అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు…. మహనీయులు – 2020… ఏప్రిల్ 4



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ తన ఇంట్లో జరిగే అన్నదాన కార్యక్రమానికి దయతో హాజరుకమ్మని ఉత్తరం ద్వారా విన్నవించుకున్నాడు సాయిబాబాను.

ఏప్రియల్ 4 (1889)న నరసింహం జన్మించారు. అయన పాండురంగని భక్తుడైనాడు. అన్నదానం ఆయనకు ఇష్టమైన సేవ.

31 . 10 . 1925 (క్రోధననామ సంవత్సరం కార్తీక శుద్ధ పూర్ణిమ)న చిలకలపూడి పాండురంగ ఆలయంలో తన పేరున అన్నదానం జరుగుతుందని దానికి రాధా, రుక్మిణీ, సత్యభామా, సమస్త దేవతా సమేతంగా పాండురంగడు రావలెనని, వచ్చినట్లు ఒక నిదర్శనం చూపవలెనని నరసింహంగారు పండరీపురంలోని విఠలునకు ఆహ్వానం పంపినారు.

బి.వీ.దేవ్ గారి సంఘటనలో సాయిబాబాయే విందుకు రావలెనని ఉన్నది కాని, వచ్చినట్లు నిదర్శనము చూపమని సాయికి వ్రాసిన ఉత్తరములో లేదు.

అన్నదాన కార్యక్రమము రోజున పాండురంగడు వచ్చినట్లు నిదర్శనం లభించలేదు నరసింహంగారికి.

వెంటనే ఆయన “జయ జయ విఠల్, జయ జయ విఠల్” అని ఆనంద నృత్యం చేస్తూ నేలమీద పడినారు నిదర్శనము కొరకు.

కొంతసమయం గడిచింది. అక్కడున్న ఒక్క భక్తునిపై పాండురంగ విఠలుడు ఆవేశించి, “వచ్చితి లెమ్ము” అంటూ నరసింహంగారి చేయి పట్టుకుని లేపినాడు.

అప్పుడు భక్త నరసింహంగారు తృప్తిచెంది. దేవునికి నైవేద్యము సమర్పించి, ఇక జన సమూహమునకు అన్నదానము ప్రారంభించెను. ఆ దినము పర్వదినం.

చిలకలపూడి చెంతనే సముద్రముండుటచే, సముద్ర స్నానము చేసి వేలాది భక్తులు నరసింహంగారు చేయు అన్నదానానికై రాసాగిరి.

భోజన పదార్దములు తయారు చేసినది కొన్ని వందలమందికి మాత్రమే. రానున్నది వేల సంఖ్యలో భక్తులు.

వెంటనే నరసింహంగారు మరల “నీ ఆశ్రిత వాత్సల్యము ప్రకటించు సదవకాశమిది. ఈ మహత్కార్యము నీకు తప్ప ఇతరులకు అసాధ్యము. దీనిని శీఘ్రముగా నిర్వహింపుము” అని ప్రార్ధించి భూమిపై పడినారు నరసింహంగారు.

భక్తుని కార్యము భగవంతునిదే కదా! అన్నదాన కార్యక్రమము నిర్విఘ్నంగా జరిగింది.

పాండురంగడు చిలకలపూడిలో (కీర పండరీపురము) 1929 శుక్లనామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశినాడు (బుధవారం, 13 . 11 . 1929 ) పగలు ప్రకటన కాగలనని నరసింహంగారికి తెలియచేసెను.

ఏర్పాట్లు జరిగాయి. పోలీసు బలగాలు పాండురంగడు ప్రత్యక్షమగు మందిరము చుట్టూ కాపలా ఉన్నారు. భక్తులు అతృతతో పాండురంగని దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.

తలుపులు తెరచుకున్నవి. అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ (చిలకలపూడిలో) కొలువు తీరాడు. ఈ పాండురంగడు స్వయంభువు.

స్వయంభువు పాండురంగని దర్శనం చేయిస్తున్న నరసింహంగారి జయంతి 4 ఏప్రియల్ (ఆంగ్ల కాలమాన ప్రకారం). నరసింహంగారిని పాండురంగని ఆశీస్సులు వేడెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles