మూగవోని గొంతు…..సాయి@366 అక్టోబర్ 5….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


కళాకారులు కూడా సామాన్య మానవులే. అయితే మానవులు ఏదో ఒక పని చేస్తుంటారు.  కళాకారులు తమ పనిని ఆరాధనా భావంతో చేస్తుంటారు.

సాయిబాబా కూడా గొప్ప కళాకారుడే. ఆయన షిరిడీ వచ్చిన కొత్తలో కాళ్ళకు గజ్జె కట్టి నృత్యం చేసేవాడు, గీతాలు ఆలపించే వాడు. అంతే కాదు గొప్ప కళా పోషకుడు కూడా.

కళాకారులకు సంఘంలో, దేశ విదేశాలలో పరపతి ఉంటుంది. ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి గొప్ప గాయని, భక్తురాలు. ”భారత కోకిల”గా ప్రశంసలు అందుకున్నారు.

ఆమె ఒకసారి యునైటెడ్‌ నేషన్స్‌లో, ఐక్యరాజ్య సమితిలో పాటను పాడటానికి అంగీకరించారు. ఆమె తన బృందంతో తరలి వెళ్ళింది.

మరునాడే ఆమె కచేరి చేయాలి. ఉన్నట్టుండి ఆమె గొంతుక పూడుకుపోయింది. ఎవరికీ ఏమి చేయటానికి తోచలేదు.

ఆమె కంచి పరమాచార్యను ప్రార్ధించింది. తెల్లవారింది. అచట కచేరీ ఆరంభమయ్యింది. కచేరి పూర్తయింది. హాలంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.

ఆమె మరోసారి అక్కడ నుండే పరమాచార్యకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు సమర్పించింది. ఇది ఆమె భక్తికి నిదర్శనము. ఇది పరమాచార్య కరుణకు నిదర్శనం.

సాయి మహా సమాధి చెందాడు.

అంతమాత్రాన భక్తులకు లోటు లేదు, ఉండదని అనేకానేక నిదర్శనలు జరిగాయి – జరుగుతున్నాయి కూడా.

వాటిలో ఒకటి అక్టోబరు 5, 1951న వెలుగు చూసింది. శ్రీ దత్తాత్రేయ రామచంద్ర పాటిల్‌ గొప్ప కళాకారుడు.

ఆయన కొంత కాలం దీర్ఘవ్యాధికి లోనయ్యాడు. వ్యాధి అయితే నయమైంది గాని గాత్రం రావటం లేదు. స్వరం మూగపోయింది. ఏంచేయాలో తెలియలేదు ఆయనకు.

ఆయన స్నేహితులలో ఒకరు, షిరిడీకి వెళ్ళి సాయి సమాధిని దర్శింపమని సలహా ఇచ్చాడు.

అలాగే ఆయన షిరిడీకి వెళ్ళాడు. సమాధిలోని సాయిని దీనాతి దీనంగా ప్రార్ధిస్తున్నాడు. మెల్ల మెల్లగా ఆయన స్వరం అప్పుడే యథాస్థాయికి చేరుకుంది.

పూర్వపు మాధుర్యాన్ని ఆ గొంతుక పొందగలిగింది. ఇదంతా సాయి కటాక్షంగా భావించాడు ఆయన.

అక్టోబరు 5, 1951లో సాయి శరణానందకు లేఖ రూపంలో తెలియ చేశాడు సాయి కరుణను గురించి.

కరుణా సముద్రుడు సాయి. సమాధి నుండే సకల జీవులను సంరక్షిస్తుంటాడు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles