శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (6) కర్మ సిధ్ధాంతం (2వ.భాగమ్)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (6) కర్మ సిధ్ధాంతం (2వ.భాగమ్)

ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్

తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు

సాయిబాబా కూడా ఇలా గురించి చెప్పారు.  “దాహంతో ఉన్నవారికి మంచినీరు, ఆకలితో ఉన్నవారికి ఆహారము, బట్టలు లేనివారికి బట్టలు, అవసరమయిన వారికి విశ్రాంతికోసం నీ ఇంటి వసారా ఇచ్చినచో భగవంతుడు తప్పక సంతుష్టి చెందుతాడు”.     అధ్యాయం – 14

కాని, మంచి పనులు చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తు పెట్టుకోమని బాబా హెచ్చరించారు.  ఇతరులు చేస్తున్నారు కదా అని ప్రత్యేకంగా అదే మంచి పనిని చేయవద్దు.  ఇతరులు ఒక మంచి పని చేస్తున్నారంటే వారి శారీరక శక్తి, ఆర్ధిక, ఆధ్యాత్మిక సామర్ధ్యాలని పరిగణలోకి తీసుకోవాలి.  45వ.అధ్యాయంలో దీని గురించే వివరింపబడింది.  బాబా శయనించడానికి పైకప్పుకు కొయ్యబల్ల ఉన్నట్లే, మహల్సాపతికి కూడా అటువంటి కొయ్యబల్లను ఏర్పాటు చేయిస్తానని కాకా సాహెబ్ దీక్షిత్ అన్నపుడు బాబా దానికి నిరాకరించారు.

యోగులతో సాంగత్యానికి ప్రయత్నించు:

అదేవిధంగా అనేకమంది యోగుల వద్ద నుంచి సలహాలు తీసుకోవడానికి అన్ని ప్రదేశాలకి తిరుగుతూ ఉంటారు కొంతమంది.  అలాంటి వారి కోసం బాబా ఏమి చెప్పారో చూడండి – “ఈప్రపంచములో అనేక మంది యోగులు గలరు.  కాని మన గురువు అసలైన తండ్రి. (అసలయిన గురువు) ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును.  కాని మన గురువుయొక్క పలుకులను మరువరాదు.  మనకేది మంచిదో ఆయనకే తెలుసు”.    అధ్యాయం – 45

నాస్తికులకు, అధార్మికులకు, దుష్టులకు దూరంగా ఉండమని, వారితో సహవాసం చేయవద్దని బాబా తన భక్తులకు బోధించారు.  యోగులతో సాంగత్యానికి ప్రయత్నించమన్నారు.  “యోగులతో సాంగత్యమంటే అది చాలా గొప్పది.  మనస్ఫూర్తిగా వారి శరణు జొచ్చితే (యోగులు) వారు నిన్ను భవసాగరాన్ని సురక్షితంగా దాటిస్తారు.  ఈ కారణం కోసమే ఈప్రపంచంలో యోగులు తమంతతాముగా ప్రకటితమయ్యారు.  ప్రపంచంలోని అందరి పాపాలను ప్రక్షాళనం చేసే పవిత్రమయిన గంగా గోదావరిలాంటి నదులు కూడా యోగులు వచ్చి తమ నీటిలో స్నానమాచరించి తమనెప్పుడు పావనం చేస్తారా అని ఎదురు చూస్తాయి”.   అధ్యాయం -10

యోగుల యొక్క కధలు, చరిత్రలు విన్నా, వారు రాసిన పుస్తకాలు చదివినా ఒక విధంగా వారితో సాంగత్యము చేసినట్లుగానే భావించవచ్చు.

చెడు పనులకు దూరంగా ఉండాలి :

ఋణము, శతృత్వము, హత్య చేసిన పాపము, ఇవన్నీ కూడా, అవి చేసిన వ్యక్తిని ప్రపంచమంతమయేవరకూ వెంటాడుతూనే ఉంటాయని సాయిబాబా పలుమార్లు చెపుతూ ఉండేవారు.  ఎవరు చేసిన ఖర్మ వారనుభవించవలసినదే.  దానినుండి ఎవరూ తప్పించుకోలేరు.

ఋణమంటే, డబ్బు, ఆహారము, మరే సేవైనా సరే  ఏమయినా కావచ్చు. ఈజన్మలో కాకపోతే మరు జన్మలోనయినా సరే ఋణం తీర్చవలసిందే.  దర్వీషులు జబ్బు పడిన పులిని సాయిబాబా దగ్గరకు తీసుకొని  వచ్చినపుడు అది సాయి పాదాలచెంత మరణించింది.  అధ్యాయం – 31

(ఇంకా ఉంది)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles