Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు నిర్మలా దేవి మా వారు పంచాయితీ రాజ్ లో ఇంజినీర్ గా చేసి రిటైర్ అయ్యారు. మాకు 1982వ సంవత్సరంలో వివాహం జరిగింది.
మాకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. బాబా నాకా భాగ్యాన్ని ప్రసాదించాడు.
అది ఎలా జరిగిందంటే 1983 వరకూ నాకు బాబా ఎవరో తెలియదు. ఆయన పూజలు ఎరుగరు.
1983 సంవత్సరంలో శ్రీ సాయి బాబా మహత్యం అనే సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా నేను చూడటం జరిగింది.
అంతే ఆ సినిమా చూసిన దగ్గర నుండి నాకు తెలియని ఆనందం, ఆయన ప్రేమ, ఆయన సహనం, ఆయన రూపం, ఆయన నిరాడంబరత అన్నీ నన్ను సమ్మోహన పరిచాయి.
బాబా ఫోటో ఒకటి తెచ్చి పూజా మందిరంలో పెట్టుకొని, ఆయన్ని పూజా చేయటం మొదలు పెట్టాను.
నేను ఆయన్ని ఒక గురువులాగా, ఒక తండ్రి లాగా, ఒక ఇంటి పెద్దగా భావించేదాన్ని. అప్పుడు మేము హైదరాబాద్ రామ్ నగర్ లో ఉండేవారం.
1984 వ సంవత్సరంలో, హైదరాబాద్, వనస్థలిపురంలో ఇంటి స్థలాలు అమ్ముతున్నారని తెలిసి ఒక స్థలం కొన్నాము. అందులో ఇల్లు కట్టుకోవాలని మా ఆలోచన. రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది.
ఆ తర్వాత ఏమయ్యిందో ఏమో గానీ హుడా సొసైటీ వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా ఏదో అభ్యంతరం పెట్టి ఆపేసారు.
ఆ సమయంలో మాకు ఒకే ఒక దిక్కు శ్రీ సాయి. బాబాకి నేను మొక్కుకున్నాను. ఏమని అంటే, బాబా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ వస్తే ఇది నువ్వు మాకు ప్రసాదించిన భిక్ష గా భావించి , ఇంటికి మేము నీ పేరు పెట్టుకుంటాము అని అనుకున్నాము.
సరిగ్గా నేను ఇలా అనుకున్న నెల రోజులకి హుడా సొసైటీ నుండి పర్మిషన్ వచ్చింది. ఇల్లు కట్టుకోవచ్చు మున్సిపాలిటీ నుండి పర్మిషన్ తెచ్చుకోండి అని.
మున్సిపాలిటికి అప్లయ్ చేసి చుట్టూతా ప్రహరి గోడ కట్టించాము. మా వద్ద ఎక్కువ డబ్బు లేనందున మూడు గదులు మాత్రమే కట్టడం జరిగింది.
ఆ ఇంటికి మేము ”శ్రీ సాయి నిలయం” అని పేరు పెట్టుకున్నాము. మిగతా ఇల్లు ఇంకా కట్టవలసి ఉంది.
స్టాట్ చేసాము. ఆ సమయంలో బాబా మాకు డబ్బు ఎలా అందించారో చూడండి.
1982వ సంవత్సరంలో మేము 50, 000 రూపాయలు ఒక బ్యాంకులో (ఓరియంటల్ బ్యాంకు) డిపాజిట్ చేసాము.
ఆ రోజులలో ఆ మొత్తం చాలా ఎక్కువ, ఇల్లు పర్మిషన్ రావడంతో ఆ డబ్బులే తీసి ఇల్లు కట్టాలని అనుకున్నాము.
ఒక రోజు తెల్లవారుఝామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక ముసలాయన తలకి రుమాలు కట్టుకుని, భుజాన జోలీ తగిలించుకొని వచ్చి నా చేతిలో ఒక మూట పెట్టాడు.
అంతలోనే మెలకువ వచ్చేసింది. ఆ డబ్బులు మేము బ్యాంకు నుండి డ్రా చేసాము. ఆ మరుసటి నెలకే ఆ బ్యాంకు బోర్డు తిప్పేసింది.
చాలా మంది లక్షల రూపాయలు అందులో జమ చేసి నష్టపోయారు. అందరూ బావురుమంటూ నెత్తి నోరు బాదుకున్నారు.
మాకా పరిస్థితి రాకుండా బాబా మా డబ్బులు మూటకట్టి కలలో మాకు ముందే చేర్చారు.
ఒకే రోజు 4 పట్టణాలలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కొలకత్తా లలో ఆ బ్యాంకు ఎత్తేసారు.
ఆ రోజు బాబా వారి పాదాలపై బడి బాబా నా మీద నీకెంత దయబాబా! అని ఏడ్చేసాను.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Saianthuni
Latest Miracles:
- సొంత ఇంటి కలను, కోరిన వంద రోజులలో సాకారం చేసిన బాబా వారు….
- నేను రైల్వే లో జాబ్ చెయ్యాలి అనే అమ్మ కోర్కెను తీర్చిన బాబా వారు…..గోపాలకృష్ణ
- నవ గురువారం వ్రతం చేసుకోవాలి అని సంకల్పించిన భక్తురాలి కోర్కెను తీర్చిన బాబా వారు
- నా మదిలోని కోర్కెను తీర్చిన బాబా
- బాబా వారి దయతో వారం లోగ మా ఇల్లు అమ్ముడయిపోయి, మా పెద్ద పాప పెళ్లి చేయగలిగాము.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments