Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
నా మదిలోని కోర్కెను తీర్చిన బాబా
విచిత్రం ఏమిటంటే బాబా భక్తులకు చాలా విచిత్రంగా కలుగుతూ ఉంటాయి అనుభవాలు. మనసులో అనుకున్న మరుక్షణమే మన కోరికని ఆయన తీర్చే విధానం చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అ అనుభూతి జీవితాంతం మనకి పదే పదే మనసులోకి వచ్చి ఒక విధమైన ఆనందం కలుగుతుంది. ఆ విధమైన అనుభూతులను పొందిన ఒక సాయి భక్తురాలు చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణి గారు రెండు అనుభూతులు ఈ రోజు వాటిని ప్రచురిస్తున్నాను.
1. మేము చెన్నైలో మైలాపూర్ లో ఉన్న బాబా గుడికి వెడుతూ ఉంటాము. ఈ సంవత్సరం జనవరి ఒకటవ తారీకున కొత్త సంవత్సరం సందర్భంగా బాబా గుడికి వెళ్ళాము. కొత్త సంవత్సరం కాబట్టి గుడిలో చాలా రద్దీగా ఉంటుందని మా చిన్న పాపతో వరుసలో (లైన్ లో) నుంచోవడం చాలా కష్టమని భావించాము. బాబా గుడి బయట బాబాని అందరూ చూడటానికి వీలుగా పెద్ద తెరలతో సీ.సీ.టీ.వీ లు ఏర్పాటు చేశారు. ఆ విధంగానయినా బాబాని చూడవచ్చనే ఉద్దేశ్యంతో గుడికి సాయంత్రం బయలుదేరాము. గుడిలో మేము అనుకున్నంత రద్దీ లేదు గాని, వరుసలో నుంచుని బాబా దర్శనం చేసుకోవాలంటే చాలా మలుపులు ఉన్నాయి. ప్రతి మలుపు వద్ద చిన్న తెరలతో సీ.సీ టీవీ లు ఏర్పాటు చేశారు. గుడిలో రద్దీ తక్కువగానే ఉండటం వల్ల మేము వరుసలో నుంచున్నాము. అప్పటికి ఆరతి సమయం అవటంతో వరుసలో నుంచున్నవాళ్ళందరూ ఎక్కడున్నవాళ్ళు అక్కడే కూర్చున్నారు. కాని అనుకోకుండా మేమున్న వరుసలో మలుపు వద్ద ఉన్న సీ సీ టీవీ కి ఏదో సాంకేతిక లోపం వచ్చి ఆగిపోయింది. ఆరతి చూసే అదృష్టం లేక పోయిందని చాలా బాధపడ్డాను. కనీసం గుడిలోనయినా ఉన్నామని కాస్త ఆనందపడ్డాను. గుడిలో బాబాకి ఆరతి మొదలయింది. కర్పూరం వెలిగించే సమయం. ఇంతలో మా పెద్ద పాప ఏడవటం మొదలెట్టింది. వరుసలో ఉన్నవారికి ఇబ్బందిగా ఉంటుందని భావించి నేను లేచి నుంచున్నాను. మేమున్న తరువాతి వరుసలో మలుపు వద్ద సీ.సీ టీవి వుంది కాని స్థంభం అడ్డుగా ఉండటం వల్ల కనిపించటం లేదు. ఇంతలో ఎవరో బాబా ఆరతిని వీడియో తీయసాగారు. సరిగ్గా కర్పూరం వెలిగించే సమయానికి అది నేను చూడటం కోసమే అన్నట్లుగా ఆవీడియో లో బాబా ఆరతిని చూసే భాగ్యం కలిగింది. ఆరతిని వీక్షించడం నాకెంతో ఇష్టం. ఆవిధంగా బాబా వారు నాకు ఆరతిని చూసే అదృష్టాన్ని కలిగించారని సంతోషించాను.
2. నేను మా చిన్న పాప డెలివరీకి మా అమ్మగారింటికి ఒంగోలు వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు ప్రతి గురువారం మధ్యాహ్న ఆరతికి నేను, మాపాప వెళ్ళేవాళ్ళము. ఒకసారి ఆరతికి వెళ్ళినపుడు అక్కడ ఉన్న ఒకామె తన పాపను పూజారి గారికి ఇచ్చి బాబా ఒడిలో పడుకోబెట్టమని కోరింది. ఆయన పాపని బాబాగారి ఒడిలో పరుండబెట్టారు. అది చూసిన నాకు నేను కూడా మా చిన్న పాపని తీసుకుని వస్తే బాబా వారి ఒడిలో పెట్టించి ఉంటే బాబా గారి ఆశీర్వాదం పాపకు లభించేది కదా అనుకున్నాను. ఆ విధంగా భావిస్తున్నపుడు హటాత్తుగా నాకు ఆ పాప స్థానంలో నా చిన్నపాప కనిపించింది. మా చిన్న పాప పేరు శర్వాణీ సాయి. అప్పటికి మా చిన్న పాప వయసు మూడు నెలలు. ఆశ్చర్యం ఏమిటంటే, గుడిలో నాకు బాబా ఒడిలో నా చిన్నపాప ఏగౌను వేసుకొని కనిపించిందో, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అదే గౌనుతో ఉంది. అది చూడగానే నాకు ఆనందంతో కళ్ళంబట ఆనందాశ్రువులు కారాయి. బాబా నా చిన్న పాపను కూడా తీసుకుని వచ్చి నీఒడిలో పెట్టి ఉంటె నువ్వు ఆశీర్వదించి ఉండేవాడివి కదా అనుకున్న నా కోరికని ఈ విధంగా తీర్చి ఆశీర్వదించావా బాబా అని పదే పదే నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సొంత ఇంటి కోర్కెను తీర్చిన బాబా వారు.
- నవ గురువారం వ్రతం చేసుకోవాలి అని సంకల్పించిన భక్తురాలి కోర్కెను తీర్చిన బాబా వారు
- నేను రైల్వే లో జాబ్ చెయ్యాలి అనే అమ్మ కోర్కెను తీర్చిన బాబా వారు…..గోపాలకృష్ణ
- నా కోరికను తీర్చిన బాబా.
- నా మనసులోని కోరికను గురువు గారి ద్వారా బాబా తీర్చిన వైనం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “నా మదిలోని కోర్కెను తీర్చిన బాబా”
kishore Babu
January 11, 2017 at 5:57 amSai Baba…Sai Baba…Sai Baba.
http://saileelas.com/m/videos/view/Sai-Baba-Naamam-7