చనిపోయిన బిడ్డ తిరిగి వచ్చింది–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై..సమర్ధ సద్గురు సాంబశివ మహారాజ్ కీ జై

This audio prepared by Mr Sreenivas Murhty

  1. chanipoina Bidda tirigi vacchindi 2:35

1921 లో బాబా వారి భక్తుడు అయిన శ్రీ రేగే యొక్క కూతురికి మలేరియా సోకినది..రేగే తను పనిచేస్తోన్న ఊరిలోని ఒక వైద్యుడి ని సంప్రదింఛి మందులు వాడాడు.

కాని ఫలితం లేకపోవడం తో మెడిసిన్ లో డిప్లొమా చేసిన ఇంగ్లీష్ వైద్యుడిని సంప్రదించాడు.

అయినప్పటికీ ఆయన కూతురి ఆరోగ్యము రోజు రోజు కి క్షీణించసాగింది.

ఆమె చాల శక్తి హీనురాలయ్యి చర్మము ఎముకలు మాత్రమె వున్నాయి అనే లా తయారయింది.

మాట్లాడే శక్తి కుడా కోల్పోయి తన తల్లి కి తన బాధ కుడా చెప్పలేని పరిస్తితి లో ఉండెను..అది చూసి ఆమె తల్లి కన్నీరు మున్నీరు గా విలపించాసాగింది.

ఆ పరిస్తితి లో ఉద్వేగంతో రేగే డాక్టర్ తో తాను చేసిన ప్రయత్నాలు వ్యర్ధమే అని అనేసరికి డాక్టర్ అవమానం తో వెళ్ళిపోగా ఆయుర్వేదం ట్రీట్మెంట్ ఇప్పించాసాగాడు . అయినప్పటికీ ఆమె పరిస్త్తితి లో మార్పు లేదు.

ఒకరోజు ఆమె తల్లి కూతురి మంచం పక్కన కుర్చుని చాలా బాధ తో బాబా ను ప్రార్థించసాగినది.

అప్పుడు బాబా మాటలు ఇలా వినిపించాయి.

“బాధ పడకు, నీ కూతురు ఈరోజు నుండి మూడవ రోజునాడు బాగు పడుతుంది “.

అది విని ఆమె స్తిమిత పడుతుంది …కానీ మూడవ రోజున వారి కూతురు చాలా బలహీనమయ్యి నాడి కొట్టుకోవడం ఆగిపోయి శ్వాస కుడా ఆగిపోతుంది.

ఆమె కళ్ళు ముసుకుపోతాయి. దానితో రేగే భార్య, రేగేతో- బాబా చెప్పిన మాటలు ఎందుకు అసత్యం అయినాయి అని విలపించాసాగింది.

రేగే, తన భార్య తో ఇది మన విధి అని చెప్పి బాబా వారి ఉది తీసుకురమ్మటాడు ..ఆమె, ఎందుకు మన కూతురు చనిపోయాక అని అంటున్నా కుడా ఉది ని కూతురి దేహానికి పూయ మని చెప్తాడు.

అలాగే కూతురిని తన ఒల్లో కి తీసుకుని భార్య తో ఉది ని గంగా జలం లో కలిపి తెమ్మని చెప్పి , 5 చుక్కలు తెరిచి ఉండిపోయిన కూతురి నోట్లో వేయగానే ఆమె కను రెప్పల్లో కదలిక మొదలవుతుంది.

ఆమె కళ్ళు తెరిచి తండ్రి ని చూస్తుంది.కొంతసేపట్లోనే ఆమె మామూలు గా మునుపటి లా ఆరోగ్యం గా మారిపోతుంది.

ఇది చూసి వాళ్ళు పట్టరాని ఆనందంతో” బాబా వారి మాటలు ఎన్నటికి అసత్యం కానే కావు ” అని బాబా ను స్తుతిస్తూ వుండిపోతారు.

ఈ విధం గా బాబా, చనిపోయిన తన భక్తుడి బిడ్డను తిరిగి తీసుకు వచ్చారు.

శ్రీ  సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ..సమర్ధ సద్గురు సాంబశివ మహారాజ్ కీ జై..

సంపాదకీయం: సాయి భావన

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles