Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
స్పెయిన్ దేశంలో పుట్టిన తెరసా తెల్లిదండ్రులు క్రీస్తు మతానికి చెందిన వారు.
తెరసా తల్లి ఆమెకి బాల్యం నుండే క్రీస్తు కోసం, క్రైస్తవ మతం కోసం జీవితాలను అర్పించిన వారి గాథలను చెప్పేది – జిజియా బాయి శివాజీకి చెప్పినట్లు.
ఆ వీర శోర్యం గాథల పర్యవసానంగా ఆమె తన 7వ ఏటనే, తన తమ్ముడైన రొడోరియోతో మత యుద్దానికి ఇంట్లో నుంచి పారిపోయింది.
అయితే వారు తన స్వగ్రామమైన అవిలా పొలిమేరలు దాటుతుంటేనే, ఆమె బంధువులు అక్కను, తమ్ముడిని పట్టి ఇంటికి తెచ్చారు.
క్రీస్తుపై మమకారం దిన దినం అధికం కాజొచ్చింది ఆమెకు. ప్రతి దినము ఒక గ్రంథాన్ని చదివేది. అలా గ్రంథాన్ని చదవని దినం వృధాయే అని భావించేది.
తల్లి మరణించింది. తండ్రికి ఇష్టం లేకున్నా మతాశ్రమంలో చేరింది ఆమె. ఆమె అక్కడికి చేరుకున్నప్పుడే గంటలు మ్రోగాయి – ఆ దినం – పవిత్రుల దినం (All Saints Day ).
ఆ మత ఆశ్రమ జీవితం వడ్డించిన విస్తరి కాదు. మగ వారి ఆధిపత్యమే కొనసాగేది. ఒకసారి ఆమె “నా రెక్కలు పడిపోవటానికి మహిళగా పుట్టటమే కారణం” అనేది.
కానీ, ఆమె తనను సింహంగానే కాక చీమగా కూడా భావించుకునేది. క్రెస్తవ మత సాహిత్యంలో. ఆమెయే ప్రథమ రచయిత్రిగా నేటికీ పేరు నిలబెట్టుకుంది.
ఆమె రచించిన గ్రంథం interior Castle, సాయిబాబా ఏ గ్రంథాన్ని వ్రాయకున్నా జీవిత చరిత్ర లభ్యమవుతోంది.
ఎంతో అనుభవపూర్వకంగా రచన సాగింది.
“ప్రభూ, నేను నీ దానను, నీ కోసమే జన్మించాను, నా నుంచి ఏమి కావాలి?” అని పరితపించేది.
ఆమె అనేక మార్మిక దృశ్యాలను చూచేది.
ఒక దేవత బంగారు శూలంతో ఆమె గుండెలలోనికి, ఆ కొనను దించటం ఒకటి. ఆ కోన అగ్ని వలే తేజోమయం.
ఆ శూలం దింపినప్పుడు కలిగే బాధ కన్నా, అంతరంగంలో కలిగే ఆనందం వర్ణించలేనిది.
ఈ దృశ్యం శిల్పంగా కూడా అనంతరం చెక్కబడింది.
ఆమె అనుభవాలు సోపానం (నిచ్చెన) వలే ఉంటాయి. మొదటగా దైవం ఎడల భక్తి భావం. ఇది ఉదృతమై రెండవ మెట్టులో దుఃఖాన్ని అధిగమించగల స్థాయికి చేర్చుతుంది.
మూడవ మెట్టులో కేవలం శారీరక స్పృహ మాత్రమే ఉండటం, ఇక నాలుగవ మెట్టులో దైవంతో ఏకమవటం.
ఒకసారి దైవంతో మమేకమైనప్పుడు జరిగే అద్భుతాలు ఎన్నో ఉంటాయి. ఒకసారి ఆమె వద్దకు మరణించిన బిడ్డను తెచ్చారు.
ఆ బిడ్డను చూస్తూ ఆమె దైవాన్ని ప్రార్ధించింది. ఆమె దైవంతో మమేకమైంది. బిడ్డకు జీవం వచ్చింది.
అవిలాకు చెందిన ఆ పునీతురాలు అక్టోబర్ 4 (1582)న దేహాన్ని త్యజించింది.
నేడు అక్టోబర్ 4. ఆమె రచించిన గ్రంథాన్ని చదువుతూ , ఆమెను స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- అలనాటి క్రీస్తు బాధ …. మహనీయులు – 2020… ఏప్రిల్ 8
- నైతిక విజయం … .మహనీయులు – 2020… అక్టోబరు 10
- హయవదన వందనం…. మహనీయులు – 2020… మార్చి 4
- ఎవరి పూజ వారికే! …. మహనీయులు – 2020… అక్టోబరు 16
- అరుత్ పెరుంజ్యోతి…. .మహనీయులు – 2020… అక్టోబరు 5
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments