Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-41-1021-బాబాపై మాస్టారుగారి చూపు 4:07
మరుసటిరోజు 9వ తేదీ ఉదయం మెలకువరాగానే, రాత్రి భుజించనందున ఆకలి వేయుచుండగా మద్రాసు హోటలులో ఫలహారము చేయతలచి సమాధిముందరగా శ్రీభరద్వాజగారు వేళ్ళుచూ మందిరములోపలకు చూచిరి.
మందిరము లోపల పూజారులు తప్ప మరెవరు లేరు.బాబా విగ్రహమును చూడ కళకళలాడుచున్నట్లు వీరికి కనుపించగా బాబా విగ్రహమును చూడవలెననిపించి హోటళ్లకు వెళ్ళకయే మందిరములోపలకు వెళ్ళిరి.
బాబా విగ్రహము ముందు నిలచి బాబా ముఖమును చూచుచుండగా శ్రీ సాయి బాబా చూపుతో శ్రీ మాస్టారుగారి చూపు కలసి అంతర్ముఖమైనది.
మాస్టారుగార్కి ఏదో అతీత స్థితిలో యుండిరి.
వారి చుట్టూ యున్న దృశ్యము అదృశ్యమై అతీతమైన ఆనంద స్థితిలో మాస్టారుగారు ఉండిపోయిరి.
ఇది ఇతరులకు వర్ణించసాద్యము కాని స్థితి.
“అమ్మా నీవు నాపై దృష్టి పెట్టు, నేనును అట్లే నీపై దృష్టిపెట్టెదను. నీవు మేలు పొందెదవు” అని బాబా రాధాబాయి దేశముఖ్ తో చెప్పిన విధానమిదే.
ఇదే సాధనలో పరాకాష్ట . సమాధిస్థితినొందుట. మాస్టారుగారు అల్లాగే కొన్ని గంటల సమయము అదే ఆనందస్థితిలో బాహ్య ప్రపంచమును మరచి పోయి యుండిరి.
వేదవ్యాసుగారు వచ్చి వీరి వీపుతట్టగానే మాస్టారుగారు తృళ్ళిపడి కళ్ళు తెరచినారు.
అప్పటికి షుమారు ఐదు గంటల సమయము తాను అలానే యుండి పోయానని మాస్టారుగారు తెలుసుకున్నారు.
ఆవిధముగా మాస్టారుగారికి బాబా అనుగ్రహము ప్రాప్తి యించినది.
హైదరాబాదు వచ్చిన అదే ఆనందస్థితిలో వారు గడిపిరి.తనపై విశ్వాసము లేని వారిని బాబా తన మార్గములోనికి అప్పుడు ఇట్లే అనుగ్రహించిరి.
ఇప్పట్లో సాయి మార్గములో ఎన్నో విచిత్ర సంఘటనలు చోటు చేసుకొనుచున్నవి.
బాబా మార్గములలో గురువులు తయారగుచున్నారు. చెవులలో మంత్రోపదేశములు చేయుటకు ఉబలాటపడువారున్నారు.
శక్తిపాతము ఇత్తుమని సొమ్ములను వాసులు చేయుచున్నవారు యున్నారు. తాత్కాలికమైన తాంత్రికముల జోలికి బాబా భక్తులు పోరాడు. కన్నెత్తి చూడరాదు.
శ్రీమాస్టారులా మనకు బాబా నుండి వారు పొందిన అంతరముఖము, శక్తిపాతములలా బాబా నుండి పొందవలెనే కాని ఇతరచోట్లకు పరుగులు తీసి పతనము కారాదు.
శ్రీ మాస్టారు వారిలా అనుగ్రహము పొందిన వారరుడు.
హైదరాబాద్ లో ఉంటూ ప్రతి శనివారం బయలుదేరి షిరిడీ వెళ్ళి మరలా సోమవారం ఉదయం వస్తూ, సచ్చరిత్ర పారాయణ చేస్తూ, బాబా మార్గములో మాస్టారు ముందుకు సాగారు.
షిరిడీలో శివనేషన్ స్వామితో పరిచయమేర్పరుచుకొని సాధనకుపక్రమించారు.
జిల్లెళ్ళమూడి అమ్మవద్ద కొంతకాలమున్నారు. చీరాల అవధూత అనుగరహమును పొందారు.
ఇలా ఎందరో అవధూతల దర్శనం పొందుతూ ముందుకు సాగారు.
వీరు శ్రీ సాయిబాబానే సద్గురువుగా ఎట్లు స్వీకరించిరి. బాబాయే వీరి వివాహమునకు ఏర్పాట్లు ఎట్లు చేసిరో ముందు తెలుసుకుందాము.
తన యందు విశ్వాసము లేనివారికి బాబా విస్వాసము కలిగించుదురని మాస్టారుగారి లీలలో గ్రహించినాము.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి మార్గములో పెద్దలు(జిల్లెళ్ళమూడి అమ్మగారు)
- శ్రీ సాయిబాబా అనుగ్రహమునకు శ్రీ భరద్వాజ గారు పాత్రులగుట–Audio
- పిలిస్తే పలుకుతాను. నీవు ఎక్కడ ఉన్నా తలచిన వెంటనే నీ చెంత ఉంటాను–Audio
- బాబా, నీవు తలచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలవు—Audio
- బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు “నీవు ఎక్కడికైనా వెళ్ళు.నేను నీ వెంటే ఉంటాను”అని అన్నారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “అమ్మా నీవు నాపై దృష్టి పెట్టు, నేనును అట్లే నీపై దృష్టిపెట్టెదను. నీవు మేలు పొందెదవు–Audio”
Sai Suresh
July 7, 2016 at 7:19 amమొదట్లో నా ఫ్రెండ్స్ కొంతమంది శక్తిపాతం తిసుకోనమని చాల సార్లు నన్ను ప్రోత్సహించారు. కానీ నాకు ఏదైనా సాయి నీ అడిగి చేయటం అలవాటు. ఈ శక్తిపాతం విషయం నేను ఎన్ని సార్లు సాయి ని అడిగిన సాయి నాకు సమాధానం ఇవ్వలేదు. బాబా కి ఇష్టం లేకపోతె మౌనంగా వుంటారు. అందుకే నేను సాయి బావాన్ని గ్రహించి నేనెప్పుడు శక్తిపాతం తీసుకోలేదు.
మనం ఏదైనా సాయి ని అడిగి సాయి నుండే పొందలిగాని, ఇతరులను ఆశ్రయించరాదు గురువులకే గురువు, సమర్ధ సద్గురుడైన సాయి ఉండగా ఇతరుల వెంట మనం ఎందుకు పడాలి?
kishore Babu
July 8, 2016 at 6:18 amసాయి, మీ భావన చాలా అర్థమవంతమైనది. ఒక సారి సాయి బాబా వారిని నమ్మిన తరువాత వేరే గురువు దగ్గరకి వెళ్లవలిసిన అవసరమే లేదు. మన మనస్సులో సాయి బాబా వారి నామస్మరణ నిరంతంరం చేసినట్లు అయితే వారే ఈ సంసారము అనే సాగరము నుండి బయటకు తీసుకొని వస్తారు.