బాబా చేసిన వివాహము



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబా చేసిన వివాహము

బాబా గారి లీలలు అనంతములు అని మనకు తెలుసును. ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో ఆయనకు మాత్రమే తెలుసు. ముందర తన భక్తుడు కాకపోయినాసరే, ఒక చిన్న లీల చూపించి తనవానిగా చేసుకుంటారు. ఆయన పాదాలను ఆశ్రయించినవారు ఇక ఎప్పటికీ ఆయనను వదలిపెట్టరు.

బాబా వల్ల ఒకామె వివాహము ఎలా జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాము.

ఈ బాబా లీల శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారు  బ్లాగులో పొస్ట్ చేసిన దానికి తెలుగు అనువాదము. ప్రియాంక గారి మాటలలో చదవండి..

ఈ రోజు మనము ఢిల్లీ నుంచి స్వాతి బక్షి గారు తెలిపిన లీల గురించి తెలుసుకుందాము. ఆమె నాకు ఈ మెయిల్ ౩ నెలల క్రిందటనే పంపినప్పటికీ ఈ రోజున నేను దానిని పోస్ట్ చేస్తున్నాను. ఆమె చాల డిప్రెషన్ లో ఉంది, ఎందుకంటే ఆమెని పెళ్లి చేసుకోబోయేవాడు ఆమెని మోసం చేసాడు. ఆమె చెప్పిన మీదట ఈ విషయం చాల సీరియస్ అనిపించి నా సెల్ నంబర్ కూడా ఇచ్చినట్లు గుర్తు. రెండు రోజులుగా ఆమె నాకు ఫోన్ చేయలేదు, కాని ౩ రోజున రాత్రి 1.30. కి ఫోన్ చేసింది.

నేను సాధారణంగా రాత్రి 7 తరువాత సెల్ ఫోన్ సైలెంట్ మోడ్ లో పెడతాను, మా అమ్మాయి నిద్రకి భంగము కలగకుండా. కానీ ఆరోజు నా సెల్ ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం మరిచిపోయాను. ఆమె నాకు ఫోన్ చేసినప్పుడు బాగా విచారంగా ఉంది, ఏడుస్తోంది. నేనంతా పూర్తి వివరంగా చెప్పలేను గాని , ఆమె తన కాబోయే భర్త చేత మోసగింపబడింది. వాళ్ళు ఇంకొక రెండు వారాలలో పెళ్ళి చేసుకోబోతారనగా ఇదంతా జరిగింది.

ఆమె ఇంకా ఇలా చెప్పింది, నేను నెట్ ముందు కూర్చున్నప్పుడు మీ ఐ.డి కనపడింది, మెయిల్ చేద్దామనుకున్నానుగాని మాట్లాడడానికి మీరు తప్ప ఎవరూ లేరు నాకు, అని ఏడుస్తూ చెప్పింది. ఈ విషయంలో ఆమె నా సహాయాన్ని కోరుతోంది.

ఇది చాలా క్లిష్టమయిన సమస్య, స్వాతి చాల నిస్సహాయురాలుగా ఉంది, ఈ పరిస్థితులలొ ఆమె ఏమయినా చేసుకోవచ్చు ,  ఏమి జరిగిందో నాకు పూర్తిగా తెలియదుగాని, బహుశా బాబా గారే ఈ సమస్య పరిష్కరించడానికి నన్ను ఎన్నుకున్నారేమో. నేను స్వాతితో కాస్త రిలాక్స్ అవమని, ప్రొద్దున్న తొమ్మిది గంటలకు ఫోన్ చేస్తానని చెప్పాను. ‘సాయి సాయి సాయి’ అనుకోమని చెప్పాను.

ఆ రోజు రాత్రంతా నేను దీనికి పరిష్కారము ఏమిటా అని ఆలోచిస్తూ, ప్రొద్దున్న 5.30 కి పూజ గదిలో కుర్చుని స్వాతి సమస్యకి పరిష్కారం చూపించమని బాబాని కోరి ప్రార్థించాను. సాయిసచ్చరిత్ర చేతిలోకి తీసుకుని చదవడం మొదలుపెట్టాను. నేను చదువుతున్నప్పుడు స్వాతి మళ్లీ ఫోన్ చేసి “అక్కా! నాకు నిద్ర పట్టడంలేదు, నాకు చచ్చిపోవాలని ఉంది” అన్నది.

అప్పుడు నేను స్వాతితో  “ఓ కే, అలాగే కానీ నువ్వు చనిపోదామనుకుంటే నేను అడ్డుపెట్టను, కానీ దీనికి పరిష్కారం ఉంది, నువ్వు ఆచరిస్తానంటే కనక చెపుతాను” అని చెప్పాను. నీ చింతలన్నీ పోతాయని మాత్రం నాకు నమ్మకం ఉంది అని చెప్పాను. ఇది వినగానే “ఏమిటా పరిష్కారం?” అని అడిగింది. నిజానికి అప్పటికి నాదగ్గిర చెప్పటానికి పరిష్కార మార్గమేదీ లేదు,

కానీ సచ్చరిత్ర చేతిలో ఉంది, అందుకని ఆమెతో, “నువ్వు బాబా సచ్చరిత్ర ఒక వారం రోజులు పారాయణ చెయ్యి” అని చెప్పాను. నేను చెప్పిన దానికి స్వాతి సంతోషించలేదు, “నేను బాబా భక్తురాలిని కాదు, నేను అమ్మవారిని పూజిస్తాను” అని చెప్పింది.  కానీ నేను గట్టిగా చెప్పిన మీదట సచ్చరిత్ర చదవడానికి ఒప్పుకుంది. (నేను ఆమెకి ఒక పుస్తకం పంపాను)

దాదాపు పది రోజులదాకా నాకు స్వాతి నుంచి ఎటువంటి ఫోన్ లు రాలేదు. ఒకరోజు నాకు వివాహ శుభలేఖ వచ్చింది, చూసేటప్పటికి అది స్వాతి శుభలేఖ. కెనడా లో ఉన్న ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరుతో ఆమె వివాహం. నా సంతోషానికి అవధులు లేవు. నేను వెంటనే ఇదంతా ఎలా జరిగిందని స్వాతికి ఫోన్ చేసాను.

స్వాతి, “ప్రియాంక అక్కా, నాకు నువ్వు బాబా గారిని పరిచయం చేసినందుకు, సచ్చరిత్ర పంపినందుకు కృతజ్ఞతలు ఎలా చెప్పను“ అని చాలా సంతోషంగా చెప్పింది. నాలుగు రోజులలోనే నాకు బాబా గారి ఆశీర్వాదం లభించింది.

స్వాతి , సచ్చరిత్రలో అరవై తొమ్మిదో పేజి వద్దకి వచ్చేటప్పటికి, బాబా గారికి ధూప్ స్టిక్, నైవేద్యానికి పంచదార పలుకులు కొని తెద్దామని షాప్ కి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. వారిద్దరికీ మొదటి చూపులోనే ప్రేమ కలిగింది. ఇద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది. ఇద్దరు ఒకరి ఫోన్ నంబర్స్ ఒకళ్ళు తీసుకున్నారు.

అదే రోజు సాయంత్రం ఆ అబ్బాయి తన తండ్రి తో కలిసి స్వాతి ఇంటికి వచ్చి ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉన్నట్లు చెప్పాడు. దీనితో స్వాతి కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆ అబ్బాయి కెనడాలో స్థిరపడ్డ ఐశ్వర్యవంతుల కుటుంబానికి చెందినవాడు. కానీ, స్వాతి కుటుంబము మాత్రము సామాన్యులు.

ఒకరోజున జీవితాన్ని అంతం చేసుకుందామనుకున్న స్వాతి ఈ రోజు కెనడాలో తన భర్తతో సంతోషంగా ఉంది. సంతోషించవలసిన విషయం ఏమిటంటే ఇప్పుడు స్వాతి ఆమె కుటుంబ సభ్యులు షిర్డీ సాయిబాబా గారినే పూజిస్తున్నారు. తను చాలా సార్లు బాబాగారిని కలలో చూస్తున్నానని చెప్పింది.

స్వాతి ఏదయితే కోరుకుందో బాబా గారు అది ఆమెకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె సమస్యని పరిష్కరించడంలో నన్ను మార్గదర్శకురాలిగా చేసినందుకు నేను బాబాగారికి కృతజ్ఞురాలిని. ఈలీల మనకి సాయి భక్తిలో ఉన్న శక్తి మన జీవితాలని ఒక్క రాత్రిలోనే ఎంతలా మార్చి వేస్తుందో తెలియచేస్తుంది, మనకు కావలసిందల్లా శ్రద్ధ,సహనం.

ఏది మంచో ఏది చెడో మనకు తెలియదు కాబట్టి మనము బాబాగారికి సర్వస్య శరణాగతి చేయడమే. కానీ బాబాగారు ఏది చేసినా అది మన మంచికే చేస్తారు. లీల పోస్ట్ చేయడానికి అనుమనితినిచ్చినందుకు స్వాతికి ధన్యవాదములు. ఈలీలను చదివిన మనకు, ముఖ్యముగా యువతకి ప్రయోజనము చేకూరుట నిశ్చయము. ఆశను వీడకండి, బాబా మీద నమ్మకముంచండి. మీ భవిష్యత్తును చూడండి. అది మీ ఊహకందనిది.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles