Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-30 హరిభావూ ఎమ్.ఫాన్సే 6:46
జనార్ధన్ ఎమ్.ఫాన్సే అనబడే హరిభావూ ఎమ్.ఫాన్సే ఆదాయం అంతంత మాత్రమే.
తన తల్లి బరువు బాధ్యతలు కూడా ఆయనే చూసుకోవాలి. తన సమస్య తీర్చలేని విధంగా అసాధ్యమని తేల్చుకొని అన్నిటినీ వదలి వెళ్ళిపోదామనుకున్నాడు.
తన నిర్ణయాన్ని తల్లికి చెప్పి రామేశ్వరం వెడతానని చెప్పాడు.
దారిలోనే షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకుందామని నిశ్చయించుకున్నాడు.
రామేశ్వరం ప్రయాణం ప్రారంభించి దారిలో షిరిడీ చేరుకున్నాడు.
ద్వారకామాయిలోకి అడుగుపెట్టి బాబాను చూడగానే ఎంతో ఆనందాన్ని పొందాడు.
సాయి అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని, ‘ఇంటికి వెళ్ళు, రామేశ్వరం నీ కోసం పస్తుంది. నీవు వెళ్ళకుంటే మరణిస్తుంది’ నీ తల్లి నీ కోసం ఉపవాసాలు చేస్తూ శుష్కించి పోయింది, నీ కోసం పరితపిస్తోంది” అని, అతనిని వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపొమ్మని చెప్పారు.
అతను వెళ్ళేటప్పుడు బాబా అతనికి కొంత ఊదీనిచ్చి పంపించారు.. దానిని భద్రంగా దాచుకొని ఇంటికి తిరుగు ముఖం పట్టాడు. అతడిల్లు చేరేసరికి అతని తల్లి నిరాహారియై,
‘బాబా, నీవు మహాత్ముడివైతే నా బిడ్డ తిరిగి రావాలి’ అని రోజూ ప్రార్ధిస్తున్నదని తెలిసింది.
తల్లి రామేశ్వరమంత పవిత్రమైనదని బాబా భావం. అతడు తల్లికి బాబా చెప్పినదంతా వివరంగా చెప్పాడు. ఆమెకు బాబావారి దైవశక్తి మీద ఎంతో నమ్మకం కలిగింది.
ఇలా ఉండగా ఒక గ్రామస్తుడు కలరా వ్యాధితో బాధ పడుతూ ఫాన్సే సహాయం కోసం వచ్చాడు.
ఫాన్సే అతనికి కొంత ఊదీని ఇచ్చాడు. ఆ ఉదీ మహత్యం వల్ల అతని వ్యాధి నయమయింది.
ఈ సంఘటనతో గ్రామస్థులందరూ ఫాన్సే వైద్యుడని భావించి వైద్యం కోసం అతని దగ్గరకు రావడం ప్రారంభించారు. తొందరలోనే అతని దగ్గరున్న ఊదీ అయిపోయింది.
ఆ తరువాత ఏమి చేయాలో అర్ధం కాలేదు. కాని ఊరిలో కలరా వ్యాధి లేకుండా పూర్తిగా నివారింపబడింది.
ఒక రోజు యధాలాపంగా అతను మరొక గ్రామంలో ఉన్న ఒక మార్వాడీని కలుసుకోవడం తటస్థించింది.
ఆ మార్వాడీ తన సోదరుని దుస్థితి గురించి చెబుతూ ఇలా అన్నాడు “నా సోదరునికి చాలా జబ్బుగా ఉంది.
ఎంతో మంది వైద్యులు వైద్యం చేసినా ఏమీ ఫలితం కనపడలేదు.
మీరు సాయి భక్తులు కాబట్టి మీరు వచ్చి నా సోదరుణ్ణి చూడాలి.
మీ సాయిబాబాయే కనక నిజంగా దేవుడయితే నా సోదరుని జబ్బు మీద్వారా నయం చేస్తారు.” అన్నారు.
హరిభావూ అతని సోదరుని స్థితిని ఒక్కసారి చూసాడు.
అతని స్థితిని చూడగానే చాలా భయం వేసింది.
ఆ వెంటనే ఫాన్సే తను ఫీజు చాలా ఎక్కువగా తీసుకుంటాననీ రెండు వందల రూపాయలు ఇమ్మని చెప్పాడు. అంత పెద్ద మొత్తం మార్వాడీ ఎలాగూ ఇవ్వలేడు కాబట్టి వద్దని అంటాడనే ఉద్దేశ్యంతో ఆ విధంగా చెప్పాడు.
అతను చెప్పిన ఫీజు కూడా ఏ సివిల్ సర్జన్ చెప్పనంత ఎక్కువగా చెప్పాడు.
కాని ఆ మార్వాడీ అతను చెప్పిన ఫీజు ఇవ్వడానికి ఒప్పుకొన్నాడు. ఇక తప్పించుకోవడానికి వీలులేని అయోమయ పరిస్థితిలో పడ్డాడు.
ఆ గ్రామం నుండి ఏదో విధంగా తప్పించుకొని వెళ్ళిపోదామనుకొన్నాడు కాని అది రాత్రి సమయం వల్ల సాధ్యం కాని పరిస్థితి. సమస్యనుండి బయటకు రాలేని స్థితిలో ఇరుక్కొన్నాడు.
అతని అలవాటు ప్రకారం బాబా గారి ప్రార్ధనకి, భజనకి ఆ ఇంటిలో అన్ని ఏర్పాట్లు చేసాడు. జబ్బుతో నున్న మార్వాడీ సోదరుడు మొత్తం పనంతా తనే స్వయంగా చేసాడు.
కుటుంబసభ్యులందరూ ఆశ్చర్యపోయారు. భజన జరుగుతున్నంత సేపు జబ్బుగా ఉన్నతను బాబా ఫొటోనే ప్రేమతో దీక్షగా ఎంతో ఏకాగ్రతతో చూస్తూ కూర్చొన్నాడు.
అది చూసిన మార్వాడీకి ఎంతో సంతోషం కలిగి
“జబ్బుతో ఉన్న నా సోదరుని జీవన్మరణ సమస్య భారమంతా నీ మీదే ఉంది. నువ్వు మాత్రమే నా సోదరుని జబ్బును నయం చేయగలవు” అన్నాడు.
అతని మాటలకు హరిభావూ పెద్ద సందిగ్ధంలో పడ్డాడు. ఏమి చేయాలో పాలుపోలేదు.
బాబా కరుణాసముద్రుడు. అందుచేతనే బాబా హరిభావూ కలలో దర్శనమిచ్చి, అసలు అతనికి వచ్చిన జబ్బు , దానికి ఏమందు ఎలా వాడాలో అన్నీ వివరంగా చెప్పారు. హరిభావూ బాబా చెప్పినట్లే చేయడంతో రోగి కోలుకొన్నాడు.
అన్నమాట ప్రకారం మార్వాడీ హరిభావూకి రెండువందల రూపాయలు ఫీజు ఇచ్చాడు.
కాని హరిభావూ ఫీజు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. “ఇదంతా నా గురువు దయ వల్లనే జరిగింది.
ఇందులో నేను చేసినదేమీ లేదు. నాకు ఫీజు ఇవ్వద్దు” అన్నాడు. మార్వాడి బాగా నిరాశ చెంది, ఆ డబ్బుతో ఒక శాలువా కొని హరిభావూ ఇంటిలో లేని సమయంలో, అతని ఇంటిలో ఇచ్చి వెళ్ళిపోయాడు.
హరిభావూ ఇంటికి వచ్చి మార్వాడీ ఇచ్చిన శాలువా చూశాడు. ఎలాగయినా ఆ శాలువాను బాబాకే ఇచ్చేద్దామనుకొన్నాడు.
కాని అప్పటికే బాబా మహాసమాధి చెందారు. కన్నీళ్లతో బాబాని ప్రార్ధించాడు.
ఆ రోజు రాత్రి బాబా అతని కలలో కనిపించి “చుట్టుప్రక్కలంతా అంటువ్యాధులు ప్రబలి ఉన్నాయి. ఆ శాలువాను అమ్మి, వచ్చిన డబ్బుతో బియ్యం కొను.
ప్రస్తుతం బియ్యం అయిపోయేంతవరకు కొన్న ధర కన్నా తక్కువకు అమ్ము. ఆ తరువాత మరలా బియ్యం కొని లాభానికి అమ్ము.
నీ జీవితం సుఖంగా సాగుతుంది” అని చెప్పారు. హరిభావూ బాబా చెప్పినట్లే చేసి ఎంతో అభివృధ్ధిలోకి వచ్చాడు. తన తల్లిని సుఖపెట్టాడు.
ఈ లీల ద్వారా మనకు బాబా ఊదీ ఎంత శక్తివంతమయినదో అర్ధమవుతుంది.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
ఈ సమాచారం ఈ క్రింది లింక్ http://telugublogofshirdisai.blogspot.in ద్వార సేకరించడం జరిగింది.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 5వ. అధ్యాయము–Audio
- చనిపోయిన బిడ్డ తిరిగి వచ్చింది–Audio
- బాబా “6 నెలలు వేచి ఉండు, అప్పుడు చూడు తప్పు చేసిన వారి పరిస్తితి” అన్నారు.—Audio
- బాబా నామస్మరణతో ప్రాణాపాయ స్థితి నుండి బిడ్డ కోలుకున్నాడు
- అమ్మా నీవు నాపై దృష్టి పెట్టు, నేనును అట్లే నీపై దృష్టిపెట్టెదను. నీవు మేలు పొందెదవు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments