Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా మూర్తీభవించిన వైరాగ్య రూపం. అక్టోబర్ 5 (1923)న జన్మించిన రామలింగ కూడా అంతే.
ఒకసారి ప్రవచనాన్ని చెప్పటానికి వీలుపడక తమ్ముడైన రామలింగస్వామి గళ్ ను వెళ్లమన్నారు ఆ బాలకుని అన్నగారు.
బాలకుడు వెళ్లి ప్రవచనం చెప్పాడు. విన్న వారంతా ముగ్దులయ్యారు. కనక వర్షం కురిసింది.
ఆ దక్షిణను ప్రవచనానంతరం ఆ బాలునకు ఇచ్చారు. ఆ బాలుడు ఆ దక్షిణను దారిలో గాలిలో ఎగరేసుకుంటూ వెళ్లాడు.
అది ఆ బాలుని పిచ్చి చేష్ట అనుకోలేదు. ఆ బాలుని వైరాగ్యానికి సంతసించారు అందరూ.
పెద్దవాడయ్యాడు. దశ విద్యను నేర్చాడు. రస విద్యను గూర్చి అనర్గళంగా ఉపన్యసిస్తుంటే, ఒక విదేశీయుడు రుజువు కావాలన్నాడు.
ఆ విదేశీయుని కున్న రాగి ఉంగరాన్ని తీయించి, రామలింగస్వామి స్పర్శించి ఇవ్వగా అది బంగారమయింది.
ఒకనాడు రామలింగర్ ఒక స్నేహితుని ఇంటికి వెళ్లారు. రాత్రయింది. ఇంట్లో ఎవరూ లేరు.
రామలింగర్ రచనా వ్యాసంగం చేస్తున్నారు. ఇంతలో దీపం ఆరిపోయేటట్టున్నది నూనె లేక. నూనెకు బదులుగా నీటిని పోసి, రాత్రంతా ఆ దీపం వెలుగులో వ్రాతను సాగించారాయన.
ఎవరో రామలింగపై కేసు వేశారు కోర్టులో. కోర్టులోనికి వస్తున్న రామలింగ స్వామిగళ్ ను చూచి అందరూ, విరోధులు కూడా లేచి నిలబడ్డారు, నమస్కరించారు.
జడ్జి కూడా లేవబోయి, అధికారం వెన్నుతట్టగా బలవంతాన కూర్చున్నాడు.
జడ్జి కేసు వేసిన వ్యక్తిని బోనులో “కేసు వేసిన నీవు ఆయన (రామలింగర్) రాగానే ఎందుకు నిలబడ్డావ్?” అని ప్రశ్నించారు. “అందరిలాగానే” అన్నాడు ఆ వ్యక్తి .
“ఆయనకు ఎందుకు నమస్కరించావు?” అడిగాడు జడ్జి. “నాకే తెలియదు. ఆయనంటే నాకున్న గౌరవం అలా చేయించింది” అన్నాడా వ్యక్తి.
అంతే రామలింగర్ పై కేసును కొట్టివేశాడు జడ్జి. ఇలాగే ఒకసారి సాయిపై కేసు మోపబడ్డది, కొట్టివేయ బడ్డది కూడాను.
రామలింగ స్వామి జ్యోతి స్వరూపమే. ఆయన కదిలితే, అందరిలాగా, అన్ని వస్తువులలాగా ఆయన నీడయే పడదు.
ఇక ఆయన తనువు చాలించనున్నట్లు చెప్పారు. తాను కూర్చున్న గుడిసె తలుపును పూర్తిగా మూసివేశాడాయన.
తన వాణిని వినగానే తలుపు తెరవచ్చునన్నారు. అందరూ దివ్య కాంతిని కీర్తిస్తున్నారు.
దక్షణ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ మొదలైన వారు వచ్చి తాళం వేసి వెళ్లిపోయారు.
మేలో ఆ గది తలుపులు తెరిచారు. ఆయన జాడే లేదు. ఆయన జ్యోతి స్వరూపుడై విశ్వమంతా వ్యాపించారు.
నేడు అక్టోబర్ 5 ఆయన జన్మ దినం. ఆయనను స్మరించెదము గాక.
“అరుత్ పెరుం జ్యోతి, అరుత్ పెరుంజ్యోతి
తాని స్పెరుంకరుణై అరుత్ పెరుం జ్యోతి”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- న్యాయవాది …..సాయి@366 జూలై 26….Audio
- బాబా ఆమెని జాగ్రత్తగా చూసుకున్నారు –Audio
- భక్తురాలి ఇంట్లో జ్యోతి వెలిగించినప్పటినుండి ఎన్నో రూపాలలో పూజ గది గోడ మీద కనిపించిన బాబా వారు.
- చెప్పవద్దు…. మహనీయులు – 2020… అక్టోబరు 27
- దర్శనం…. మహనీయులు – 2020… అక్టోబరు 19
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments