బాబా, నీవు తలచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలవు—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కీ జై ! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై !!

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-111-సుసాధ్యం చేయగలవు 2:52

నా పేరు వేలూరు హరిహర శర్మ.రిటైర్డ్ ప్రిన్సిపాల్ ని. నేను సరస్వతి నగర్ లో ఉంటున్నాను.

“పిలిచినంతంతనే పలికెడి దైవం” శ్రీ సాయిబాబా నాకు ప్రసాదించిన మరొక అనుభవమును మీతో పంచుకుంటున్నాను.

ఒక రోజు ఉదయం 11 గంటలప్పుడు నాకు ఫోన్ చేసుకోవాలనిపించి నా సెల్ ఫోన్ కోసం చూశాను.

ఎక్కడ కనపడలేదు.ఇల్లంతా వెతికాను.మా ల్యాడ్ ఫోన్ నుండి చాలా సార్లు నా సెల్ కు ఫోన్ చేశాను.

రింగ్ అవుతున్నది కాని ఫోన్ ఎవరు చేయటం లేదు.

నేను ఉదయం ల్యాండ్రి షాప్ కు, కూరగాయల మార్కెట్ కు వెళ్ళాను.

అక్కడేమన్నా పడిపోయిందేమోనని అక్కడికి వెళ్ళి వెతికాను. అక్కడ నుంచి కూడా ఫోన్ చేశాను.

రింగ్ అవుతూనే ఉంది. ఎవరు తీయడం లేదు.ఎక్కడ పోయి వుంటుందని అనుకుంటూ ఇంటికి వచ్చాను.

అప్పుడు సుమారు ఒంటి గంట అయినది.

బాబా ఫోటో వద్ద కూర్చొని “నా సెల్ ఎలాగైనా నాకు దొరికేటట్లు చేయి బాబా, నీవు తలచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలవు”   అని బాబాతో మొరపెట్టుకున్నాను.

విచిత్రంగా అప్పుడే మా మనుమరాలు చదివే స్కూలు హెచ్.యం గారు మా ల్యాడ్ లైన్ కు చేసి ” సార్! మీ ఫోన్ మేము తీసివుంచాము.

మీరేమి కంగారు పడవద్దు. మీ సెల్ ఫోన్లో చాలా మిస్డ్ కాల్స్ వున్నాయి. మీరు వచ్చి తీసుకోండి అని చెప్పారు.

నాకు చాలా అనందం ఆశ్చర్యం వేసింది. చాలా సంతోషంతో బాబాను తలచుకుంటూ మా మనుమరాలు చదివే స్కూలుకి వెళ్ళి  హెచ్.యం గారిని కలిశాను.

అసలు ఆ సెల్ అక్కడికేలా వచ్చిందంటే “మా మనుమరాలు ఉదయం 9-00 గంటలప్పుడు స్కూలుకి వెళ్ళేటప్పుడు లంచ్ బ్యాగ్ లో పొరపాటున నా సెల్ పడిపోయివుంది.

మా పాప లంచ్ టైం లో ఆ బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు, మరల రింగ్ రావడం గమనించి అక్కడి స్టాప్ వాళ్ళు ఆ ఫోన్ ను హెచ్.యం గారికి అందచేశారట.

హెచ్.యం గారికి నేను అంతకు ముందే పరిచయం కాబట్టి ఆమె నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు.

ఏదైతేనేం నాకు నా సెల్ మరలా దొరికింది. ఇది బాబా వారి ఆద్భుత లీల.

అప్పటి నుండి పొరపాటున ఏ వస్తువైనా పోయినా నేను కంగారుపడటం లేదు. బాబానే మనకిస్తారనే విశ్వాసంతోనే వుంటున్నాను.మరిన్ని అనుభవాలు మీతో మరలా పంచుకోవాలని ఆశిస్తూ …. మరొక్కమారు బాబాకు, గురుదేవులకు వినమ్ర నమస్కారాలతో….

వేలూరు హరిహర శర్మ,
నెల్లూరు.

సంపాదకీయం: సద్గురులీల (జూలై – 2008)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles