పుట్టినరోజున బాబా ఆశీర్వాదం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

చెన్నైనుండి శ్రీమతి కృష్ణవేణి గారు పంపించిన మరొక లీల ప్రచురిస్తున్నాను.  చదవండి.  బాబాకు పంచభూతాలపై ఆధిపత్యం ఉన్నదన్న విషయం మనకి అవగతమవుతుంది.  పాపకి పుట్టినరోజునాడు బాబా ఆశీర్వాదం లభించాలనుకున్న ఆమె కోరికను బాబా ఏవిధంగా తీర్చారో చూడండి.

అక్టోబరు 30వ.తారీకు మా పెద్దపాప పుట్టినరోజు.  ఇపుడు మాపెద్దపాపకి 5 సంవత్సరాలు.  మా పెద్ద పాప ప్రతి పుట్టిన రోజు నాడు మైలాపూర్ లో ఉన్న బాబా గుడికి వెడుతూ ఉంటాము.  మా పెద్దపాప మొదటి పుట్టినరోజు నాడు మైలాపూర్ బాబా గుడికి వెళ్ళి బాబా ఆశీర్వాదములు తీసుకోవాలనుకున్నాము. 

మొదటి పుట్టిన రోజు కాబట్టి బంధువులందరూ ఇంటిలో ఉంటారు, అందుచేత గుడికి వెళ్ళద్దు అన్నారు మా అత్తగారు.  కాని నాకు మాత్రం బాబా గారి ఆశీస్సులు తీసుకోకుండా ఏమి చేసినా వ్యర్ధం అనిపించింది.  అదుచేత నేను మొండిగా గుడికి బయలుదేరాను.  మా అత్తగారు నా నిర్ణయాన్ని కాదనలేకపోయారు.  ఆవిడ మాటని పాటించకుండా వెడుతున్నందుకు నాకు కూడా బాధగానే ఉన్నాబయలుదేరాను.  ఆ గుడిలో ప్రత్యేకత ఏమిటంటే మనము తెచ్చిన పువ్వులు, శాలువా మన చేతులతో స్వయంగా బాబా మెడలో వేసి అలంకరించవచ్చు. ఇక పుట్టిన రోజంటే విడిగా బాబావారి ప్రక్కనే నిలబెట్టి అర్చన చేసి బాబా మెడలోని దండను తీసి మన మెడలో వేస్తారు.  ఆ విధంగా మా పాపను కూడా ఆశీర్వదిస్తారనుకున్నాను.  మేము అర్చన సామాగ్రి, ఒక తామర పువ్వు తీసుకుని అందరిలాగానే వరుసలో నుంచున్నాము. మా వంతు వచ్చిన తరువాత, ఈ రోజు మా పాప పుట్టిన రోజని చెప్పాము.  పూజారి గారు పాప పేరు మీద అర్చన చేశారు.  పూజారి గారు పాప మెడలో దండ వేద్దామని చూస్తే బాబా మెడలోదండ లేదు.  కేవలం పెద్ద దండ మాత్రమే ఉంది.  ఇక తామరపువ్వులు మాత్రమే ఉన్నాయి.  బాబా విగ్రహానికి  పీఠం వెనుక గోడమీద బాబావారి చిత్రపటం ఉంది.  ఆ సమయంలో బాబా విగ్రహంమెడలో దండ లేకపోవడం చేత బాబా చిత్రపటానికి ఉన్న ఒకే ఒ కదండను తీసి పూజారి గారు పాప మెడలో వేశారు.   నాకు చాలా సంతోషం కలిగింది.  ఎందుకంటే పూజారి గారు ఇవ్వదలచుకుంటే బాబా విగ్రహం పైన ఉన్న తామర పువ్వును ఇవ్వవచ్చు. కాని ఆయన బాబా చిత్రపటానికి దండ లేకపోయినా సరే అనుకుని,  ఉన్న ఒకే ఒక దండను పాప మెడలో వేశారు. ఇక్కడ బాబా గుడిలో ఆరతి కూడా ముందు ఈ బాబా చిత్రపటానికే చూపిస్తారు.  ఆ పటానికి ఉన్న దండనే పాప మెడలో వేశారు.  నాకు తెలిసి ఎవరికీ ఈవిధంగా వేయలేదు. వేరే ఎవరికీ దొరకనిఅదృష్టం మా పెద్ద పాపకు దక్కినందుకు చాలాసంతోషమనిపించింది.  ఆయన అనుగ్రహమే లేకపోతె ఇదంతాజరిగేదా?  మా అత్తగారు వద్దని చెప్పినా బాబా గుడికి వచ్చినందుకు బాబా మా పెద్ద పాపని ఈ విధంగా ఆశీర్వదించడం చాలు సంతోషం అనిపించింది నాకు.  ఈ సంఘటన అక్టోబరు 2011 వ.సంవత్సరంలో జరిగింది.  మా పెద్దపాప పేరు ప్రసన్న లక్ష్మి.

మాపాప 5వ.పుట్టినరోజు 30.10.2015.  ఆరోజు గుడికి ఎలాగయినా సరే వెళ్ళాలనిపించింది.  కాని బాగా వర్షం పడుతూఉంది.  చలిగాలి వల్ల ప్రొద్దుటే గుడికి వెళ్ళలేకపోయాము.  వర్షం తగ్గితే సాయంత్రం వెడదామనుకున్నాము.  చిన్న పాపకి బాగా జలుబు, దగ్గుగా ఉంది.  పైగా వర్షం కురుస్తూ ఉండటంతో సాయంత్రం కూడా గుడికి వెళ్ళలేమనుకున్నాము.  కాని మావారు చిన్న పాపని ఇంటి దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో చూపించి వెడదామన్నారు.  అందుచేత ఆస్పత్రికి బయలుదేరాము. అప్పుడు చిన్న చిన్నచినుకులు మాత్రమే పడుతున్నాయి. ఆస్పత్రిలో టోకెన్  సిస్టమ్ఉం ది.  అప్పటికే టోకెన్ లు అన్నీ ఇచ్చేశారు.  మాదే ఆఖరి టోకెన్.  ఇక ఆస్పత్రిలోనే ఆలశ్యమయేలా ఉంది గుడికి వెళ్ళలేము అనుకుంటున్నాను.  ఆశ్చర్యంగా అక్కడ టొకెన్స్ ఇచ్చే అమ్మాయి నన్ను చూసి లోపల వేరే వాళ్ళు ఉన్నారు వారు వెళ్ళిన తరువాత మీరు వెళ్ళండని వెంటనే నన్ను పంపింది.  అప్పటికి సాయంత్రం నాలుగయింది.  మా ఇంటి నుండి మైలాపూర్ గుడికి వెళ్ళాలంటే ఎటువంటి ట్రాఫిక్ లేకుండా, సిగ్నల్స్ వద్ద ఆలశ్యం లేకపోతే బండిమీద వెడితే గంట పడుతుంది.  ఆయితే ఆ రోజు మాకోసమే అన్నట్లుగా ఆస్పత్రి నుండి బయటకు వచ్చేటప్పటికి వర్షం ఆగిపోయింది. చాలా సంతోషంగా గుడికి బయలుదేరాము.  ఎక్కడా సిగ్నల్స్ దగ్గిర కూడా బండి ఆగలేదు.  మేము సిగ్నల్స్  దగ్గరకు వచ్చేటప్పటి గ్రీన్ సిగ్నలే ఉండి మేము సమయానికి గుడికి చేరుకున్నాము.  చేరగానే మా మామయ్యగారు ఇంటినుండి ఫోన్ చేశారు. “వర్షంలోతడిశారా” అని.  ఎందుకంటే మేము ఇంటి వద్ద నుండి బయలుదేరిన పది నిమిషాలలోనే  పెద్ద వర్షం పడిందట.  బాబాగారు మా కోసమేఆస్పత్రిలో ఆలశ్యమవకుండా చేసి తొందరగా పంపించారు.  మేము వర్షంలో తడవకుండా రక్షించారు.  ఇంటికి తిరిగి వచ్చిన రెండు నిమిషాలకు మళ్ళీ పెద్ద వాన.  మా పెద్ద పాప పుట్టిన రోజు నాడు బాబావారి ఆశీర్వాదం ఎటువంటి ఆటంకం లేకుండా పొందగలగటంమా అదృష్టం.  దీని ద్వారా ఆయనకు పంచభూతాలపై ఆధికారంఉందని మరొకసారి ఋజువయింది.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles