నీకోసం నేనావిధంగా చేస్తాను. దానివలన ఎదురయ్యో పరిణామాలకు నువ్వు బాధ్యత వహించగలవా చెప్పు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-165-0912-నీకోసం నేనావిధంగా చేస్తాను 2:44

పందొమ్మిదేళ్ల బి.ఆర్.జ్యోతి అనే విద్యార్దిని ప్రీ యూనివర్సిటీ కోర్సు బెంగుళూరులో చదువుకుంటూ 28, మార్చి 1986 రోజున చనిపోయింది.

ఆమె బాబాకి అచంచల భక్తురాలు, నిత్యం విష్ణు సహస్రనామం పఠిస్తూ, సాయి సాహిత్యాన్ని చదువుతూ వుండేది.

ఇరవై ఏడవ తేదీన ఆమె మూత్ర విసర్జన అవడంలేదని వెప్పింది.

ఆరోజు సాయంకాలం నాలుగు గంటలకి బాత్ రూమ్ ద్వారం దగ్గర పడిపోయింది.

డాక్టర్ వినోద్ వచ్చి పరీక్షించి ఆమెని వెంటనే దగ్గరలోని ఆసుపత్రి కి తరలించారు.

జ్యోతి బాబా నామాన్ని జపిస్తూనే వుంది. ఆమెకి  అత్యంత ఉత్తమమైన చికిత్స అందీయడమైనది.

ఆమె తాత గారికి తెల్లవారు ఝామున వచ్చిన ఒక భయంకరమైన కలతో ’వెళ్ళిపో, వెళ్ళిపో’ అంటూ అరచిన తన అరుపులకే మెలుకువ వచ్చింది.

కలలో ఆయన ఒక నల్లటి కుక్క ఆయన మీద మీదకి కరిచేందుకు వస్తూ వుండడాన్ని చూసారు.

అదే సమయంలో జ్యోతి నన్నెవరో శ్మశానానికి ఈడ్చుకుని పోతున్నారు అని గొణుక్కోసాగింది.
ఆమె తాతగారిని పిలిచి ఆమె బతికే ఆశలేదని చెప్పడం జరిగింది.

ఆయన ఆమె మంచం దగ్గరికి వెళ్ళి బాబా ఫోటోగ్రాఫ్ ని ఆమె పక్కన పెట్టారు.

ఎంతో భక్తితో ఆమె ఆ ఫోటో వైపు చూసింది. కొంచెం విభూతి ఆమెకి ఇవ్వడం జరిగింది.

కొన్ని నిముషాల తర్వాత ఆమె మరణించింది.

ఆమె చిన్న చెల్లెల్ని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.

పదమూడవరోజు ఆమె చిన్న చెల్లెలు ఒక స్వప్నాన్ని గాంచింది.

అందులో ఆమె అక్క జ్యోతి బాబా పక్కన కూర్చుని వుండడం చూసిన తర్వాత ఆమె నెమ్మదించింది.

అప్పుడు ఆమె తాతగారు దీక్షిత్ తో బాబా చెప్పిన మాటల్ని గుర్తు చేసారు.

ఒకసారి దీక్షిత్ ఒక పిల్లవాడి ప్రాణాన్ని కాపాడమని బాబా ని ప్రార్దించాడు.

అందుకు బాబా ”ఇలాటి వాటిల్లో ఇరుక్కోకు, ఆ కుర్రవాడు కొత్త శరీరంలోకి ప్రవేశించాడు.

కొత్త శరీరంతో ఎన్నో మంచి కార్యాలు చేయబొతున్నాడు, అది ఈ శరీరం చేయలేదు.

ఒక వేళ కుర్రవాడిని పాత శరీరంలోనికి రప్పిస్తే, కొత్త శరీరం మరణీస్తుంది.

నీకోసం నేనావిధంగా చేస్తాను. దానివలన ఎదురయ్యో పరిణామాలకు నువ్వు బాధ్యత వహించగలవా చెప్పు’ అన్నారు.
శ్రీ సాయిలీల, సంపుటి: 66 సంచిక: 6, సెప్టెంబరు 1967

సేకరణ మరియూ అనువాదం

సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com
whatsapp 7033779935
Voice call: 9437366096

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నీకోసం నేనావిధంగా చేస్తాను. దానివలన ఎదురయ్యో పరిణామాలకు నువ్వు బాధ్యత వహించగలవా చెప్పు–Audio

kishore Babu

ఈ లీలా ద్వారా సాయి బాబా వారు మన రాబోయే జన్మలను కూడా ఆయనే నిర్దేశిస్తారు అని అర్ధమవుతుంది.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles