ఆకలితో వున్నా భక్తురాలు వేదనగా సాయిని ప్రార్ధించగా ఆహారంతో పాటు జీవనోపాధిని చూపించిన బాబా వారు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-37-ఆకలితో-వున్నా-భక్తురాలు 3:26

చిన్నప్పటి నుంచి నాకు సాయినాధుడంటే భక్తి వుండేది. అప్పుడే సాయి సచ్చరిత్ర చిన్న పుస్తకం చదవటం మొదలు పెట్టాను.

అప్పుడు మా అమ్మ కూడా చెప్పేది సాయి నామ జపం చేస్తూ వుండు అని. నాకు పెళ్ళి అయిన తరువాత కూడా సాయి నామ జపం, సాయి సచ్చరిత్ర చదవటం నేను ఆపలేదు. దాని వలన నాకు కలిగిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

అది 1989 వ సంవత్సరం జూన్ – జూలై నెలలు నేను గర్భవతిని అయినాను. 7 నెలలు అయిపోవచ్చింది, మా ఆర్థిక పరిస్థితి చితికి పోయింది. మేము భోజనము కూడా చేయలేని కఠిన పరిస్థితిలో వుంటిమి.

అలాంటి సమయంలో కూడా బాబా సచ్చరిత్ర నేను రోజు పారాయణం చేసేదాన్ని. ఒక రోజు ఎదో కారణం వలన, నేను నా భర్త ఆకలితోనే వున్నాం.

రాత్రి 9 .30 గంటలు అయింది. అప్పుడు మేము పూనా రైల్వేస్టేషన్ దగ్గర వుండేవాళ్ళం. అప్పుడు నేను నా భర్త తో అన్నాను, కొంచెం station వరకు వెళ్ళి చూద్దాం, ఏదన్నా మార్గం దొరుకుతుందేమో అని.

మేము నడవడం మొదలు పెట్టాము నడుస్తూ కూడా నేను సాయి నామ జపం చేస్తున్నాను. ఆకలితో వున్న నాకు మాటి మాటికి సాయినాథుని ధ్యాసనే మనసుకు వస్తావుంది.

అప్పుడు చాలా వేదనతో “బాబా ఆకలిగా వుంది, ఎమన్నా సహాయం చేయి” అని అనుకుంటూ station వరకు చేరుకున్నాము.

అక్కడ పండ్లు ఇంకా తినే పదార్దాలు వున్న బండి ఒకటి ఆగివుంది. అయినా మా దగ్గర పైసలు లేవు. నిరాశగా వెనక్కు వస్తు వున్నాం.

ఇంతలో, ఆశ్చర్యంలో కెల్ల ఆశ్చర్యం(ఆ time నాకు అలా అనిపించింది) నా కాలికి ఎదో తగిలింది. చూస్తే ఆడవాళ్ళు వాడే ఒక  Purse (మనసులో నిరంతరం సాయి నామ స్మరణ చేస్తూనే వున్నాను).

ఇంతలో ఆ purse తీసి చూశాను, 500 రూపాయలు వున్నాయి. ఇంకా చిల్లర కూడావుంది. మళ్ళీ నేను మా అయన station కు వెళ్ళి ఆ పండ్ల బండిలో కొన్ని పండ్లు కొనుక్కొని తిన్నాము.

తరువాత ఆ 500 రూపాయలతో ఒక చిన్న tea shop start చేశాము.నిదానంగా మా జీవితాలకు అదే ఆధారమైంది. “భక్తుల ఇండ్లలో లేమి వుండదు” అను బాబా వాక్కు నిజమైంది.

మేము ఎప్పుడు బాబాను కోట్లు కావాలని అడగలేదు. భక్తి శ్రద్దలతో మేము చేసే ప్రార్థన మన్నించు స్వామి అనుకునే వాళ్ళం. ఆ స్వామి కరుణ ఆ రూపంలో మాకు కలిగింది.పిలిస్తే పలికే దైవం సాయి.

సర్వం సాయినాధార్పణమస్తు

మనిషా గురుదత్త పవార్,
పూనా, మహారాష్ట్ర.

 

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

10 comments on “ఆకలితో వున్నా భక్తురాలు వేదనగా సాయిని ప్రార్ధించగా ఆహారంతో పాటు జీవనోపాధిని చూపించిన బాబా వారు–Audio

Madhavi

ధనికులకు..నిర్ధనులకు..నీకు..నాకు..బ్రాహ్మదులకున్…అని..పోతన భాగవతం..చెప్తుంది.అందరికి ఆయన శ్రీచరణాలే.దిక్కు..ఓం.సాయి రాం.

Gautam

For Baba’s grace.no difference between.rich and poor…That is the main krupa of sairam…

Dillip

We came to know about saibaba from u mam…We r happy to hear so many stories about baba..Sairam.

Somya

Jaisairam..

subhalaxmi

She asked only Baba’s. Blessings..Amazing miracle mam..Jai sai ram.

b vishnu Sai

Om sai ram

T.V.Gayathri

Om Sai Sri Sai jaya Jaya sai

yaswanth

Jai sai ram..

Krishnaveni

Madhavi naw bangaruthalli god bless u. Manasunu kadilinche anubhavam god bless them and u b always blessed

నా భక్తుల ఇళ్లలో లేదు అన్న అన్న శబ్దమే ఉండదు….సాయి బాబా…సాయి బాబా..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles