వాడే వీడు! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 2



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా తన భక్తుడైన నానా సాహెబ్ చాందోర్కరు దారిలో ఉన్న దత్తాత్రేయుని దర్శించనందులకు కోపగించారు.

“అదిగో అల్లదిగో హరివాసము…” అంటూ ఎంతో దూరాన ఉన్న తిరుపతి వేంకటేశ్వరుని దర్శించినంత సంబరపడిపోతాడు అన్నమయ్య.

అది పండరీపురం. పాండురంగడు కౌలువైవున్న ధామము. ఆ పాండురంగని దివ్య ఆలయపు గోపురం (కలశం) చూడటానికి కూడా ఇష్టపడని వ్యక్తి నరహరి సోనార్.

ఇతడు చేయితిరిగిన స్వర్ణకారుడు, శివభక్తుడు. శివ దీక్షాపరుడు. శివుడే పరమ దైవమని ప్రగాఢంగా నమ్మిన వాడు.

అంతవరకూ అందరకూ ఆమోదయోగ్యమైన విషయమే అది. కానీ శివుని కంటే విష్టువు తక్కువ అనే అభిప్రాయం అతనిది.

పండరీపురంలో నివసించే ఒక వర్తకునికి పాండురంగని దయవలన కుమారుడు పుట్టాడు.

కృతజ్ఞతగా ఆ వర్తకుడు కర్గోలా అనే ఆభరణాన్ని పాండురంగనికి సమర్పించ దలచి అది చేయగల సమర్థుడు నరహరి.

అతనికి గల విష్టు ద్వేషం వర్తకునకు తెలిసినా, నరహరి గొప్ప పనివాడు కాబట్టి, ఆ ఆభరణాన్ని అతనిచే చేయించ దలచాడు.

పాండురంగని నడుము కొలతలు కావాలన్నాడు. ఇచ్చాడు వర్తకుడు. ఆభరణం సరిపోలేదు. మరోసారి, మరోసారి నడుము కొలతలు ఇచ్చినా ఆభరణం పాండురంగనికి అమరలేదు.

ఇలా కాదని, నరహరే స్వయంగా కళ్ళకు గంతలు కట్టుకుని విగ్రహపు కొలతలు తీసుకోనారంభించాడు.

గంతలు కట్టుకున్న నరహరి విగ్రహాన్ని తడిమి చూస్తుంటే అది శంకరుని విగ్రహమా అన్నంత అనుభూతి కలిగింది.

ఐదు ముఖాలు, జటాజూటముతో ఉన్న శివ విగ్రహమే అనుకున్నాడు. ఇది విష్ణు విగ్రహము కాదు, ఆ పంచ ముఖ శివునిదే అని అనిపించింది.

ఏది చూద్దామని గంతలు తీశాడు, పాండురంగని విగ్రహమే అది!

పొరపడ్డానా అని గంతలు కట్టుకుని విగ్రహాన్ని తడిమాడు. అది తన శివ మూర్తియే. మరల గంతలు తీసి చూస్తే పాండురంగడే, తిరిగి గంతలతో చూస్తే శివుడనే అనుభూతి దృఢమైంది.

ఏమిటీ మాయ? తన భావనలో లోపమా? తన దృష్టిలోపమా? తర్కించుకున్నాడు. నరహరిలో జ్ఞాన జ్యోతి వెలిగింది. శివ కేశవులు ఒక్కరేనని గ్రహించాడు.

“నన్ను నీవానిగా స్వీకరించవయ్యా!” అని ఎలుగెత్తి ఆక్రోశించాడు నరహరి. రంగని భక్తుడైనాడు.

జ్ఞానేశ్వర్, నామదేవులతో తీర్థయాత్రలు చేశాడు. జ్ఞానేశ్వర్ మహాసమాధి సమయంలో నరహరి అక్కడే ఉన్నాడు. అతడు అనేక అభంగాలు వ్రాశాడు. అన్నీ ప్రాచుర్యం పొందాయి.

ఈయన ఫిబ్రవరి 2, 1314లో దేహాన్ని విడిచాడు.

మనకు కూడా ఇతర దేవీ, దేవతామూర్తులు మన దైవముకంటె భిన్నులుగారనే అభిప్రాయము కలగాలని, స్థిరపడాలని కోరుకుందాము!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles