భక్త మహల్సాపతి 9వ బాగం..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

ఎంతటి భక్తునికైన ఏమారే క్షణాలుంటాయి కాబోలు.

రోజూ మహల్సాపతి ఒక కుంటి కుక్కకి అన్నం పెట్టేవాడు. అది తిని వెంటనే వెళ్ళి పోయేది. ఒక రోజు ఎంత అదిలించినా వెళ్ళలేదు. వెంట పడింది. కోపంతో కర్ర తీసుకొని ఆ కుక్కని రెండు దెబ్బలు కొట్టాడు మహాల్సా. ఆనాటి రాత్రి మసీదులో బాబా పాదాలు వత్తుతున్నాడు. అప్పుడు బాబా ‘అరె భగత్ (బాబా మహాల్సా ని భగత్ అనే వారు)! ఈ గ్రామంలో నావంటి జబ్బు కుక్క ఒకటుంది. దానిని ప్రతి వెధవా కొట్టే వాడే’ అన్నారు. అతడికి తన తప్పు గుర్తొచ్చి పశ్చాత్తాపం చెందాడు. బాబా అన్ని జీవులని సమంగా చూసే వారు. అలా చూడమని తన భక్తులకు కూడా చెప్పే వారు. ఎప్పుడైనా ఎవరైనా ఈ విధంగా ఎమారితే ఎదో విధంగా వారికి గుర్తు చేసేవారు.

ఒకనాడు కొందరు బోయీలు పరదాలు కట్టిన పల్లకీ తెచ్చి మశీదు ముంగిట దించారు. ఒక రాణిగారు, ఒక వాసెన కట్టిన బిందె మశీదులోకి పంపింది. దానిని విప్పిచూసిన భక్తుడు మహల్సాపతి, “బాబా, యిది బంగారం!’ అన్నాడు. సాయి తమ హృదయాన్ని చూపుతూ ఎగతాళిగా, “బంగారం యిదా, లేక అదా?” అన్నారు.  అతడు మైకంలోంచి మేల్కొని, “మీరే అసలైన పెన్నిధి” అన్నాడు.”  “అయితే దానిని వెంటనే త్రిప్పి పంపివేయి!” అని ఆజ్ఞాపించారు సాయి.  ఆ మహారాజు ముందు ఆ రాణిగారు బిచ్చగత్తెయై తుచ్ఛమైన బంగారం తీసుకుపోవలసి వచ్చింది.

బాబా మహాసమాధి సూచనలు

 బాబా త్రికాల జ్ఞాని. మహల్సాపతి తన రెండో కొడుకు పుట్టిన తరువాత (1899) బాబా దగ్గరకు వెళ్ళి, పిల్లవానికి నామకరణము చేయమని అర్ధించాడు. అప్పుడు బాబా “భగత్, నీవు ఈ పిల్లాడిని 25 సంవత్సరాలు పోషించు అది చాలు” అన్నారు.  విషయం మహల్సాపతికి అప్పట్లో  అర్ధంకాలేదు. ఆ తరువాత మహల్సా రెండవ కొడుకుకు   25 సంవత్సరాలు వయస్సు వచ్చేవరకు మాత్రమే బ్రతికి ఉన్నారు.

ఒకరోజు సాయింకాలం చీకటిపడగానే మహాల్సాపతి వచ్చి చిలిమ్ వెలిగించి బాబా కిచ్చి “బాబా చీకటి పడుతోంది, లాంతరు వెలిగించనా!” అన్నారు. బాబా చిత్రంగా నవ్వి “అరె భగత్! నిజంగానే చీకటి పడుతోంది. కొద్ది రోజులలో నేనేక్కడికో పోతున్నాను. అటు తర్వాత నాలుగు సంవత్సరాలకు నీవు వస్తావు!” అన్నారు.  బాబా మాటలు సరిగ్గా అర్ధం కాలేదు మహల్సాపతికి. అతడామాటలు అంతగా పట్టించుకోలేదు.

తర్వాత బాబా మహాసమాధి కి కొద్ది రోజుల ముందు ఇటుక విరిగినప్పుడు బాబా “విరిగిన ఇటుక చూచి ” దానిని చెక్కిలికి ఆనించుకొని కన్నీరు కారుస్తూ, “విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్ధం. ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం. దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది. అది విరిగిపోయింది. ఇక నేనెక్కువ కాలం జీవించాను” అన్నారు.

అలాగే అక్టోబర్ 15,1918న బాబా మహా సమాధి చెందారు. జీవితాంతం నీడవలె ఆయనను వెంటనంటి సేవించిన మహాల్సాపతి ఆ విఘాతానికి తట్టుకోలేకపోయారు. నాటినుండి 13 రోజులపాటు అతడాన్నపానీయలు గూడా ముట్టలేదు.

బాబా అప్పుడప్పుడు తమ నిర్యాణం గురించి గుప్తంగా చేసిన సూచనలన్నీ అతనికి అప్పుడు క్రమంగా అర్ధమవసాగాయి.  సాయి సన్నిధిలో అతనలవరచుకున్న భక్తీ, వివేకం తిరిగి శక్తి పుంజుకున్నాయి. మహాసమాధి వలన బాబా ఉనికికేమి భంగం లేదన్న విశ్వాసం బలపడింది.

బాబా మహాసమాధి చెందిన తరువాత కూడా మహల్సాపతి ఎప్పటిలాగే మసీదులో కూర్చొంటూ ఉండేవారు.  బాబాకు పూజ చేసేవారు.  రోజువిడచి రోజు అక్కడే నిద్రిస్తూ ఉండేవారు.   ఆయన చనిపోయే వరకు ఈ విధంగా జరిగింది.

మహాల్సాపతి దేహత్యాగం

అటువంటి మహానుభావుడుకి మరణించిన తరువాత సద్గతి కలుగకుండా ఎందుకు ఉంటుంది.  మన సాయినాధుని అపారకృపకు పాత్రుడు కాకుండా ఎందుకు ఉంటాడు. అందుకే ఆయన  భాద్రపద శుద్ధ ఏకాదశి సోమవారం దేహత్యాగము చేయడం, అది కూడా పూర్తి స్పృహతో, రామనామ జపం వింటూ ప్రాణం వదలడం అనే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది.

ముందుగా బాబా సూచించినట్లుగానే మహల్సాపతి 4 సంవత్సరాలకు  అంటే, 1918 బాబా మహాసమాధి తరువాత సరిగా 4 సంవత్సరాలకు  1922లో దేహత్యాగం చేసారు. అది సెప్టెంబర్ 11, 1922 వ సంవత్సరం ఆ రోజున తన తండ్రికి శ్రాద్ధకర్మలు నిర్వర్తించి వచ్చిన వారికి భోజనాలు పెట్టి తన బంధుమిత్రులతో కూర్చుని ఉన్నారు. తాంబూలం వేసుకుని బాబా ఇచ్చిన కఫిని ధరించి కూర్చున్నారు. అక్కడ ఉన్న తన స్నేహితులైన బాలా గురవ్ మరియు రామచంద్రకోతె లాంటివారిని రామనామ జపం చేయమని అడిగారు. అప్పుడు తన కొడుకును పిలిచి తన దగ్గర ఉన్న చిన్న కర్రను ఇచ్చి ఈ విధంగా చెప్పారు. “ఎప్పుడూ ధర్మ మార్గంలో జీవించు. భక్తియే ఉత్తమ మార్గము, మంచి కార్యక్రమాలు చేస్తూ భక్తి మార్గంలో జీవించమని” చెప్పారు.

అందరూ రామ భజన చేస్తూ ఉంటే అది వింటూ, తనూ రామ! అనే శబ్ధాన్ని పలుకుతూ తన చివరి శ్వాస వదిలి ప్రాణాన్ని వదిలేశారు. ఆయన బాబా కృపతో ఎంతో సునాయాసమైన మరణాన్ని పొందటం జరిగింది. అదియును కాక ఆయన ముందుగానే నేను స్వర్గానికి వెళ్తున్నాను అని అదే రోజు అక్కడ ఉన్నవారికి కూడా చెప్పారు. ఆయన చేసిన సేవ, నడిచిన ధర్మమార్గము, అత్యంత భక్తి ఆయన్ని పరమపథానికి చేర్చాయి.

మొదటిసారిగా బాబాను “సాయి” అని స్వాగతించి 1886 సంవత్సరంలో 72 గంటలపాటు బాబా శరీరాన్ని ఆయన చెప్పిన మాటల మీద పరిపూర్ణ విశ్వాసంతో కాపాడిన మహల్సాపతి ధన్యజీవి.  బాబా తాను సమాధి చెందిన తరువాత  కూడా యిప్పటికీ ఆయన తన భక్తులనెందరినో అనుగ్రహిస్తూనే ఉన్నారు.
సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles