భక్త మహల్సాపతి 6వ బాగం..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

నిగోజ్‌పాటిల్ భార్యను రక్షించే ప్రయత్నం

ఒకసారి మహల్సాపతి రోజూ మాదిరిగా, తన ప్రక్కను పరచి పడుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు బాబా మహల్సాపతితో ఇలా అన్నారు. ” రా! ఈ రోజు మనము ఒకరిని రక్షించాలి. ఒక భయంకరమైన రోహిల్లా(ప్లేగువ్యాధి) నిగోజ్‌పాటిల్ భార్యను తీసుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను అల్లా నామస్మరణలో ఉంటాను. నన్ను ఎవరు ఇబ్బంది పరచకుండా చూసే బాధ్యత నీది” అని చెప్పారు.

అప్పుడు మహల్సా మేలుకొని జాగ్రత్తగా ఎవరు అటువైపు రాకుండా చూస్తున్నారు. ఇంతలో నేవాస గ్రామ మామల్తాదారు అతని మనుషులతో రావడం జరిగింది. వారు బాబా దర్శనం కోసం వచ్చారు. కాస్తంత ఊదీ తీసుకుని వెళ్ళాలని వారి అభీష్టం. మహల్సా ఎంత నివారించిన వారు అతని మాట లెక్కచేయలేదు. కాని వాళ్ళు ఊదీ అయినా తీసుకువెళ్తాము అని ద్వారకామాయిలో ప్రవేశించడం జరిగింది. అప్పుడు బాబా సమాధి నిష్ట కి భంగం వాటిల్లింది. బాబాకు బాగా కోపం వచ్చింది.

“అరే భగత్ నీకు భార్య పిల్లలు ఉన్నారు, ఎందుకు అర్ధం చేసుకోలేదు, నీకు నిగోజ్‌పాటిల్ పరిస్థితి తెలుసు ఇప్పుడు నేను చేసే పనిలో భంగం వాటిల్లింది. పాటిల్ భార్య చనిపోయింది. సరే ఏం జరిగిందో అదీ మన మంచికే, కాని ఇంక ఎప్పడూ  ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకో” అని హెచ్చరించడం జరిగింది.

ఆ తరువాత మహల్సా దాదాపు నలబైఏళ్ళు బాబా జరిపిన లోక కళ్యాణంలో భాగంగా నిలిచారు. ప్రతిరోజు వారు నిద్రించకుండా బాబా గుండెలపై చేయి ఉంచి భక్తులను సంరక్షించడం జరిగింది. అటువంటి మహానుభావుడైన మహల్సాపతి గురించి విన్నా చదివినా, అది మన పూర్వజన్మ పుణ్యం.

బాబా అనుగ్రహంతో మార్తాండ్ జననం

బాబాకు మహల్సాపతి మీద ప్రీతి.  అందువల్ల అతనిని యింటికి వెళ్ళిపొమ్మని, మరలా రెండవ కుమారుని కోసం ప్రయత్నించమనీ అనేకసార్లు బాబా సలహా యిచ్చారు.  అది 1896వ సంవత్సరం, బాబా ఒక రోజు మహల్సాపతికి ఇట్లా చెప్పడం జరిగింది. “అరె భగత్: ఈ ఫకీరు మాట కొంచం విను, నా మాటలు సత్యం, నువ్వు ఎప్పుడూ ఇక్కడే నిద్రపోతావు ఇక నుంచి ఇంటి దగ్గర నిద్రపో. నీకు ఒక కొడుకు పుడతాడు”

అయినా మహల్సాపతి బాబాను వదలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆయనకు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేకపోవడం వల్ల బాబా చెప్పిన మాటలను ఆయన పాటించలేదు. నిజానికి ఆయనకు మరొక కొడుకుని కందామనే కోరిక లేదు.

ఒక రోజున కృష్ణాష్టమినాడు కాశీరాం షింపీ బాబా ఆజ్ఞ ప్రకారం మహల్సాపతిని బలవంతంగా ఆయన యింటికి తీసుకొని వెళ్ళి యింటి లోపల వుంచి  బయట తాళం పెట్టేసారు. 1896 జన్మాష్టమికి ఆయన ఇంటి దగ్గర నిద్రపోవడం మొదలుపెట్టాడు. ఈ విధంగా మహల్సాపతి పూర్తిగా ఒక సంవత్సరం యింటిలోనే ఉండిపోయాడు.

సరిగ్గా ఒక సంవత్సరంలో బాబా అనుగ్రహంతో 1897 లో ఆయనకు కుమారుడు జన్మించాడు.  బాబా సూచించిన ప్రకారం కొడుకుకి ‘మార్తాండ్’ అని నామకరణం చేశారు. ( మార్తాడ్ తన కొడుకులను కూతుళ్ళను పెంచి పెద్ద చేసి, 1986 లో మరణించాడు.)  ఆయనకు కొడుకు పుట్టిన తరువాత మరల బాబాతో నిద్రించడం జరిగింది.

రేపు తరువాయి బాగం…

ఓం శ్రీ సాయి రామ్ !

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

  

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles