అప్పటికి గాని ఆ వృద్ధుడు సాక్షాత్ బాబా అని నాకు తెలియలేదు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

చెన్నై నుండి సాయి భక్తురాలు A. సునంద గారు తన అనుభవాన్ని తెలియజేస్తున్నారు.

“2007వ సంవత్సరం మండు వేసవిలో ఒక గురువారం మధ్యాహ్న వేళ ఇంటి  పనులను పూర్తీ చేసుకొని బయటకు వెళ్ళవలిసి ఉండి బయలుదేరాను. స్కూటర్ బయటపెట్టి గేట్ వేసి వెనుకకు తిరిగాను.

అక్కడ ఒక ఆరు అడుగుల పొడవైన వృద్ధుడు పొడవైన కుర్తా మరియు దోతీ ధరించి ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. అతను చాలా తెల్లగా, ప్రకాశవంతమైన ముఖం, ప్రకాశవంతమైన కళ్ళు మరియు గడ్డం కలిగి ఉన్నాడు.

అతను చాలా అలసటగా మరియు అతని ముఖం ఎర్రగా కనిపించింది. బహుశ అది సూర్యుని వేడిమివల్ల కావచ్చు. అతను “సాయిరాం” అని  నమష్కరించారు. నేను అదేవిధంగా నమష్కరించాను. కానీ, నేను షిర్డీ సాయి బాబా యొక్క భక్తురాలినని అతనికి ఎలా తెలుసిందో నాకు అర్థం కాలేదు.

రహదారి నిర్జీవంగా ఉన్నందున క్షణంలో ఒక వ్యక్తి గేట్ వద్దకు ఎలా రాగలిగాడు అని నేను ఇంకా షాక్ స్థితిలో ఉన్నాను. నేను కోలుకొని అతనిని నీళ్ళు కావాలా అని అడిగాను. అతను కావాలన్నారు.

“మధ్యాహ్నం సమయంలోఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఆహారం మరియు నీరు అందించండి” అన్న బాబా యొక్క పదాలు గుర్తుకు వచ్చి ఆ వృద్ధుడిని ఏమైనా తింటారా అని అడిగాను. అతను కాస్త పెరుగు అన్నం పెట్టమన్నారు. మా ఇంటి హాల్ లో అరటి ఆకు వేసి అతనికి ఆహారాన్ని వడ్డించాను.

అతను చూడటానికి ఒక ముస్లిం ఫకీర్ లా వున్నారు. నేను ఎగువ కులానికి చెందినదానిని అని కొంచెం సంశయంలో ఉన్నాను. ఆ రోజులలో నా సాయి భక్తి పునాది దశలో ఉంది.

అతను పరిసేషణం చేసారు, అంటే తినే ముందు ఆహారం చుట్టూ నీటిని త్రిప్పి పరిశుద్ధపరచడం. అప్పుడు అతను నెయ్యితో 3 ముద్దలు తిన్నారు. ఇది మన సంస్కృతిలో భాగం. ఈ పద్ధతులను ముగించిన తరువాత, అతను తన పేరు నాకు చెప్పి, తన ఒంటిపై ఉన్న తాడును చూపి, అతను బెంగుళూరు కి చెందిన బ్రాహ్మణుడనని చెప్పారు. అలాంటి చౌక ఆలోచనలకు నా మనస్సులో చోటు ఇచ్చినందుకు నేను చాలా సిగ్గుపడ్డాను.

అతను తిరుపతి వెళ్ళినప్పుడు తన సామాన్లు పోగొట్టుకున్ననని మరియు తాను తిరిగి బెంగుళూరు వెళ్ళడానికి టికెట్ కొనడానికి డబ్బు అవసరమని నాకు చెప్పాడు. నేను ఇబ్బందిలో పడ్డాను, నా ఇల్లు స్టేషన్ నుండి చాలా దూరంలో ఉంది మరియు అతన్ని విడిచిపెట్టడం సాధ్యం కాదు. తన ఛార్జీల వసూలు కోసం అతను ఇంకొక ఇంటికి వెళ్లి ఉండవచ్చు. ఎందుకు అతను నన్ను ఎంచుకున్నాడు?

భోజనం తర్వాత, అతను భోజనం బాగుందని, మరియు నన్ను మంచి ఆరోగ్యం, శాంతి మరియు శ్రేయస్సుతో  ఉండాలని దీవించాడు. నేను అతని ఆశీర్వాదాలను తీసుకొని, టికెట్ వ్యయం యొక్క భాగంగా అతనికి కొంత డబ్బును ఇచ్చాను.

తరువాత అతను నా ఇంటిని విడిచి మరొక ఇంటికి వెళ్ళాడు (నా ఇంటి నుండి మూడో ఇల్లు). వారు కూడా సాయి భక్తులు. నేను ఆ ఇంటి ఆమెకు అతని టికెట్ కోసం మరి కొంత డబ్బును ఇమ్మని చెప్పాలి అనుకున్నాను. అతను చెప్పిన టికెట్ వ్యయం రూ .108 / – (మొత్తం బాబా నెంబర్ 9).

ఆ లేడీ అతని టికెట్ కు సరిపోయేటట్లు మిగిలిన డబ్బు ఇచ్చింది. అప్పుడు వృద్ధుడు వెళ్ళిపోయాడు.  ఇల్లు మరియు ద్వారం మధ్య దూరం 100 అడుగుల కన్నా ఎక్కువ ఉంది, అతను త్వరలోనే బయటకు వెళ్లిపోయాడు. వాస్తవానికి అతను అదృశ్యమయ్యాడు.

అద్భుతం చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వారి కుక్క ఈ కొత్త వ్యక్తిని చూసి మోరగా లేదు. నేను వారి వాచ్ మాన్ ని వృద్ధుడు గురించి అడిగినప్పుడు, వృద్ధుడేవరు నాకు కనిపించలేదు. ఎవరూ ఇంట్లో ప్రవేశించలేదు అన్నాడు. నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. నేను వెంటనే స్కూటర్ తీసి అతనిని అన్వేషించాను కాని ఎక్కడ అతని జాడ కనిపించలేదు.

నా ఇంటిని విడిచిపెట్టినప్పుడు, ఆ వృద్ధుడు ఒక విషయం చెప్పారు. “ఎప్పుడైనా కోపం వచ్చిన మా అబ్బాయిని కొట్టడానికి నా ఎడమ చేతిని వాడవద్దని చెప్పారు. ఎవరిపట్ల కోపం, ద్వేషం కలగకుండా నన్ను నియత్రించుకోవాలని చెప్పారు. మరియు నేను అభ్యంతరకర పదాలను ఎవరిపట్ల ఉపయోగించకూడదు అని, ఎవరినీ శపించకూడదు అని చెప్పారు. అలా చేస్తే ఆ మాటలు వాస్తవం అవుతాయని” చెపారు. ఎప్పటికి ఈ విషయాలను నా మనస్సులో ఉంటాయి.

మా వదిన (పెద్ద సోదరుడు భార్య) బాలాత్రిపురసుందరిని ఆరాధిస్తుంది. ఆ దేవత ఆమె శరీరంలో ప్రవేశించి మమ్మల్ని దీవిస్తూ ఉంటుంది. కానీ ఆ మరుసటి రోజు శుక్రవారం మా ఆశ్చర్యానికి అంతులేదు.

ఆమె శరీరములో బాబా ప్రవేశించి, ద్వారకమాయి లో కూర్చున్న విధంగా కూర్చొని,  నన్ను దగ్గరగా తీసుకోని, “నిన్నటి రోజున నీవు చేసిన సేవకు చాలా సంతోషించాను” అని చెప్పారు. అప్పటికి గాని ఆ వృద్ధుడు సాక్షాత్ బాబా అని నాకు తెలియలేదు.

ఆయన తమపట్ల దృఢ విశ్వాసం మరియు అనన్య భక్తీ క్తి కలిగి ఉండమని నాకు చెప్పారు. ఈ లీలా నా చివరి శ్వాస వరకు నేను గుర్తుంచుకుంటాను! 

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “అప్పటికి గాని ఆ వృద్ధుడు సాక్షాత్ బాబా అని నాకు తెలియలేదు

సాయినాథుని ప్రణతి

చాలా బాగుంది మీ అనుభవం .జై సాయినాధ్ మహరాజ్ కీ జై

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles