Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
సర్వదేవతా స్వరూపుడు బాబా. కోరుకున్న దేవుణ్ణి, తనలో దర్శించవచ్చంటారాయన. అందుకు అనేక దృష్టాంతాలు అడుగడునా కల్పించేవారు బాబా.
నిమోన్కర్ బాబా భక్తుడు. అతని కుమారుడు మాత్రం బాబా భక్తుడు కాదు. అతనికి మారుతి అంటే మహాప్రీతి. అయినా తండ్రితో పాటుగా ద్వారకామాయికి చేరుకుని బాబాని సేవించేవాడతను.
ఏనాటికయినా రామభక్త హనుమాన్‌ని దర్శిస్తాననేవాడు. బాబా ఆ అవకాశాన్ని కల్పిస్తాడని మనసులో విశ్వసించేవాడు.
ఒకరోజు బాబా పాదాలను శుభ్రం చేస్తున్నాడతను. శుభ్రం చేస్తూ మారుతిని స్మరించసాగాడు. మారుతి నామ జపంలో మునిగిపోయాడు.
అప్రయత్నంగా తలెత్తాడు. బాబాని చూశాడు. గద్దె మీద బాబా లేరప్పుడు. అక్కడ మారుతి కూర్చుని ఉన్నాడు.
అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.పక్కన కూర్చున్న శ్యామాని కేకేశాడతను.
‘‘శ్యామా నా మారుతి, నా మారుతి ఇదిగో, ఇక్కడ ఈ గద్దె మీద కూర్చున్నాడు. చూడు, దండం పెట్టుకో.’’నవ్వుతున్న బాబాకి శ్యామా చేతులు జోడించి, నమస్కరించాడు.
అడిగిన వరం ఇచ్చేవాడు బాబా. కావాలన్న దేవుడి రూపంలో కొలువుదీరేవాడు బాబా. భక్తులకి ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇది చాలు, అనుకున్నాడు శ్యామా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా గద్దె మీద లేరు. ఉయ్యాల బల్ల మీద పడుకుని కనిపించసాగారు
- ‘‘లే బాబా లే! గద్దె మీద నుంచి లే’’
- అబ్బా! దెబ్బ…..సాయి@366 సెప్టెంబర్ 28….Audio
- అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు…. మహనీయులు – 2020… ఏప్రిల్ 4
- బాబా అని ముందు పిలిచింది ఎవరు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments