బాబా గద్దె మీద లేరు. ఉయ్యాల బల్ల మీద పడుకుని కనిపించసాగారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

‘‘బాబా’’ అంటూ కంగారుపడసాగాడు శ్యామా. అతన్ని వారించి, మీదకి చూపించాడు తాత్యా. చూసి ఆశ్చర్యపోయాడు శ్యామా.

డేంగలే ఇచ్చిన చెక్కబల్ల పైకప్పుకి ఉయ్యాలలా వేలాడుతోంది. చింకిగుడ్డలతో వేలాడుతోందది. ఆ ఉయ్యాలకి నాలుగు మూలలా నాలుగు ప్రమిదలు ఉన్నాయి. ఆ ప్రమిదల్లో దీపాలు ఉన్నాయి.

ఆ దీపాల మధ్య దేదీప్యమానంగా వెలుగుతూ నిద్రిస్తున్నారు బాబా. నాలుగు మూరల పొడువూ, జానెడు వెడల్పున ఉన్న చెక్కబల్ల మీద నేల మీద అయితే పర్వాలేదు. పడుకోవచ్చు.

అంతెత్తున దీపాల మధ్య పడుకోవడం అసాధ్యం. పైగా చింకి గుడ్డలతో వేలాడుతోంది బల్ల. అదేమయినా తేలిక బల్లా, అంటే కాదు, చాలా బరువు గల బల్ల అది. పైగా దాని మీద బాబా పడుకుని ఉన్నారు. బాబాని, బల్లనీ చింకిగుడ్డలు మోయడం చిత్రం.

ఇదే చిత్రం అనుకుంటే ఇంకో చిత్రం ఏమిటంటే, ఉయ్యాల చాలా ఎత్తున ఉన్నది. ఎగిరి కూడా మనిషి అందుకోలేడు దాన్ని. అంత ఎత్తున ఉన్న ఉయ్యాల మీదకి బాబా ఎలా చేరగలిగారు? చేరేరు సరే, దిగడ ఎలా?శ్యామాకేదీ అంతుచిక్కలేదు.

దగ్గరగా నిచ్చెన ఉన్నదేమోనని చూశాడు. లేదు.‘‘అంతెత్తున చెక్కబల్ల, దాని మీద బాబా అంతుచిక్కట్లేదు.’’ అన్నాడు శ్యామా.

‘‘బాబా ఎప్పుడు ఎవరికి అంతుచిక్కారు కనుక, పద.’’ అన్నాడు తాత్యా. శ్యామాని తీసుకుని బయటికి నడిచాడు.

చూసింది చూసినట్టుగా తాత్యా మరచిపోయాడు. శ్యామా మరువలేదు. ఉయ్యాల బల్ల మీద బాబా నిద్రించడాన్ని కథగా చెప్పుకొచ్చాడు అందరికీ.

దాంతో అంతెత్తున చెక్కబల్ల మీదికి బాబా ఎలా చేరగలుగుతున్నారన్నది చూడాలని భక్తులు ఉత్సాహపడ్డారు. మసీదు కిటికీల మాటున కాపేశారు. రాత్రి పదకొండు, పన్నెండు, ఒంటిగంటయినా బాబా బల్ల మీదకి పోరే!

గద్దె మీదే కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నారు. ఒంటిగంటన్నరకి కళ్ళు మూతలు పడసాగాయి భక్తులకి.

క్షణం కళ్ళు మూసుకున్నారంతా. అంతలోనే మెలకువ తెచ్చుకుని చూశారు.

బాబా గద్దె మీద లేరు. ఉయ్యాల బల్ల మీద పడుకుని కనిపించసాగారు.‘‘ఇదెలా సాధ్యం?’’ అనుకున్నారంతా.

బాబా బల్ల మీదికి ఎలా చేరగలుగుతున్నారన్నది తెలుసుకోవాలనుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువయింది. కిటీకీల మాటున కోలాహలం వినిపించసాగింది. గమనించారది బాబా.

నిద్రలు మానుకుని తనని గమనిస్తూ భక్తులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం ఇష్టం లేకపోయింది బాబాకి. ఆలోచించి ఆలోచించి ఉయ్యాల బల్లని ముక్కలు చేసి, ధునిలో వేశారు.

‘‘ఎందుకు బాబా ఇలా చేశారు?’’ అడిగాడు శ్యామా.‘‘కారణం నువ్వే’’ అని నవ్వారు బాబా.అవును! కారణం తనే! చూసింది చూసినట్టుగా పదిమందికీ చెప్పి, బాబాకి పడుకునేందుకు ఆ మాత్రం చెక్కబల్ల కూడా లేకుండా చేశాడు. తప్పు చేశాననుకున్నాడు శ్యామా. కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles