శ్రీధర్ జె. డిఘే



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఒకప్పుడు శ్రీధర్ జె. డిఘే అనే వ్యక్తీ తీర్ధ యాత్రకు వెళ్తూ షిర్డీ దర్శించారు. బాబాను దర్శించినప్పుడు బాబా “తిను తిను ఈ ప్రసాదం” అని ప్రేమగా డిఘే కు ఇచ్చారు. మరియు మూడు సార్లు చేతి నిండ ప్రసాదం ఇచ్చి అతనిచేత తినేలా చేసారు. అతనిని షిర్డీలో కొద్ది రోజులు ఉండమని బాబా చెప్పారు.

తరవాత అతడిని కాల రామ్ మందిరంలో ఉన్న నరసింగ్ మహారాజకు వద్దకు పంపించారు. నరసింగ్ మహారాజ్ అతనిని బాగా ఆహ్వానించి, సాయి బాబా అతనిని పంపించారా అని అడిగారు. అతను మహారాజా యొక్క సూచనపై ద్రాక్ష వ్యాపారి ఇంటిలో సుఖంగా ఉన్నాడు. ఆవ్యాపారి బొంబాయికి టికెట్ కొని అతనికి ఇచ్చారు.

తరువాత అతను ఖేడ్ గావ్ లోని నారాయణ్ మహారాజ్ దర్శనానికి వెళ్లారు. నారాయణ్ మహారాజు “నీవు సాయిబాబా వారిచే  ఆశీర్వదించబడుతున్నావు” అని చెప్పి, కొద్ది రోజులు అక్కడే ఉంచుకున్నారు.

డిఘే తన తీర్ధ యాత్ర తో  పూర్తిగా సంతృప్తి చెంది ఇంటికి తిరిగి వచ్చాడు. ఇది అంత బాబా యొక్క ప్రసాదం మరియు ఆశీర్వాద ఫలితమేనని డిఘే గట్టి నమ్మకం.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles