Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం సాయి రామ్ .
శ్యామ కర్ని ని కూడా చూపించిన బాబా వారు.
అది 2016 సమయం ఏప్రిల్ నెల ,అదీ నా పుట్టినరోజు, ఉదయం ఏడు గంటలకు దూళి దర్శనం కొరకు వెళ్తూ, ఒక పూల బోకే తీసుకొని వెళ్ళాను.
మరి నా కోరిక తాత స్వయంగా రావాలికదా. నేను వెళ్ళే సరికి ద్వారకామాయి లో తాత ఉన్నారు.
తెల్లటి కఫ్ని , మరియు ఒక జోలె ఇంకా కాలికి ఒక పెద్ద కడియం వేసుకొని ఉన్నారు.
నన్ను లోపలి రానీయకుండానే గ్రిల్ల్స్ లో నుండి నా చేతులో ఉన్న పూల బోకే ని తీసుకొని ,వెళ్ళు ఇప్పుడే కదా వచ్చారు రూమ్ కి వెళ్లి రా తరువాత కలుద్దాము. అని నన్ను పంపిచేసారు.
ఇక నా మనసు ఎక్కడా ఆగుతుంది. ఎప్పుడెప్పుడు వెళదామా అని పరుగులు పెడుతుంది.
అతి తొందరగా మళ్ళీ వచ్చాను. ఏరి తాత మరలా నాకు ఎక్కడా కనిపించలేదు.
ఇలా వచ్చి అలా వెళ్ళిపోయావా అని , పుట్టినరోజు ఎడిపిస్తున్నావ్ అని బాగా అలిగాను.
కాని తాత అలా ఉడికిస్తారు అంతే ఎవరిని ఎప్పుడూ బాధ పెట్టరు. ఆ విధంగా సాయంత్రం అయ్యింది.
అదే సాయి యంత్రం వెయ్యడానికి సాయంత్రం వరకూ ఆగారు అన్నమాట. పారాయనహాల్ వద్ద దత్తమందిర్ ఉందికదా అక్కడ ఉన్నారు తాత,
ఇక్కడ ఒక విషయం ఉదయం వచ్చిన రూపమే అది ! అక్కడ బెంచస్ ఉంటాయి కదా అక్కడ కూర్చొని ఉన్నాము.
నేను పారయనహాల్ వైపు చూస్తున్నా. ఎందుకంటే మా వారు అందులో ఉన్నారు. వస్తే తాత కి దండం పెట్టుకుంటారు అని, వాడు ఇప్పుడు రాడులే నువ్వు చెప్పు అన్నారు తాత.
ఇంకా పుట్టినరోజు కదా వచ్చావు నన్ను పట్టుకున్నావు కోరిక తీరిందా అని అడిగారు, అప్పుడే సంస్తాన్ వాళ్ళు కొత్తగా బయోమెట్రిక్ మొదలు పెట్టారు.
అది నాకు నచ్చలేదు, ఏమిటో రోజు రోజుకి మారుస్తున్నారు అని చెప్పారు. వేదాంత విషయాలు చెప్పారు. దేని మీద ఆశ ఉండకూడదు అని చెప్తూనే, నీకు ఈరోజు ఏమి కావాలి చెప్పు నేను కానుక ఇస్తాను నగలు కావాలా ? అని అడిగారు.
నన్ను ఇంతేనా నువ్వు అర్ధం చేసుకున్నది అని బాగా తాత ఒల్లో పడుకొని మరీ ఏడ్చేసాను. మరి ఏమి కావాలి. ,
నాకు నువ్వు కావాలి అని మాట తీసుకున్నా. పరీక్షచెయ్యడానికి వచ్చావా, ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చావా చెప్పు అని అడిగా. సరే హారతి సమయం అయ్యింది కదా త్వరగా, అంటే కానీ ఈరోజు నిన్ను వదలను అని నేను వెళ్లనీయలేదు.
కాని మా వారు అసలు బయటకు రారే. సరే ఈరోజు రాత్రి ఎక్కడ తింటారు అని అడిగారు తాత , మేము రెస్టరెంట్ వెళ్దాము అని చెప్పా. ఏమి వద్దు మన శ్యామ కర్ని మనల్ని తిప్పుతుంది.
మీరు ఈరోజు బయట తినవద్దు అని చెప్తూ ఇప్పుడు వస్తాడు చూడు వాడు అని అనేలోపు మా వారు బయటకు వచ్చేసారు.
ఇవన్నీ ఒకటే టైం లో జరిగిపోయాయి. కాని మావారికి మాత్రం యంత్రం వేసాడు తాత.
మన స్పృహ మాత్రం లేదు. నేను అన్నాను షిర్డీ అంతా గుర్రాలే శ్యామ కర్ని అని చెప్పి నన్ను మోసం చేయకు తాత అని నవ్వాను,
కాదు నిజమే మనం బయటకు వెళ్లేసరికి ఎదురుగా మనకోసం తయారుగా ఉంటుంది చూడు అన్నాడు తాత. నిజమే మేము వెళ్ళేవరకు రెడీ గా ఉంది.
అన్నప్రసదాలయం కి తీసుకొని వెళ్లి తాత మాకు అన్నం పెట్టి అంటే మొదటి ముద్దలు మాకే పెట్టారు తరువాత , తాత కొద్దిగా తిన్నారు.
మరలా గుడికి తీసుకువచ్చారు చిన్నగా శేజా హారతి టైం అయ్యింది. ఇంక వెళ్ళండి విశ్రాంతి తీసుకోండి అన్నారు తాత,
దక్షిణ ఇస్తే తాత వద్దు అన్నారు. నేను రాత్రి ద్వారకామాయి లో ఉంటాము అని చెప్తే, తాత మాత్రం ఒప్పుకోలేదు.
ఇప్పటివరకూ నాతోనే కదా ఉన్నారు. వెళ్ళండి వెళ్లి విశ్రాంతి తీసుకొని పొద్దునే రండి అని చెప్పి మా ఇద్దరినీ ఆశీర్వదించి వెళ్ళారు తాత.
ఇంత ప్రేమ చూపించే తాత కి నేను ఏమి ఇవ్వగలను, అందుకే ప్రేమ నేర్పించిన తాత కే, ప్రేమతో , తాతమనవరాలు. ఓం సాయి రామ్.
Latest Miracles:
- భవిష్యత్తు ని చూపించి నన్ను చావు నుండి తప్పించిన బాబా వారు ……..!
- భక్తురాలు దసరా రోజు ఇంట్లో పెట్టుకున్న సత్సంగం కు తాను సైతం వచ్చి నిదర్శనము చూపించిన బాబా వారు.
- నాతో కుంటాట ఆడి నా నడుము నొప్పి ని బాగు చేసిన బాబా వారు …..!
- రిక్షాలో తీసుకెళ్లి షిరిడీ చూపించిన బాబా !
- క్షణకాలంలో మనసులోని కోరికను తీర్చిన బాబా వారు—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments