బాబా ఆమెని జాగ్రత్తగా చూసుకున్నారు –Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-36-బాబా-ఆమెని-జాగ్రత్తగా-చూసుకున్నారు 3:05

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
బొంబాయి ఆసుపత్రిలో సునీతా అరోటె ఎడమ వాల్వు మార్పిడి జరిగింది. ఆమె భర్త బయట డాక్టర్ కోసం వేచి వున్నాడు.

బయటకు వచ్చిన డాక్టరు ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని చెప్పాడు.

డాక్టర్ కి మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుని, బాబా పాదాల చెంత కన్నీరు కార్చాడు ఆమె భర్త.

నాలుగురోజులు ఐసియూ లో వుంచిన తర్వాత మామూలు గదికి ఆమెని మార్చారు.

ఆ గదిలో ఆమె కి స్పాంజ్ తో తుడవడమూ, ఆమె వ్యక్తిగత శుభ్రత అన్నీ జాగ్రత్తగా చూసికో సాగారు.

సునీత జుట్టును దువ్వేందుకు ఒక పదమూడు సంవత్సరాల నర్శింగ్ విద్యార్దిని నియమించబడింది.

సునీతకి అంత చిన్నపిల్ల నర్సుగా రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆమెతో సంభాషించింది, ఆ విద్యార్దిని తన పేరు జ్యోతి అని చెప్పింది. అప్పుడు సునీత ఆమెని ఎక్కడ వుండేదానివని అడిగింది.

’నేను షిరిడీలో వుండేదానిని, మా ఇల్లు సమాధి మందిరానికి ప్రక్కనే వుంది’ అని జ్యోతి జవాబిచ్చింది. వెంటనే సునీత నేను కూడా షిరిడీలోనే వుండేదానిని అంది. ఆ తర్వాత ఆ విద్యార్దిని వెళ్లిపోయింది. సునీత ఆ సంభాషణంతటినీ నెమరు వేసికుంది.

’కానీ సమాధి మందిరానికి ప్రక్కన ఏ ఇల్లూ లేదే’ అనుకుంది. జ్యోతి ప్రతిరోజూ ఉదయమూ సాయంకాలము వచ్చి ఆమె బాగోగులు చక్కగా చూసికునేది.

నాలుగోరోజున సునీత బాగా కోలుకుంది. జ్యోతి కోసం ఎదురు చూస్తూ వుంటే, మరొక నర్సు వచ్చింది. సునీత ఆమెను ’ఇవాళ నర్సింగ్ విద్యార్దిని జ్యోతి రాలేదెందుకు?’ అని అడిగింది.

ఆ నర్సు ఆశ్చర్యకరంగా ’ఏ నర్సింగ్ విద్యార్దిని, జ్యోతి పేరుగల నర్సులెవరూ ఇక్కడ లేరు’ అని జవాబిచ్చింది. అందుకు సునీత ’షిరిడీ లో వుండే జ్యోతి’ అని గుర్తు చేసేందుకు ప్రయత్నించింది.

’అమ్మా! ఇక్కడ షిరిడీ నుంచి వచ్చిన జ్యొతి అన్న నర్సు ఎవరూ లేరు’ అని మరోసారి చెప్పి ఆమె వెళ్లిపోయింది.

అప్పుడామెకు తట్టింది, ఆపరేషన్ కి ముందు ఎనిమిదేళ్ళ బాలుడిగా తనకి కనిపించినదీ, ఆపరేషన్ తర్వాత తనకు సేవలు చేసిన నర్సింగ్ విద్యార్దిని జ్యోతి మరెవరో కాదు సాయేనని.

ఆమె కళ్ళు ఆనందభాష్పాలతో చెమ్మగిల్లాయి. బాబా కరుణ తలుచుకుని ఆమె ఆనంద పరవశురాలైంది.
సాయిప్రసాద్ పత్రిక (దీపావళి సంచిక) 1998.
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 8270077374

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా ఆమెని జాగ్రత్తగా చూసుకున్నారు –Audio

kishore Babu

మనము సంపూర్ణ విశ్వాసముతో, భక్తి శ్రద్దలతో ఎల్లప్పుడూ సాయి బాబా వారికి సేవ చేసినట్లుఅయితే,అయినా కనుక సంతృప్తి చెందినట్లు అయితే, ఎప్పుడు అయితే మనం సహాయం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వారే వచ్చి సహాయం చేస్తాను అని ఈ లీలా ద్వారా సాయి బాబా వారు నిరూపించారు.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles