Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా భక్తులు విశ్వనాథ్ భవరాజు గారి రెండవ అనుభవం:
ఈ సంఘటన 15 సంవత్సరాల క్రితం నా చిన్నతనంలో జరిగింది, నేను మూడవ తరగతి చదువుతున్నప్పుడు, నా తల్లిదండ్రులతో కలిసి మొదటి సారి షిరిడికి వెళ్ళాను. అది పండుగ రోజు కావడం వలన భిన్న ప్రదేశాల నుండి వచ్చిన భక్తులతో సాయిబాబా సమాధి మందిరం నిండిపోయింది. ఆ సమయంలో నియంత్రిత యంత్రాంగం ఇప్పుడు ఉన్నంతగా లేదు. క్యూ లైన్లు సరిగ్గా ఏర్పాటు చేయబడలేవు.
భక్తులు మందిరంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెల్లాచెదురుగా ఉన్నారు. భక్తులు ఎవరు కూడా త్వరగా దర్శనం చేసుకొని బయటకు వెళ్ళట్లేదు. అలా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అది వారి ప్రేమ మరియు భక్తి. అందులో పూర్తిగా వారి తప్పు ఏమీ లేదు.
బాబా వారి విగ్రహం లేదా సమాధి పైన ఉన్న పుష్పం, పుష్ప గుచ్చం లేదా పువ్వుల మాల పొందాలని భక్తులు అనుకుంటూ ఉంటారు. అక్కడి పూజారులు పూల దండలు మరియు పువ్వులు గాలిలోకి వీసురుతున్నారు. ఆ పువ్వులు పొందిన వారు బాబా వారి ఆశీర్వాదం పొందినట్లు భావించి చాలా సంతోషపడుతూ ఉన్నారు.
ఆ సమయంలో ఒక పూజారి, శ్రీ సాయి బాబా యొక్క విగ్రహం నుండి ఒక పూల మాల తీసి భక్తుల గుంపు వైపు విసిరారు. అది వచ్చి సరిగ్గా నా మెడ లో పడింది. అక్కడ నాకు ముందు చాలా లావుగా పొడవైన కొందరు భక్తులు నిలబడి ఉన్నారు. ఆశ్చర్యకరంగా వారందరిని దాటి ఆ పూలదండ నా మెడలో పడింది.
అది చూసిన వారు వచ్చి నాకు ముద్దు పెట్టి ఆశీర్వదించి, “ఈ పవిత్రమైన రోజున బాబా చేత మీ అబ్బాయి ఆశీర్వదింపబడ్డాడని” నా తల్లిదండ్రులకు చెప్పారు.
అది నా మీద పడిన క్షణం, నేను బాబాతో చాలా అనుసంధానించిబడ్డాను, నేను ఆయనకు చెందినవాడనని భావించాను. అయన నా సంరక్షకుడు మరియు నేను ఆయనను ఆరాధించాలి అని అనుకున్నాను.
ఈ రోజుకి కూడా నేను ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా శరీరమంతా ఒక రకమైన పులకరింతతో మళ్ళీ బాబా అశేర్వాడం పొందిన అనుభూతి చెందుతూ ఉంటాను.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- పుట్టినరోజున బాబా ఆశీర్వాదం
- ప్రపంచంలోని జనులందరు హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశము.
- బాబా పటములో పాదముల నుండి గంగా, యమునా జలములు వచ్చుట–Audio
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments