బాధ నుండి ఉపశమనం …. మహనీయులు – 2020… జూన్ 22



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఉత్తర హిందూస్థానములోని మీరట్ లో జ్యేష్ట (సామాన్యంగా జూన్ మాసంలో వస్తుంది) బహుళ పాడ్యమి రోజున రామప్రసాద్ జన్మించారు.

అనంతరం అయన నిత్యానంద సరస్వతిగా నామ స్వీకారం చేశారు. ఒకసారి ఆయనను కళాభాయి అనే వ్యక్తి ‘సంతు’ గా సంభోదించారు.  ఈ సంతు పెద్ద బిరుదు నాకు శోభించదు, అది నాకు ఎరువు సొమ్మే.

నేను మీ అందరి చరణములందలి రజముతో సమానము. సంతులగు మీ చరణములందలి పాద రక్షను” అన్నారు. నిత్యానంద సరస్వతి.

సాయిబాబా కూడా “మీ చరణ దర్శన భాగ్యముతో నేను పునీతుడ  నయ్యాను” అనేవారు భక్తులతో.

సన్యాసి జీవితమునకు సరిపడునట్లుగా ఆయన జీవించారు. శిష్యులను చేరదీయలేదు. గ్రంథములను అభ్యసించలేదు. ఉపన్యాసములు ఇవ్వలేదు.

ఎవరో ఆయనకు  సాష్టాంగ ప్రణామము చేసి మేడలో దండ వేయగా “ఈ సాస్టాంగ దండ ప్రణామములు  పొందుట నాకు సిగ్గు” అని మెడలోని దండను తీసివేశారు.

ఒకసారి ఆయన వద్దకు త్య్రంబక భాయి, సేవకులతో వచ్చాడు.సేవకులు భోజనానికి వెళ్ళారు.

ఆ సమయములో త్య్రంబకస్వామి శరీరములో నొప్పులు పెట్టుచుండెను. ఇది ఆయనకున్న ఒక వ్యాధి.

అప్పుడు నిత్యానందస్వామి త్య్రంబకభాయి కాళ్ళుపట్ట నారంభించాడు. త్య్రంబకుడు “ఇది నాకు నరకము కలుగ చేయును” అన్నాడు.

నిత్యానందులు “ఏమియు తప్పులేదు. నా పిల్లవాడివే కదా” అన్నారు. ప్రేమాభిమానములతో.

అప్పుడే ప్రవేశించిన స్వామి ప్రకాశానంద “నీవు వారి పిల్లవాడవు. అంతేకాదు స్వామివారు బుద్ధ దేవునివంటి వారు. ఆయన పశుపక్ష్యాదులకున్న బాధను సహింపలేకపోయెడి వారు” అని పలికారు నిత్యానందుల గురించి.

నిత్యానంద సరస్వతులు ఉపన్యాసములు ఇవ్వమన్నను బోధలను గాథల ద్వారా తెలియచేసేవారు. దైవముపై భక్తి విశ్వాసములను అలా పెంపొందించెడివారు.

ఒక వృద్ధ ఫకీరుకు, ఒక యువ ఫకీరుకు అన్నము దొరకలేదు ఒకనాడు. వృద్ధుడు యువకుని అడిగాడు “నీకు అన్నము దొరకనప్పుడు నీకేమనిపించును?” అని.

యువకుడు “దేవుడు నాయందు ఈ రోజు దయ చూపలే దనిపించును” అన్నాడు. ఆ యువకుడే “మీరైతే ఎట్లా  భావిస్తారు?”  అని ప్రశ్నించాడు.

“నేడు దైవము నాయందు దయ చూపెను అనిపించును. ఎందుకనగా నాకు మనో నిగ్రహమునకు అవకాశమిచ్చెను గదా” అన్నాడు  ఆ వృద్ధుడు యువకునితో.

డాక్టరు జయంతీభాయి ఒకసారి ఈయనను దర్శించాడు. డాక్టరుకు క్షయ వ్యాధి వచ్చునను భయము ఉన్నది.

నిత్యానందుల వారు “భావము ప్రధానము. సద్బావము కలిగి యుండుము. నేను రోగిష్టివాడను, భాదగా ఉన్నది అని అనుకొన్నచో, ఇంకను బాధ ఎక్కువగును. కనుక రోగము నయమైనదను సద్బావము కలిగి యుండుము” అని సలహా ఇచ్చారు.

ప్రకాశానందస్వామి, ఈయన (నిత్యానంద సరస్వతులతో) జరిపిన గోష్టులు “వార్తాలాపము” గా వెలువడ్డాయి.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles