని ప్రార్ధించాను. హటాత్తుగా నాకు “మే” అని వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూశాను. ఆ మాట ఎవరన్నారా అని. బస్సంతా జనంతో చాలా రద్దీగా ఉంది. రెండు రోజుల తరువాత దుబాయి నుండి నా స్నేహితుడు ఒకతను ఫోన్ చేసి ఇప్పుడు దుబాయిలో జాబ్ మార్కెట్ చాలా బాగుంది, దుబాయిలో ఉద్యోగ ప్రయత్నం చేయమని సలహా ఇచ్చాడు. కాని నాదగ్గర టూరిస్టు విసాకి కావలసినంత డబ్బు లేదు. మా నాన్నగారు దుబాయి వెళ్ళి ప్రయత్నం చేయమని ప్రోత్సహించారు. నా విసా కోసం ఆయన తన బైక్ ని రూ.50,000/- కి అమ్మేశారు. మే 23 నుండి జూన్ 23 వరకు ఒక నెలకి టూరిస్టు వీసా తీసుకున్నాను. ఈ నెల రోజులలోనే నేను ఉద్యోగం వెతుక్కోవలసి ఉంటుంది. మొట్టమొదట వారం రోజులు దాదాపు 50 కంపెనీలకు నా రెజ్యూమ్ పంపించాను. కాని ఏ ఒక్కరి నుంచి పిలుపు రాలేదు. ఇక నాదగ్గిర రాబోయే 5 రోజులకి సరిపడ మాత్రమే డబ్బు మిగిలింది. ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితి.
మే 30 వ.తారీకున బుర్ దుబాయిలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ మధ్యాహ్న ఆరతిలో పాల్గొన్నాను. ఆరతి జరుగుతుండగా ఒక భారతీయ కంపెనీ నుంచి , మరుసటి రోజు (మే 31) ఇంటర్వ్యూ ఉందని, వచ్చి ప్రాజెక్ట్ మేనేజరును కలుసుకోమని ఫోన్ వచ్చింది. మరునాడు ఇంటర్వ్యూకి వెళ్ళాను. ప్రాజెక్టు మేనేజర్ గదిలోకి వెళ్ళాను. మేనేజరు భారతీయుడే. ఆయన కూర్చున్న టేబుల్ పైన పెద్ద సైజు సాయిబాబా ఫొటో దర్శనమిచ్చింది. నాకు ఎంతో సంతోషం కలిగింది. అపుడు నాకు సాయి చెప్పిన వచనాలు గుర్తుకు వచ్చాయి. “నువ్వెక్కడికి వెళ్ళినా నీవెంట నేనుంటాను. ప్రవేశించడానికి నాకు ద్వారాలు అవసరం లేదు”.
అడిగిన ప్రశ్నలకు నేను సరిగా సమాధానాలు చెప్పకపోయినా అతను నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఆ రోజు మే 31. నెలకు నాజీతం 5,000/- దిరామ్స్. భారతీయ కరెన్సీ ప్రకారం నెలకు రూ.80,000/- రూపాయలు. ఇప్పుడు నాకర్ధమయింది. ఆ రోజు బస్సులో ‘మే’ అని వినబడిన ఆ స్వరం సాయిబాబాదే అని. రూ.8,000/- జీతం వచ్చే ఉద్యోగంలో చేరవద్దని ఎందుకని అన్నారో కూడా అర్ధమయింది. దాని కన్నా 10 రెట్లు జీతం లభించే ఉద్యోగాన్ని ఇప్పించారు. ఇక్కడ నేను ఉద్యోగ నియామక పత్రం (అప్పాయింట్ మెంట్ లెటర్) తీసుకుంటున్నపుడె అక్కడ భారత దేశంలో మా అమ్మగారు సాయిబాబా పటం ముందు శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేస్తుండగా, సాయిబాబా పటం నుంచి ఒక పువ్వు రాలిపడందట.
సాయి భక్తులారా సాయి మీద విశ్వాసాన్ని నిలుపుకుని ఓర్పు వహించండి. ఆయన మీ ప్రార్ధనలన్నిటికీ సమాధానాలిస్తారని నేను మీకు హామీ ఇస్తున్నాను.
అందరికీ సాయి దీవెనలు అందించుగాక.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా ఆశీర్వాదంతో మంచి ఉద్యోగం లభించింది
- నా కంట బడటానికి నా జీవితం మారిపోటానికి బాబాయే చేసిన మిరాకిల్ ఆ ప్రకటన ఆ పేపర్ లో పడటం.–Audio
- సద్గురు కృప.
- ఆ సాయి నాధుడే కదిలి వచ్చాడు ఒక కొత్త డాక్టర్ రూపం లో
- ఆ రోజు రాత్రి కలలో బాబా కన్పించి నాకు సెకండ్ హ్యండ్ మైకు సెట్టు ఒద్దు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ఆ స్వరం బాబా దేనా?”
Sreenivas
January 3, 2017 at 4:49 amసాయి బాబా… సాయి బాబా… సాయి బాబా.